Home /News /telangana /

TS POLITICS FORMER MLA DASOJU SHRAVAN WHO RESIGNED FROM CONGRESS MET BJP CHIEF BANDI SANJAY PRV

Dhasoju Sravan: బిగ్​ బ్రేకింగ్​.. బీజేపీలోకి దాసోజు శ్రవణ్​.. బండితో కలిసి ఢిల్లీకి పయనం..

బండి సంజయ్​తో దాసోజు వర్గం

బండి సంజయ్​తో దాసోజు వర్గం

కాంగ్రెస్ మాజీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నేడు టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వెంట ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడి బీజేపీ పెద్దలతో భేటీ కానున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    కాంగ్రెస్ (Congress) మాజీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ (Dhasoju sravan) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా (Resignation) చేసిన విషయం తెలిసిందే. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, టీ కాంగ్రెస్ ఎన్నికల వ్యుహాకర్త సునీల్, మాణిక్కాం ఠాగూర్లపై సంచలన ఆరోపణలు చేసి.. దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం దాసోజు శ్రవణ్ బీజేపీ 9BJP) తీర్థం పుచ్చుకోనున్నారు. నేడు టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (BJP Chief Bandi Sanjay)వెంట ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడి బీజేపీ పెద్దలతో భేటీ కానున్నారు.

    రాజకీయం అంటే కులం, ధనం..

    తెలంగాణలో కాంగ్రెస్‌ పరిస్థితి అయోమయంగా మారింది. ఎవరు పార్టీలోకి వస్తున్నారో..ఎవరు పార్టీని ఎప్పుడు వీడుతారో తెలియని గందరగోళం నెలకొంది. ఇప్పటికే నల్గొండ జిల్లాలో పట్టున్న నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీని వీడటంతో ..అక్కడ బలమైన నేత కోసం వెదుక్కునేలోపే కాంగ్రెస్ పార్టీకి మరో రూపంలో షాక్ తగిలింది. గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన దాసోజు శ్రవణ్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నట్లుగా ప్రకటించారు. పార్టీని వీడక ముందు జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న దాశోజు శ్రవణ్‌కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. కాగా, అంతకముందు రోజు మీడియాతో మాట్లాడిన దాసోజు.. 2014లో తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని.. ముగ్గురు పీసీసీ చీఫ్‌ల నేతృత్వంలో పనిచేశానని చెప్పారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు అందుకున్న తర్వాత పార్టీలో రాజకీయం అంటే కులం, ధనం అనే అరాచకమైన పరిస్ధితులు .. సామాజిక న్యాయ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా టీపీసీసీలో దుర్మార్గమైన పరిస్ధితులు చోటు చేసుకున్నాయన్నారు.



    ఈ పరిణామాలు తనను తీవ్రంగా కలిచివేశాయని.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. సోనియా, రాహుల్‌ల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా రేవంత్ పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల వ్యూహకర్త సునీల్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, పీసీసీ చీఫ్ రాహుల్ గాంధీలు కుమ్మక్కయ్యారని శ్రవణ్ ఆరోపించారు. రేవంత్ రెడ్డికి వీరిద్దరూ వత్తాసు పలుకుతూ... టీపీసీసీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

    టీపీసీసీ చీఫ్‌ మారిన తర్వాత నుంచి కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల్లో కాస్త అంటి ముట్టనట్లుగా ఉన్న శ్రవణ్‌కుమార్..ఆ తర్వాత గాంధీభవన్‌కి రావడం కూడా తగ్గించారు. ఖైరతాబాద్ కార్పొరేటర్, పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి కాంగ్రెస్‌లోకి చేరడంతో ఆయన మరింత అసంతృప్తి చెందినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నియోజకవర్గ సీటు దక్కదనే ఆలోచనతోనే తన పొలిటికల్ రూట్ క్లియర్ చేసుకోవడానికే కాంగ్రెస్‌కి గుడ్ బై చెప్పినట్లుగా తెలుస్తోంది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Bandi sanjay, Telangana bjp, Telangana Politics

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు