హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana| BJP: బీజేపీలోని ఆ నేతల ఫోకస్ అంతా ఎమ్మెల్యే సీటుపైనే ?.. ఎవరి లెక్కలు వారికి ఉన్నాయా ?

Telangana| BJP: బీజేపీలోని ఆ నేతల ఫోకస్ అంతా ఎమ్మెల్యే సీటుపైనే ?.. ఎవరి లెక్కలు వారికి ఉన్నాయా ?

జేపీ నడ్డా, బండి సంజయ్ (ఫైల్ ఫోటో)

జేపీ నడ్డా, బండి సంజయ్ (ఫైల్ ఫోటో)

GHMC Corporators: జీహెచ్ఎంసీలో కార్పొరేటర్ అంటే ఓ మినీ ఎమ్మెల్యేకు ఉండే స్థాయి ఉంటుంది. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న అనేక మంది నేతల గతంలో కార్పొరేటర్లుగా వ్యవహరించారు.

తెలంగాణపై బీజేపీ సీరియస్‌గా ఫోకస్ చేస్తోంది. ఆ పార్టీ కార్యకలాపాలను బట్టి ఈ విషయం ఎవరికైనా అర్థమైపోతుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో(Telangana) కచ్చితంగా గెలవాలని భావిస్తున్న బీజేపీ.. ఇందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవద్దని నిర్ణయించుకుంది. ఒకప్పుడు కేవలం స్థానిక నేతల మాత్రమే తెలంగాణ రాజకీయాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను సిద్ధం చేయగా.. ఇప్పుడు అలాంటి వ్యూహాలను ఎక్కువగా ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఖరారు చేస్తోంది. తెలంగాణలోని కిందిస్థాయి నాయకత్వానికి కూడా బలోపేతం చేయాలని.. వారికి భరోసా కల్పించాలని నిర్ణయించుకుంది.

ఈ క్రమంలోనే ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi) జీహెచ్ఎంసీలోని(Greater Hyderabad Municipal Corporation) బీజేపీ కార్పొరేటర్లకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. వారితో గంటకుపైగా మాట్లాడారు. ఒక్కొక్కరి అభిప్రాయాలు తెలుసుకున్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అనే భరోసాను వారికి కల్పించారు. స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ అంతటి నాయకుడు తమతో మాట్లాడటంతో జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు ఆనందంలో మునిగిపోయారు. అయితే ఈ భేటీ తరువాత పలువురు బీజేపీ కార్పొరేటర్లు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి విజయం సాధించాలనే ఆలోచనకు వచ్చారని తెలుస్తోంది.

నిజానికి జీహెచ్ఎంసీలో కార్పొరేటర్ అంటే ఓ మినీ ఎమ్మెల్యేకు ఉండే స్థాయి ఉంటుంది. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న అనేక మంది నేతల గతంలో కార్పొరేటర్లుగా వ్యవహరించారు. అలా అలా రాజకీయంగా ఎదిగారు. దీంతో ఇప్పుడున్న కార్పొరేటర్లు కూడా రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నట్టు సమాచారం. ఇందుకోసం కొందరు కార్పొరేటర్లు అప్పుడే రాష్ట్ర, జాతీయ స్థాయి నేతల చుట్టూ తిరుగుతున్నారని తెలుస్తోంది.

ఆర్థికంగా బలంగా ఉన్న కొందరు కార్పొరేటర్లు.. ఈసారి పలు సెగ్మెంట్లలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కచ్చితంగా తమకే వస్తుందని ధీమాగా ఉన్నారు. అయితే కొన్ని సెగ్మెంట్‌లలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఇద్దరు ముగ్గురు కార్పొరేటర్లు పోటీపడుతుండటంతో.. వారిలో ఎవరికి ఛాన్స్ వస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది.

Telangana| BJP: బీజేపీకి ఈసారైనా ఆ లోటు తీరుతుందా ?.. మళ్లీ అలాగే జరుగుతుందా ?

KTR: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు.. టీఆర్ఎస్‌ అసంతృప్తి నేతల్లో కొత్త ఆశలు.. గతానికి భిన్నంగా..

అయితే బీజేపీ కచ్చితంగా ఎమ్మెల్యేలుగా పోటీ చేసే ఛాన్స్ ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్లకే ఎక్కువగా ఇస్తుందా ? లేక ఇందుకోసం ఇతర పార్టీల్లో ఇప్పటికే ఎమ్మెల్యే స్థాయిగా ఉన్న వ్యక్తులను పార్టీలోకి తీసుకొచ్చి అవకాశం కల్పిస్తుందా ? అన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. అయితే ఈసారి జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువమంది కార్పొరేటర్లు విజయం సాధించడం వల్ల ఈ రకమైన పోటీ నెలకొందనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.

First published:

Tags: Bjp, GHMC, Telangana

ఉత్తమ కథలు