గోషామహల్ ఎమ్మెల్యే(Goshamahal mla) రాజాసింగ్ (Rajasingh)బుల్లెట్ ప్రూఫ్ వాహనం(Bullet proof vehicle)నడిరోడ్డుపై ఆగిపోయింది. అప్జల్‌గంజ్(Afzalgunj)మీదుగా వాహనంలో వెళ్తుండగా మొరాయించడంతో కారును మధ్యలోనే వదిలి నడుచుకుంటూ కొంతదూరం వెళ్లారు. అక్కడి నుంచి మరో వాహనంలో ఇంటికి చేరుకున్నారు రాజాసింగ్. అయితే తనకు ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం పదే పదే మొరాయించడంతో ఎమ్మెల్యే రాజాసింగ్ అసహనం వ్యక్తం చేశారు. కండీషన్లోని వాహనంలో తనకు ఏమాత్రం భద్రత ఉంటుందనే విషయాన్ని పోలీసు అధికారుల దృష్టికి గతంలో తీసుకెళ్లినప్పటికి పోలీసులు స్పందించలేదని రాజాసింగ్ అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
భద్రత సంగతేంటి..
పీడీ యాక్ట్(PD Act)కేసులో జైలు నుంచి రీసెంట్గా రిలీజైన రాజాసింగ్‌కు ఎక్కువ భద్రత ఉంచాల్సిన పోలీసులు ఇలాంటి కండీషన్లో లేని బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించడంపై ఆయన అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షరతులతో కూడిన బెయిల్‌పై వచ్చిన రాజాసింగ్ ఎలాంటి ప్రెస్మీట్లు, సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టవద్దని , మీడియాకు ఇంటర్వూలు ఇవ్వొద్దనే ఆంక్షల నేపధ్యంలో ఈ వ్యవహారం పెద్దగా వైరల్ కాలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Raja Singh, Telangana News