టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) సొంత ఇలాకా కొండగల్ లో అధికార బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగలనుందా. సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు రేవంత్ (Revanth Reddy) పావులు కదుపుతున్నారా? త్వరలోనే ఆ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ను వీడి హస్తం గూటికి చేరనున్నారా? ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. మరి ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు? పార్టీని ఎందుకు వీడాలనుకుంటున్నారనేది ఇప్పుడు చూద్దాం..
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రలో పాల్గొన్న రేవంత్ రెడ్డి (Revanth Reddy) పార్టీ బలోపేతం కోసం దృష్టి పెట్టారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు గురునాథ్ రెడ్డి (Gurunath Reddy)తో రేవంత్ భేటీ అయ్యారు. ఈ భేటీలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) గురునాథ్ ను పార్టీలోకి ఆహ్వానించగా..దానికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఆయన బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని సమాచారం.
ఇదిలా ఉంటే కొంతకాలంగా మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి (Gurunath Reddy) బీఆర్ఎస్ లో ఇమడలేకపోతున్నారు. ఇక కొండగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో గురునాథ్ (Gurunath Reddy) కు విభేదాలు ఉన్నాయి. ఈ కారణంగా గురునాథ్ రెడ్డి బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని తెలుస్తుంది. పట్నం నరేందర్ రెడ్డితో విభేదాలతో ఆయన బీఆర్ఎస్ అంటీముట్టనట్టు ఉన్నారు. దీనితో రేవంత్ (Revanth Reddy) స్వయంగా రంగంలోకి దిగి పార్టీలోకి ఆహ్వానించారట. అంతేకాదు హాత్ సే హాత్ జోడో యాత్రకు మద్దతు ఇవ్వాలని గురునాథ్ రెడ్డిని రేవంత్ (Revanth Reddy) కోరినట్లు తెలుస్తుంది. రేవంత్ విజ్ఞప్తికి గురునాథ్ (Gurunath Reddy) సానుకూల వైఖరి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.
ఒకవేళ గురునాథ్ రెడ్డి (Gurunath Reddy) నిజంగానే బీఆర్ఎస్ ను వీడితే రేవంత్ సొంత నియోజకవర్గంలో పట్టు పెరిగినట్టు అని చెప్పుకోవచ్చు. అలాగే కొడంగల్ లో బీఆర్ఎస్ ప్రభావం కూడా తగ్గే అవకాశం ఉంది. మరి గురునాథ్ రెడ్డి (Gurunath Reddy) కాంగ్రెస్ లో చేరే అంశంపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BRS, Congress, Kcr, Mp revanthreddy, Telangana