హోమ్ /వార్తలు /తెలంగాణ /

Breaking News: తెలంగాణ కాంగ్రెస్ కు కీలక నేత రాజీనామా..పోతూ పోతూ సంచలన వ్యాఖ్యలు చేసిన మర్రి శశిధర్ రెడ్డి

Breaking News: తెలంగాణ కాంగ్రెస్ కు కీలక నేత రాజీనామా..పోతూ పోతూ సంచలన వ్యాఖ్యలు చేసిన మర్రి శశిధర్ రెడ్డి

మర్రి శశిధర్ రెడ్డి

మర్రి శశిధర్ రెడ్డి

అనుకున్నదే జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ కు మరో కీలక నేత గుడ్ బై చెప్పారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపించినట్లు తెలిపారు. కాగా ఆయన బీజేపీలో చేరబోతున్నట్లు తెలుస్తుంది.  

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

అనుకున్నదే జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) కు మరో కీలక నేత గుడ్ బై చెప్పారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి  (Marri Shasidhar Reddy) తెలిపారు. తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపించినట్లు తెలిపారు. కాగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపిన ఆయన కాంగ్రెస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పీసీసీ చీఫ్ పదవి కోసం రూ.25 కోట్లు ఇచ్చారని ఓ ఎంపీ ఆరోపించారు. పార్టీలో ఎవరు డబ్బు ఇస్తే వాళ్ల మాట నడుస్తుంది. గత ఎన్నికల్లో ఏ సర్వే ద్వారా తనకు టికెట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ కుమ్మక్కయ్యారనే అపవాదు ప్రజల్లోకి వెళ్లిందన్నారు. రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ దిగజారుతుందని మర్రి శశిధర్ రెడ్డి  (Marri Shasidhar Reddy) వ్యాఖ్యానించారు.

Flash News: తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం..అందుకోసమేనా?

చాలా బాధతో కాంగ్రెస్ ను వీడుతున్నట్లు, ఈ పరిస్థితి వస్తుందని తాను అస్సలు ఊహించలేదని అన్నారు. తన ట్విట్టర్ లో Allways congress అని ఉంటుంది కానీ పరిస్థితులు మారిపోయాయని వ్యాఖ్యానించారు.  పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ ఎన్నికైన తరువాత జరిగిన ఎన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని, అది నయం చేయలేని స్థితికి చేరుకుందన్నారు. ఒక హోమ్ గార్డు కాంగ్రెస్ పార్టీ నుంచి పోతే పోయేదేమీ లేదన్నారు. ఇక ఇక్కడ జరిగేది ఏమి మాణిక్యం ఠాకూర్ కు తెలియదని చెప్పారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిలు పీసీసీలకు ఎంజెంట్లుగా మారారని ఆరోపించారు. ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన స్థితిలో కాంగ్రెస్ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించి అన్ని అంశాలను సోనియాగాంధీకి పంపించిన లేఖలో పొందుపరిచినట్లు తెలిపారు. అయితే ప్రస్తుత పరిస్థితిలో సోనియాగాంధీ కూడా నిస్సహాయురాలుగానే ఉన్నారని అన్నారు. కోకాపేట భూముల విషయంలో

అమిత్ షాను కలిశా..బీజేపీలో చేరబోతున్నా..

తెలంగాణలో కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితి లేదు. మొన్న అమిత్ షాను కలిశాను. త్వరలోనే బీజేపీలో చేరుతానని మర్రి శశిధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్, చీటర్. హోంగార్డు ఎప్పుడు Ips కాలేరని రేవంత్ అనడం సరికాదు. విహెచ్ పోతా అంటే గోడకేసి కొడతా అని రేవంత్ అనడం ఏంటని మండిపడ్డారు. రెడ్లే చాలు అన్న ధోరణిలో రేవంత్ ఉన్నారన్నారు. దుబ్బాక, హుజురాబాద్, మునుగోడులో కాంగ్రెస్ ఓడిపోయింది. ఓట్ల సంఖ్య తగ్గినా ఎవరికీ చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు.

కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్..

కాగా ఇటీవల మర్రి శశిధర్ రెడ్డి (Marri Shasidhar Reddy)ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. అమిత్ షాతో మర్రి శశిధర్ రెడ్డి భేటీ అవ్వడం, కాంగ్రెస్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంది. ఆరేళ్లపాటు ఆయనను కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్టు ప్రకటన చేసింది.  కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై వేటు వేసినట్లు తెలుస్తుంది. అయితే ఆయన బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తుంది.

First published:

Tags: Congress, Hyderabad, Telangana, TS Congress

ఉత్తమ కథలు