హోమ్ /వార్తలు /తెలంగాణ /

Munugodu: ఇంటికి కిలో బంగారం ఇచ్చినా TRS​ గెలవదు..: రాజగోపాల్​ రెడ్డి

Munugodu: ఇంటికి కిలో బంగారం ఇచ్చినా TRS​ గెలవదు..: రాజగోపాల్​ రెడ్డి

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (ఫైల్ ఫోటో)

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (ఫైల్ ఫోటో)

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు . ఈ సందర్భంగా రాజగోపాల్​ రెడ్డి విమర్శలు గుప్పించాడు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  యాదాద్రి (Yadadri) భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో బీజేపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ నేత,  మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komati Reddy Rajagopal Reddy)  పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాజగోపాల్​ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ (BJP)తోనే కేసీఆర్‌ (KCR) దుర్మార్గ పాలన అంతమవుతుందని వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో గడియారాలు పంచుతున్నారని.. ఇంటికి కిలో బంగారం (KG Gold) ఇచ్చినా సరే టీఆర్​ఎస్​ (TRS)పార్టీ గెలవదని రాజగోపాల్​ రెడ్డి జోస్యం చెప్పారు.  మునుగోడు (Munugodu) అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్​ను  ఎన్నిసార్లు అపాయింట్​మెంట్ అడిగినా ఇవ్వలేదని రాజగోపాల్​రెడ్డి అన్నారు.. ఉప ఎన్నికలు రాగానే మీటింగ్​లు పెట్టి.. రైతులను భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు రాజగోపాల్​. సీఎం కేసీఆర్ పాలన అంతం బీజేపీతోనే సాధ్యమని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.


  అందుకే కాంగ్రెస్​ పార్టీ పడిపోతోంది..


  గతంలో జరిగిన దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసను ఎదుర్కొనే పార్టీ బీజేపీనే అని నిరూపించిందని రాజగోపాల్​ అన్నారు. కాంగ్రెస్ పార్టీని నడిపించే అధ్యక్షుడు సరిగ్గా లేరని అందుకే ఆ పార్టీ రోజురోజుకూ పడిపోతుందని రాజగోపాల్​రెడ్డి ఆరోపించారు. మునుగోడు నియోజక వర్గంలోని అన్ని మండలాల నుంచి 1500 మంది ముఖ్య కార్యకర్తలు ఆ నిర్ణయం మేరకే బీజేపీలో చేరారని తెలిపారు. ఉపఎన్నిక వస్తే ప్రభుత్వానికి అభివృద్ధి పనులు గుర్తుకొస్తాయని  విమర్శించారు. నియోజకవర్గంలో మూడున్నర ఏళ్లుగా జరగని అభివృద్ధి తన రాజీనామాతో జరుగుతుందని.. ఆ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాబోయే ఉప ఎన్నికలో కేసీఆర్​కు మునుగోడు ఓటర్లు తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.


  Munugodu: ప్రియాంక గాంధీతో భేటీ అనంతరం కోమటిరెడ్డి సంచలన నిర్ణయం.. వివరాలివే


  అంతకుముందు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో వీఆర్ఏల నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపారు  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 23 వేల మంది వీఆర్ఏలు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తుంటే కెసిఆర్ కు కళ్ళు మూసుకుపోయాయా? అంటూ ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులకుప్పగా కెసిఆర్ మార్చాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరు మీద ఆంధ్ర కాంట్రాక్టర్లకు లక్షల కోట్లు కట్టబెట్టారని అన్నారు.2014లో కేసీఆర్ కొడుక్కి, బిడ్డకి ఒక ఇల్లు కూడా లేదు.. ఇప్పుడు లక్ష కోట్లకు పడగలెత్తారని అన్నారు రాజగోపాల్ రెడ్డి. రాష్ట్రంలో కొన్ని కోట్లు ఖర్చుపెట్టి రైతువేదికలు నిర్మించారు అవి ఇప్పుడు నిరుపయోగంగా మారాయన్నారు.


  చౌటుప్పల్ వరదలతో మునిగిపోతుంటే సిద్దిపేట,సిరిసిల్లలో అభివృద్ధి చేస్తున్నారు దీనిని సమానత్వం అంటారా? అని ప్రశ్నించారు. కెసిఆర్ నియంత పాలనకు మునుగోడు నుండే ప్రజలు చరమగీతం పాడుతారని అన్నారు రాజగోపాల్ రెడ్డి. తెలంగాణలో మలి ఉద్యమం రాబోతుంది.. కేసీఆర్ కుటుంబానికి,తెలంగాణ ప్రజలకు మధ్య ఉద్యమం ప్రారంభమయిందన్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: CM KCR, Komatireddy rajagopal reddy, Munugodu By Election, Telangana Politics

  ఉత్తమ కథలు