గతంలో పార్టీ అధిష్టానమే స్వయంగా చెప్పినా సిటీలో ఫ్లెక్సీల ఏర్పాటు చేసే సంప్రదాయాన్ని నేతలు మానడం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితీ(TRS)21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా అధికార పార్టీకి చెందిన నేతలు తమ ప్రత్యేకతను చాటుకునేందుకు సిటీ వ్యాప్తంగా చాలా ఫ్లెక్సీలు(Flexi)ఏర్పాటు చేశారు. దీనిపైన మొదట్నుంచి బీజేపీ(BJP) నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదులు చేశారు. దీనికి కొనసాగింపుగానే బుధవారం కూడా జీహెచ్‌ఎంసీ అధికారులు రోడ్లు కనిపించకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ బీజేపీ నేతలు సోషల్ మీడియా(Social media)వేదికగా మరోసారి ఫిర్యాదులు చేయడంతో అధికార యంత్రాంగం అధికార పార్టీ నేతలపై కొరడా ఝుళిపించింది. సిటీలో భారీ మొత్తంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ నేతలకు జరిమానా విధించింది. ప్లీనరీ సందర్భంగా ఎక్కువ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి భారీగా ఫైన్ కట్టాల్సిన వారిలో ముందు వరుసలో నిలిచారు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్(Talasani Srinivas Yadav). మంత్రిగారికి జీహెచ్‌ఎంసీ(Ghmc) అక్షరాల 50వేల రూపాయల ఫైన్ విధించింది జీహెచ్‌ఎంసీ. మంత్రితో పాటు మరో ముగ్గురికి కూడా జరిమానా విధించినట్లు ప్రకటించారు జీహెచ్‌ఎంసీ అధికారులు. అందులో సెకండ్ ప్లేస్‌లోని నిలిచారు. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే(Malkajgiri MLA) మైనంపల్లి హన్మంతరావు (Mainampalli Hanmantrao)కుమారుడు మైనంపల్లి రోహిత్. మైనంపల్లి రోహిత్(Mainampalli Rohit)కు 40వేల రూపాయల జరిమానా విధించారు. అలాగే ఖైరతాబాద్ (Khairatabad)ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender)కి 5వేల రూపాయలు, అంబర్‌పేట ఎమ్మెల్యే (Amberpet MLA)కాలేరు వెంకటేష్(Kaleru Venkatesh)కి 10వేల రూపాయల ఫైన్ విధించారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు.
ఫ్లెక్సీలు కట్టినందుకు ఫైన్..
టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ సందర్భంగా ఆ పార్టీ నేతలు నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని బీజేపీ గత మూడ్రోజుల నుంచి జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేస్తూనే ఉంది. వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తోంది. పబ్లిక్ ప్లేసుల్లో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం కారణంగా ప్రజలకు, ట్రాఫిక్‌కి ఇబ్బందికరంగా మారాయంటూ మరోసారి బుధవారం సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేయడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు జరిమానాలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అత్యుత్సాహానికి జరిమానా..
నగరంలో భారీ ఫ్లెక్సీలు, కటౌట్‌లు ఏర్పాటు చేయకూడదని..అలా చేస్తే తొలగించాల్సిందేనంటూ స్వయానా మంత్రి కేటీఆర్ ఆదేశించిన విషయాన్ని మర్చిపోయారా టీఆర్‌ఎస్ నేతలు అని గుర్తు చేస్తున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. అధికార పార్టీకి ఓ న్యాయం, ఇతర పార్టీలకు మరో న్యాయమా అంటూ నిలదీశారు. అలాగే 2020లో ప్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని జీవో నెంబర్ 68తీసుకొచ్చిన విషయం అధికారులకు గుర్తుకు రావడం లేదా అని గోషమహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. ఆ జీవోని కేవలం ప్రతిపక్ష పార్టీ నేతలకే వర్తిస్తుందా లేద అధికార పార్టీ నేతలకు వర్తించాదా అంటూ విమర్శలు చేయడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు గులాబీ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులపై ఈతరహా యాక్షన్ తీసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: GHMC, Telangana bjp, TRS leaders