తెలంగాణలోని టీఆర్ఎస్పై గవర్నర్ తమిళి సై (TamiliSai )మరోసారి మండిపడ్డారు. షర్మిల అరెస్టుపై స్పందించిన గవర్నర్.. మహిళా నేతలను గౌరవంగా చూడాలని సూచించారు. న్యూస్18కు ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆమె అనేక అంశాలపై స్పందించారు. షర్మిల అరెస్ట్ జరిగిన తీరు ఖండించదగిన విషయమని అన్నారు. ఈ విషయంలో తాను నివేదిక అడిగానని అన్నారు. అయితే డీజీపీ(DGP) తన కార్యాలయాన్ని గౌరవించరని ఆరోపించారు. వారు తన పట్ల ఎలాంటి గౌరవం చూపరని అన్నారు. తాను పదే పదే అడుగుతున్నప్పటికీ.. జిల్లాలకు వెళితే ఎస్పీ రావడం లేదని అన్నారు. గవర్నర్ను గౌరవించవద్దని వారికి పై నుంచి ఆదేశాలు ఉన్నాయని తమిళిసై ఆరోపించారు.
తెలంగాణ (Telangana) ప్రభుత్వం తన విషయంలో కనీస ప్రోటోకాల్ కూడా పాటించడం లేదని.. ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని గవర్నర్ విమర్శించారు. తన పర్యటనలకు హెలికాప్టర్ ఇవ్వలేదని.. ఇది తెలంగాణ పాలకుల ఆలోచనా ధోరణిని తెలియజేస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. తాను తన పర్యటనల కోసం రైలులో వెళ్ళానని చెప్పుకొచ్చారు. వాళ్లు తన అర్హత అడుగుతున్నారని.. వారి కంటే తనకు ఎక్కువ అర్హత ఉందని చెప్పారు.
#Live: #Congress's 'raavan' jibe, #PMModi hits back: Has PM weaponised Congress's barbs again? Watch #NewsEpicentre with @maryashakil https://t.co/vR1pI5jXHm
— News18 (@CNNnews18) December 1, 2022
తన కార్యాలయాన్ని గౌరవించాలని తాను కోరుకుంటున్నానని గవర్నర్ తమిళిసై మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా జాప్యం చేస్తున్నట్టు వస్తున్న ఆరోపణలను గవర్నర్ తమిళిసై ఖండించారు. తాను ఆ బిల్లులను పరిశీలిస్తున్నానని అన్నారు.
Rajanna Siricilla: పంట చేతికొచ్చినా తప్పని ఇబ్బందులు.. రైతుల సమస్యలు పట్టవా..?
YS Sharmila: షర్మిలకు ఇప్పటికైనా పొలిటికల్ మైలేజీ వస్తుందా ? ఆ పరిస్థితి మారకపోతే అంతేనా ?
వీసీల నియామకంలో గవర్నర్ పాత్ర ప్రభావం చూపుతుందని అన్నారు. గవర్నర్ కార్యాలయం పాదర్శకంగా పని చేస్తుందని చెప్పారు. వారు సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని.. తనపై ఆరోపణలు చేసి గవర్నర్ను అవమానిస్తున్నారని తమిళిసై అన్నారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వాలుగా ఉన్న వ్యవహారంపై కూడా తమిళిసై స్పందించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమస్యలు ఉన్నందున ప్రభుత్వాలు సమస్యలను రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం గవర్నర్లపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.