హోమ్ /వార్తలు /తెలంగాణ /

Komatireddy Rajgopal Reddy: ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి రాజీనామా..మునుగోడు అభివృద్ధి కోసమేనని కామెంట్

Komatireddy Rajgopal Reddy: ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి రాజీనామా..మునుగోడు అభివృద్ధి కోసమేనని కామెంట్

Rajagopal Reddy resign letter

Rajagopal Reddy resign letter

Telangana politics: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్‌రెడ్డి శాసనసభ సభ్యత్వానికి, కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. సోమవారం ఉదయం 10.30గంటలకు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి తన రాజీనామా పత్రాన్ని స్వయంగా తానే సమర్పించారు. దీంతో రాజగోపాల్‌రెడ్డి రాజీనామాను ఆమోదించినట్లుగా స్పీకర్ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మునుగోడు ఎమ్మెల్యే (Munugodu MLA) కోమటిరెడ్డి రాజ గోపాల్‌రెడ్డి(Komatireddy Rajgopal Reddy)రాజ తన శాసనసభ సభ్యత్వానికి, కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా(Resigned)చేశారు. సోమవారం ఉదయం 10.30గంటలకు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి (Speaker Pocharam Srinivas Reddy)రాజీనామా లేఖను అందజేశారు. రాజీనామా పత్రాన్ని స్వయంగా తానే సమర్పించారు. దీంతో రాజగోపాల్‌రెడ్డి రాజీనామాను ఆమోదించినట్లుగా స్పీకర్ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. 2018ఎన్నికల్లో మునుగోడు శాసనసభ నియోజకవర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు.

ఉపఎన్నికలకు లైన్ క్లియర్..

ఆ తర్వాత జరిగిన పరిణామాలు, పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదనే ఆలోచనతో ఆయన కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తారని ప్రచారం జరిగింది. దాన్ని నిజం చేస్తూ సోమవారం ఆయన ఎమ్మెల్యే పదవితో పాటు కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. గవర్నర్‌ తమిళిసైని కూడా కలవనున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.

మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా..

రాజీనామా అనంతరం రాజగోపాల్‌రెడ్డి వివరణ ఇచ్చారు. కేవలం మునుగోడు అభివృద్ది కోసమే తాను రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. తెలంగాణలో కేసీఆర్ అరాచక, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తన రాజీనామా అంశం ముందుకు వచ్చిందన్నారు. కేసీఆర్ి చేతిలో చిక్కిన తెలంగాణ తల్లిని కాపాడుకోవాలని అన్నారు. ఇక తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నట్లుగా మండిపడ్డారు రాజగోపాల్‌రెడ్డి.

(రాజగోపాల్‌రెడ్డి రాజీనామాపత్రం)
(రాజగోపాల్‌రెడ్డి రాజీనామాపత్రం)

గెలుపు మునుగోడు ప్రజలదే..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వేల్ తప్ప ఇంకే కనిపించడం లేదని మండిపడ్డారు రాజగోపాల్‌రెడ్డి. టీఆర్‌ఎస్‌ తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిందని విమర్శించారు. ఉప ఎన్నిక వచ్చాక మునుగోడు గుర్తొచ్చిందన్నారు. యుద్ధంలో మునుగోడు ప్రజలు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.

First published:

Tags: Congress, Komatireddy rajagopal reddy, Telangana Politics