TS POLITICS FORMER MP IS LIKELY TO JOIN THE BJP WHO TODAY MET BJP TELANGANA AFFAIRS IN CHARGE TARUNUCHUG AND PARTY CHIEF BANDI SANJAY PRV
Telangana Politics: బీజేపీలోకి మాజీ ఎంపీ..? పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్‌తో భేటీ..
ప్రతీకాత్మక చిత్రం
టీఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలకు బీజేపీ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేనంటూ తెలంగాణలో బలంగా చాటిచెబుతోంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నుంచి చేరికలను ఆహ్వానిస్తోంది.
తెలంగాణ (Telangana)లో అధికార టీఆర్ఎస్ (TRS) పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్ (Congress) పార్టీలకు బీజేపీ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేనంటూ తెలంగాణలో బలంగా చాటిచెబుతోంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నుంచి చేరికలను ఆహ్వానిస్తోంది. తాజాగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ( Konda Vishweshwar Reddy)తో బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్ (Tarun Chugh) బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) బుధవారం నాడు భేటీ అయ్యారు. బీజేపీ జాతీయ కార్యవర్గసమావేశాలకు ముందే కొండా విశ్వేశ్వర్ రెడ్డితో బీజేపీ నేతలు భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరుతారా లేదా అనే విషయమై ఆయన నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు. కానీ ఆయన సానుకూలంగా ఉన్నారనే ప్రచారం కూడా సాగుతుండడం గమనార్హం. అయితే ఈ ఏడాది జూలై 1 వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి తమ పార్టీలో చేరుతారనే ప్రచారం బీజేపీ వర్గాల్లో జోరుగా సాగుతుంది.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి (ఫైల్ ఫోటో)
కొండా విశ్వేశ్వరరెడ్డి.. తెలంగాణ ఉద్యమకారుడు.. మాజీ డిప్యూటీ సీఎం కేవీ రంగారెడ్డి (KV Rangareddy) మనవడు .. టీఆర్ఎస్ తరపున 16వ లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. పార్లమెంటు సభ్యునిగా పనిచేస్తున్నప్పుడు US పేటెంట్ పొందిన ఏకైక భారత పార్లమెంటేరియన్ ఈయనే కావడం విశేషం. అంతేకాదు 2014, 2018 తెలంగాణ ఎన్నికల టైంలో.. అఫిడవిట్ ఆధారంగా రిచ్చెస్ట్ పొలిటీషియన్‌గా నిలిచారు కూడా. 2013లో కేసీఆర్ (KCR) ఆహ్వానం మేరకు టీఆర్ఎస్లో చేరిన కొండా విశ్వేశ్వరరెడ్డి.. 2018లో టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. కిందటి ఏడాది మార్చిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అపోలో ఆస్పత్రుల వ్యవస్థాపకుడు ప్రతాప్ సి రెడ్డి కూతురు సంగీతా రెడ్డి (Sangeetha Reddy).. కొండా విశ్వేశ్వరరెడ్డి భార్య.
పాదయాత్ర సాగుతున్న సమయంలో..
కాంగ్రెస్ పార్టీకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఆయనతో బీజేపీ నేతలు టచ్ లో కి వెళ్లారు. చాలాకాలంగా ఆయనను బీజేపీలో చేరాలని ఆ పార్టీ అగ్రనేతలు కోరుతున్నారు. బీజేపీకి చెందిన కొందరు అగ్రనేతలు కూడా కొండా విశ్వేశ్వర్ రెడ్డితో గతంలో పలుమార్లు సమావేశమయ్యారు. బండి సంజయ్ పాదయాత్ర సాగుతున్న సమయంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, బండి సంజయ్ లు కొండా విశ్వేశ్వర్ రెడ్డితో భేటీ అయ్యారు. తాజాగా ఇవాళ హైద్రాబాద్ లోని ఓ హోటల్ లో బీజేపీ నేతలు కొండా విశ్వేశ్వర్ రెడ్డితో భేటీ అయ్యారు. అయితే గత కొద్దిరోజుల నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి చేరికలపై గట్టిగా తిరగడంతో పలువురు సీనియర్ నాయకులు హస్తం పార్టీలోకి వెళ్లారు. ఇక ఆలస్యం చేయకూడదనుకున్నారో ఏమో బీజేపీ కూడా రంగంలోకి దిగింది.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.