Home /News /telangana /

TS POLITICS FORMER MINISTER AND BJP MLA EETALA RAJENDER ADVISED KCR TO GET DOWN WITH THE BJP IF IT IS ANGRY OVER THE GRAIN PURCHASE CONTROVERSY AND NOT AGAINST THE FARMERS PRV

Telangana: మాపై కోపం ఉంటే తేల్చుకో.. లేదంటే కేంద్రంతో తేల్చుకో.. కానీ, వాళ్లను ఇబ్బంది పెట్టొద్దు.. సీఎం కేసీఆర్​పై మాజీ మంత్రి ధ్వజం

ఈటల రాజేందర్​, కేసీఆర్​ (ఫైల్​)

ఈటల రాజేందర్​, కేసీఆర్​ (ఫైల్​)

తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రైతు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ ఆఫీసులో ఈటల మీడియాతో మాట్లాడారు

    తమ పార్టీ (BJP) రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రైతు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Former minister and BJP MLA Eetala Rajender)​ అన్నారు. కేసీఆర్ అనాలోచిత, పిచ్చి నిర్ణయాల వల్ల కోటి ఎకరాలు పంట పండల్సిన చోట  పంటలు పండించలేని దుస్థితి నెలకొందని మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌ (Hyderabad)లోని నాంపల్లి బీజేపీ ఆఫీసులో ఈటల మీడియాతో మాట్లాడారు.  రైతుల నుండి వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే రైతులకు (farmers) క్షమాపణ చెప్పి సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.రాష్ట్రంలో కొత్తగా రైస్​ మిల్లులు ఏర్పాటు చేయలేదన్నారు. గతంలో ఉన్న రైసు మిల్లులే ఉన్నాయన్నారు. ఈ మిల్లులు పాత టెక్నాలజీ నడుస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

    ఏ పంటకైనా నీళ్లు అందిస్తామని..

    దేశానికే ధాన్యగారంగా తెలంగాణ (Telangana) రాష్ట్రం పేరొందిందని అన్నారు ఈటల. కోటి ఎకరాల మాగాణి చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) గొప్పలు చెప్పుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతాయని, కానీ తెలంగాణ (Telangana)లో కొనుగోలు విషయం ఏమవుతుందో అని రైతులు ఆందోళన చెందుతున్నారని ఈటల అన్నారు. ''వర్షాకాలం పంటకైనా.. ఏ పంటకైనా నీళ్లు అందిస్తామని కేసీఆర్ ప్రకటన చేశారు. కందులు, మొక్కజొన్న, వరి అన్నీ కొంటున్నామని చెప్పుకున్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో కూడా దేశంలో కెల్లా అన్ని రకాల ధాన్యాలను కొనేది తెలంగాణ (Telangana) ప్రభుత్వమేనని గొప్పలు చెప్పుకున్నారు. ఎంతమేర ధాన్యం కొనుగోళ్లు (Paddy buying)  చేపట్టారనేది అధికార పార్టీకి చెందిన నమస్తే తెలంగాణ పత్రికలో ప్రచురించుకున్నారు. దేశంలో 24 గంటల నాణ్యమైన కరెంట్ అందించేది తెలంగాణ అని చెప్పుకున్నారు.

    కరెంట్ ఉందని చెప్పి..

    కేసీఆర్​ రైతు బీమా కూడా సకాలంలో అందిస్తున్నట్లు గొప్పలు చెప్పుకున్నారు. ఒక్క వ్యవసాయానికి మాత్రమే రూ.30 వేల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు.''  అని ఈటల ధ్వజమెత్తారు. ఇన్ని చెప్పి వానాకాలం పంట అప్పుడే వరి వేయొద్దని చెప్పడం నీచమైన ఆలోచన అని ఈటల మండిపడ్డారు. కరెంట్ ఉందని చెప్పి, భూగర్భ జలాలు ఉన్నాయని చెప్పి కూడా వరి వేయొద్దనడం ఎంత వరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు. కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామని చెప్పిన కేసీఆర్, కేవలం 30 లక్షల ఎకరాలకు మాత్రమే ఇప్పుడు నీరు అందిందని ఈటల అన్నారు. కేసీఆర్ కాళ్ళ కింద భూమి కదిలిపోతోంది.. ఆయన మాటలను ఎవరూ నమ్మడం లేదు. అందుకే భయంతో ఇష్యును డైవర్ట్ చేస్తున్నారని ఈటల ఆరోపించారు. కోపం మాపైన మాతో తేల్చుకో.. లేదంటే కేంద్రంతో తేల్చుకో.. కానీ, రైతులను ఇబ్బంది పెట్టొద్దని కేసీఆర్‌ను హెచ్చరించారు. వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలి. లేదా చేతకాకుంటే తప్పు ఒప్పుకొని పక్కకు తప్పుకో.. మేము కొంటామని సవాల్ విసిరారు
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: CM KCR, Eetala rajender, PADDY PROCUREMENT, Telangana, Telangana bjp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు