హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Politics: పాలేరు నుంచే తుమ్మల పోటీ .. ఏ పార్టీ తరపున అంటే ..!

Telangana Politics: పాలేరు నుంచే తుమ్మల పోటీ .. ఏ పార్టీ తరపున అంటే ..!

తుమ్మల నాగేశ్వరరావు (ఫైల్ ఫోటో)

తుమ్మల నాగేశ్వరరావు (ఫైల్ ఫోటో)

Tummala Nageswara rao: పాలేరు నుంచే కచ్చితంగా పోటీ చేస్తానని ప్రకటించిన తీరుతానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. ఆయన భవిష్యత్ రాజకీయాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ జిల్లా రాజకీయాల్లో విస్తృతమైన చర్చకు దారి తీసింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Khammam, India

(G.SrinivasReddy,News18,Khammam)

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాను వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం (Khammam)జిల్లాలోని పాలేరు నుంచే కచ్చితంగా పోటీ చేసి తీరుతానని ప్రకటించారు. పాలేరుpaleru నియోజకవర్గంలోని నెలకొండపల్లి మండలం కొత్తూరులో ఎన్టీఆర్(NTR) విగ్రహానికి పూలమాలు వేసిన అనంతరం కార్యకర్తలు, అనుచరుల్ని ఉద్దేశించి మాట్లాడారు. ఎన్టీఆర్ ఇచ్చిన అవకాశంతోనే  తాను ప్రజలు, రైతుల కోసమే 40 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నానన్నారు. ఇంత క్లారిటీ ఇచ్చిన తుమ్మల నాగేశ్వరరావు Tummala Nageswara raoఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననే విషయాన్ని మాత్రం ఎక్కడా ప్రస్తావించకపోవడం జిల్లా రాజకీయాల్లో విస్తృతమైన చర్చకు దారి తీసింది. కొద్ది రోజులుగా పార్టీ మారతారనే ప్రచారం జరుగుతుంటే తుమ్మల ఈతరహా స్టేట్‌మెంట్ ఇవ్వడంపై అనుచరులు ఆలోచనలో పడ్డారు.

Telangana: ఫ్యాన్సీ నంబర్లకు విపరీతమైన క్రేజ్ .. ఆర్టీఏ అధికారులకు భారీగా ఆదాయం .. ఎన్ని లక్షలంటే..?

ట్రయాంగిల్ ఫైట్ తప్పదా..?

మాజీ మంత్రి, సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ప్రజాప్రతినిధిగా తుమ్మల నాగేశ్వరరావుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉంది. అయితే టీడీపీలో దశాబ్ధాల కాలం పనిచేసి టీఆర్ఎస్‌లో చేరిన తుమ్మలకు మొదట్లో ఉన్నతమైన స్థానంలో కొనసాగారు. మంత్రిగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా పదవులు చేపట్టారు. మంత్రిగా పాలేరు నియోజకవర్గాన్ని  పూర్తి వ్యవసాయోగ్యంగా మార్చారు. భక్త రామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా దాదాపు 60 వేల ఎకరాల పంట పొలాలకు సాగునీరు అందించారు.

ప్రజల్లో ఆదరణ కలిగిన నేత..

అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రహదారుల అభివృద్ధి తుమ్మల వల్లే సాధ్యమైంది అన్నది నిర్వివాదాంశం. అభివృద్ధికి మారుపేరుగా నిలిచినప్పటికీ  2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కందాల ఉపేందర్ రెడ్డి ఆయనపై గెలిచారు. అనంతరం కందాల కూడా టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటినుంచి నియోజకవర్గంలో తుమ్మల వర్సెస్ కందల వర్గంగా పరిస్థితి మారింది. నియోజకవర్గంలోని దాదాపు ప్రతి గ్రామంలోనూ ఈ రెండు వర్గాలు నువ్వా నేనా అన్నట్టు సాగుతున్నాయి. అధికారికంగా ఏ కార్యక్రమం జరిగినా ఎక్కడో చోట రగడ జరుగుతూనే ఉంది.

తుమ్మల దారెటు..

ఆ మధ్య పాలేరు టికెట్ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకే ఇస్తారనే టాక్ వినిపించింది. ఓడిపోయినప్పటికి తుమ్మల పాలేరు నియోజకవర్గ ప్రజలకు టచ్‌లోనే ఉంటున్నారు. ఈమధ్య కాలంలో సిట్టింగులకే టికెట్ ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటనతో ఎమ్మెల్యే కందాల వర్గంలో జోష్ కనిపించింది. దీంతో తుమ్మల ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశం తెరపైకి వచ్చింది. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగినప్పటికి దాన్ని తుమ్మల వర్గం కొట్టిపారేసింది. నియోజకవర్గంలో ఆయనకున్న గ్రిప్, చేసిన అభివృద్ధి పనులు ఆధారంగా ఆయనకే టికెట్ ఇస్తారనే సర్వేలు కూడా చెబుతున్నాయి.

పాలేరు నుంచి పోటీ పక్కా..

మునుగోడు ఉపఎన్నికల సమయంలో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్న టీఆర్‌ఎస్‌ అదే పొత్తును వచ్చే ఎన్నికల వరకు కొనసాగిస్తుందా అనే సందేహాలు గందరగోళానికి తెర తీశాయి. అదే జరిగితే లెఫ్ట్‌ పార్టీలకు ఓటు బ్యాంకు ఉన్న ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలో ముఖ్యమైన సీట్లను కమ్యూనిస్ట్‌ పార్టీలు అడిగే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే పాలేరు నియోజకవర్గం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అడిగే పరిస్థితి ఉంది. ఇది ఆయన సొంత నియోజకవర్గం కావడం, ఒక్కసారైనా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాలన్న ఆయన ఆకాంక్ష మేరకు.. టిఆర్ఎస్ పార్టీ కూడా వదులుకునే అవకాశం కనిపిస్తోంది. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కి  కోరిన సీటు ఇవ్వకుండా పొత్తు కుదరటం అయ్యే పని కాదు. ఒకవేళ పొత్తు కావాలంటే తప్పనిసరిగా పాలేరుని వదులుకోవాలి.

Ramgopal Varma: నాకెందుకు దండేశారంటూ RGV ట్వీట్‌ .. రాంగోపాల్‌వర్మపై సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోలింగ్

ఆ నియోజకవర్గంపై ముగ్గురి కన్ను..

కాబట్టి తమ పార్టీలో ఉన్న వర్గ పోరు కు కూడా చెక్ పెట్టి, సీటు గెలవచ్చు అన్న ఆలోచన చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే ఇటు మాజీ మంత్రి తుమ్మలకు అటు సిటింగ్ ఎమ్మెల్యే కందాలకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. అలాంటప్పుడు వీరిద్దరూ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది ప్రశ్న. ఈ పరిస్థితులన్నిటిని కూడా అంచనా వేసుకున్న తుమ్మల అభిమానులు  పార్టీ మారాలన్న డిమాండ్ ను ఆయన ముందు తరచుగా ఉంచుతున్నారు. కాంగ్రెస్‌లోకి రావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, తుమ్మల వర్గీయులు బలంగా కోరుకుంటున్నారు. ఒకవేళ అదే జరిగితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆ ప్రభావం తీవ్రంగానే ఉండే అవకాశం ఉంది.

సందిగ్ధంలో క్యాడర్..

ఇదిలా ఉంటే కొద్దిరోజులుగా తుమ్మల నాగేశ్వరరావు టిఆర్ఎస్ పార్టీ తరఫున కొత్తగూడెం నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే చర్చ కూడా నడుస్తోంది. కాని రీసెంట్‌గా ఆయన పాలేరు నుంచే పోటీ చేస్తానంటూ ప్రకటించడంతో ప్రచారానికి పుల్‌స్టాప్ పెట్టినట్లైంది. కొత్తగూడెం నుంచి పోటీ చేయనని తేల్చిన తుమ్మల పాలేరు నుంచి ఏ పార్టీ తరపున బరిలోకి దిగుతారనే సందిగ్ధం అన్నీ పార్టీలో నెలకొంది.

First published:

Tags: Khammam, Telangana Politics, Tummala nageshwara rao

ఉత్తమ కథలు