హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Politics: నేనే లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు.. తెలంగాణ కాంగ్రెస్​ నాయకుడి సంచలన వ్యాఖ్యలు

Telangana Politics: నేనే లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు.. తెలంగాణ కాంగ్రెస్​ నాయకుడి సంచలన వ్యాఖ్యలు

చాలామంది కాంగ్రెస్​ నేతలు తెలంగాణ ఏర్పాటులో తమ ప్రమేయమే ఎక్కువగా ఉందని చెప్పుకుంటూ ఉంటారు. తాజాగా  కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.

చాలామంది కాంగ్రెస్​ నేతలు తెలంగాణ ఏర్పాటులో తమ ప్రమేయమే ఎక్కువగా ఉందని చెప్పుకుంటూ ఉంటారు. తాజాగా  కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.

చాలామంది కాంగ్రెస్​ నేతలు తెలంగాణ ఏర్పాటులో తమ ప్రమేయమే ఎక్కువగా ఉందని చెప్పుకుంటూ ఉంటారు. తాజాగా  కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.

  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం (Telangana State) ఏర్పడటానికి అటు రాజకీయ నేతలే కాకుండా ఇటు సామాన్య పౌరుడు కూడా రోడ్లపైకి వచ్చి కొట్లాడిన సంగతి తెలిసిందే. 2009 డిసెంబర్ 09న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రకటించాక.. యావత్​ తెలంగాణ సంబ్రమాశ్చార్యాలలో మునిగిపోయింది. అయితే తెలంగాణ ఏర్పడే సమయంలో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలో ఉంది. ప్రత్యేక తెలంగాణ కోసం అన్ని రాజకీయ పార్టీలతో అప్పటి టీఆర్​ఎస్​ అధినేత, ఇప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR)​ కొట్లాడిన సంగతి తెలిసిందే. దీనికి తెలంగాణలోని పలువురు రాజకీయ నాయకులు సైతం మద్దతు తెలిపారు. అనంతరం సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటించడం.. తెలంగాణ (Telangana) లో సంబురాలు అంబరాన్నంటడం జరిగిపోయాయి. అయితే ఇప్పటికే చాలామంది కాంగ్రెస్​ నేతలు తెలంగాణ ఏర్పాటులో తమ ప్రమేయమే ఎక్కువగా ఉందని చెప్పుకుంటూ ఉంటారు. అవి తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) ఎప్పటికప్పుడు హాట్​ టాఫిక్​గా మారిపోయేవి. తాజాగా  కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ (Former Union Minister Survey sathya narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన లేకుంటే తెలంగాణ రాష్ట్రం రాకపోయేదంటూ (Telangana would not have come without him) హాట్ కామెంట్స్ చేశారు.

  టీటీడీలో మెరుగ్గా పాలన..

  ఏపీ (AP)లోని తిరుమల శ్రీవారి సేవలో సర్వే సత్యనారాయణ  పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన సర్వే మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయని చెప్పారు. వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి టీటీడీలో మరింత మెరుగ్గా పాలన సాగుతోందన్నారు. ఇక్కడికి రావాలని ఎప్పుడూ అనిపిస్తుందని, కానీ స్వామి వారు అనుగ్రహం కలిగిన సమయంలో తిరుమలను సందర్శించుకుంటున్నానని ఆయన చెప్పారు.

  పుట్టినరోజు బహుమతిగా తెలంగాణ..

  సోనియా గాంధీ పుట్టినరోజు బహుమతిగా తెలంగాణ (Telangana) రాష్ట్రాని ఏర్పాటు చేసేలా చేశామని సర్వే సత్యనారాయణ తెలిపారు. సర్వే సత్యనారాయణ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు ప్రాంతాల అభివృద్ధి కోసం సోనియాను ఒప్పించి తెలంగాణ (Telangana) రాష్ట్రాన్ని సాధించామని ఆయన చెప్పారు. చిన్న రాష్ట్రాలుగా ఏర్పడితే ఆర్థికంగా అభివృద్ధి సాధ్యమని తాము భావించామని ఆయన అన్నారు.

  పుట్టినరోజు కానుకగా ఇవ్వాలని చెప్పా..

  ప్రత్యేక తెలంగాణ (Telangana) ఉద్యమంలో విద్యార్థులు చనిపోతున్నారు. మనం ఏం చేయాలని తాను సోనియా గాంధీని అడిగినట్లు సర్వే చెప్పారు. మనం నిజంగానే తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామా అని, యూపీఏలో మనది పెద్ద పార్టీ అని అయినా ఇతర పార్టీల సహకారం కావాలని ఆమె అన్నట్లు సర్వే తెలిపారు. ఓటమి, గెలుపు అనేది కాకుండా రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు మీ పుట్టినరోజు కానుకగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన ఇవ్వాలని కోరగా ఆమె అంగీకారం తెలిపినట్లు సర్వే చెప్పారు.

  వారి వల్లే కాంగ్రెస్​ నాశనం..

  అప్పటి మా కాంగ్రెస్ నేతల వల్లే రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పతనం అయిందని సర్వే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీలతోనూ కూటమి ఏర్పడకుండా పోటీ చేయాలని తెలంగాణ నేతలు చెప్పడంతో రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిందన్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోందని సర్వే అభిప్రాయపడ్డారు.

  First published:

  Tags: Survey, Telangana, Telangana Politics, TS Congress

  ఉత్తమ కథలు