Home /News /telangana /

TS POLITICS FORMER MP KONDA VISHWESHWAR REDDY REVEALED WHICH PARTY HE IS GOING TO JOIN PRV

Konda Vishweswar Reddy: ఏ పార్టీలోకి చేరబోతున్నది ప్రకటించిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​ రెడ్డి.. వివరాలివే..

కొండా విశ్వేశ్వర్ రెడ్డి (ఫైల్ ఫోటో)

కొండా విశ్వేశ్వర్ రెడ్డి (ఫైల్ ఫోటో)

రాజకీయాల్లో యాక్టీవ్ కావాలని భావిస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లేదా బీజేపీల్లో చేరాలని భావించారు. కానీ ఈ విషయంలో క్లారిటీ లేకపోవడంతో సైలెంట్ అయ్యారు. ఈ క్రమంలో తాజాగా తన నిర్ణయాన్ని ప్రకటించారు.

    చేవేళ్ల మాజీ  మాజీ ఎంపీ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy, a former MP from Chevella) అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల్లో యాక్టీవ్ కావాలని భావిస్తున్న ఆయన కాంగ్రెస్ (Congress) లేదా బీజేపీల్లో (BJP) చేరాలని భావించారు. కానీ ఈ విషయంలో క్లారిటీ లేకపోవడంతో సైలెంట్ అయ్యారు. ఈ క్రమంలో తాజాగా తన నిర్ణయాన్ని ప్రకటించారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. తాను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు  ప్రకటించారు.  విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా బలహీనపడిందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ కు అంత శక్తి లేదంటూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణవాదులను కేసీఆర్ మోసం చేశారని ఆయన మండిపడ్డారు. నియంత పాలనను అంతం చేయడం బీజేపీకే సాధ్యమని కొండా పేర్కొన్నారు.

    తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారు..

    ఉద్యమం చేసిన టీఆర్ఎస్ (TRS) పార్టీలో ప్రస్తుతం ఉద్యమకారులేవరు లేరని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఉద్యమకారుల వల్ల కుర్చీ ఎక్కి..ఇవాళ వారిని మరిచారని మండిపడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారున్నారని చెప్పారు. తెలంగాణను కోరుకున్న వారు టీఆర్ఎస్లో లేరన్నారు. కేసీఆర్ పక్కన పువ్వాడ, సబిత, తలసాని లాంటి వాళ్లు వున్నారని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తల దోపిడీ ఎక్కువైందని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ తొందర్లోనే ఖతం అవుతుందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి జోస్యం చెప్పారు. యాంటీ కేసీఆర్ ఓటు బీజేపీకే వెళ్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఐదు అంశాలపై బీజేపీని క్లారిటీ అడిగానని.. 2 అంశాలపై స్పష్టత ఇచ్చారని విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు.



    ఇప్పటికే మహారాష్ట్రలో అధికారం కోల్పోయిందని..

    గత రెండేళ్లుగా తెలంగాణ (Telangana) కోసం ఏది మంచిదైతే బాగుటుందని వివిధ రాజకీయ వ్యక్తులతో చర్చించానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కుటుంబ పాలన పోతేనే తెలంగాణ బాగుపడుతుందని నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఉందన్న ఆయన..ఇప్పటికే మహారాష్ట్రలో అధికారం కోల్పోయిందని..త్వరలో ఇతర రాష్ట్రాల్లోని ప్రజల విశ్వాసాన్ని కూడా కోల్పోతుందని జోస్యం చెప్పారు.బీజేపీ క్రమశిక్షణతో కూడిన పార్టీ అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. అందుకే బీజేపీలో చేరుతున్నానని చెప్పారు.

    ప్రస్తుతం తాను ఒక్కడినే బీజేపీ కండువా కప్పుకోబోతున్నాన్నారు కొండా . వివిధ జిల్లాల్లోని పలువురు నేతలు కూడా తనతో చేరుతామని చెబుతున్నారన్నారు. అయితే తాను బీజేపీలో ఎప్పుడు చేరేది..ఎక్కడ చేరేది ఎవరి ఆధ్వర్యంలో చేరేది అధ్యక్షుడు బండి సంజయ్ నిర్ణయం తీసుకుంటారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెల్లడించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలోనే చేరే అవకాశం ఉందన్నారు. తాను ఏ పదవి ఆశించి చేరడం లేదన్నారు. టికెట్ డిమాండ్ చేయలేదని చెప్పారు.

    రాజకీయ భవిష్యత్తు కోసం రాజకీయాల్లోకి రాలేదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ది... రంగారెడ్డి జిల్లా అభివృద్ది..అన్ని రంగాల్లో డెవలప్మెంట్ కావాలని రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Chevella, Konda Vishweshwar reddy, Telangana bjp, Telangana Politics

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు