హోమ్ /వార్తలు /తెలంగాణ /

కొడాలి నాని లారీలు కడుక్కునే టైంలోనే కార్పొరేటర్‌ని .. గుడివాడలో పోటీ చేసి గెలుస్తా : రేణుకాచౌదరి

కొడాలి నాని లారీలు కడుక్కునే టైంలోనే కార్పొరేటర్‌ని .. గుడివాడలో పోటీ చేసి గెలుస్తా : రేణుకాచౌదరి

Renuka Choudhary ,kodali nani(file)

Renuka Choudhary ,kodali nani(file)

Telangana Politics: తెలంగాణ కాంగ్రెస్‌ నాయకురాలు, మాజీ ఎంపీ రేణుకాచౌదరి ఏపీకి చెందిన మాజీ మంత్రి కొడాలి నానికి సవాల్ విసిరారు. అసెంబ్లీ సమావేశాల్లో రేణుకాచౌదరి పేరు ప్రస్తావించిన కొడాలి నానికి కౌంటర్ ఇచ్చారు. గుడివాడలో నాని గెలవడం కష్టమన్నారు..ఇంకా ఏమన్నారంటే

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ కాంగ్రెస్‌ నాయకురాలు, మాజీ ఎంపీ రేణుకాచౌదరి(Renuka Choudhary)ఏపీకి చెందిన మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani)కి సవాల్ విసిరారు. అసెంబ్లీ సమావేశాల్లో కొడాలి నాని రేణుకాచౌదరి పేరు ప్రస్తావనకు తేవడంతో ఆమె ఘాటుగా స్పందించారు. కొడాలి నాని అనే వ్యక్తిని గుడివాడ(Gudivada)ప్రజలు మరోసారి ఓట్లేసి గెలిపించరంటూ హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని రేణుకాచౌదరి ఖమ్మం కార్పొరేటర్‌(Khammam Corporator)గా కూడా గెలవలేరని చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. తాను గుడివాడ నుంచి కాంగ్రెస్‌ పార్టీ గుర్తుతోనే పోటీ చేసి గెలిచి చూపిస్తానంటూ కొడాలి నానికి సవాల్‌ విసిరారు రేణుకాచౌదరి. ఇంకా ఘాటు విమర్శలు చేశారు.

OMG : క్షుద్రపూజలు, చేతబడులు .. అక్కడే ఎందుకిలా జరుగుతోంది .. కారణమదేనంటున్న జిల్లా ప్రజలు

ఏపీ, తెలంగాణ నేతల మధ్య సవాళ్లు..

అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు చేస్తున్న పాదయాత్రకు మద్దతిచ్చారు తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు రేణుకాచౌదరి. ఈవిషయంపైనే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరిగింది. సభలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని రేణుకాచౌదరిని ఉద్దేశిస్తూ విమర్శలు చేసారు. ఖమ్మంలోనే కార్పొరేటర్‌గా గెలవలేని ఆమెకు అమరావతిలో ఏం పని అంటూ కామెంట్ చేశారు. దీనిపైనే ఓ యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వూలో రేణుకాచౌదరి తానేంటో కొడాలి నానికి తెలియాలంటే గూగుల్‌లో రేణుకాచౌదరి అని సెర్చ్ చేస్తే తెలుస్తుందని ..కార్పొరేటర్‌గానే కాదు గుడివాడ నుంచి పోటీ చేసి గెలిచి చూపిస్తా అంటూ శపథం చేశారు.

గుడివాడలో గెలిచి చూపిస్తా..

కొడాలి నాని లారీలు కడుక్కునే సమయంలోనే తాను మున్సిపల్ కార్పొరేటర్ అంటూ రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఖమ్మం గల్లీల్లోకి వచ్చి తిరిగి చూడు నేనేంటో తెలుస్తుందని కొడాలి నానికి ధీటుగా బదులిచ్చారు రేణుకాచౌదరి. మాజీ మంత్రిగా ఉన్న కొడాలి నాని కేవలం పదవి కోసం తన పేరును అసెంబ్లీలో తెచ్చి తనకు బాగా పబ్లిసిటీ తెచ్చి పెట్టారంటూ పాజిటివ్‌గా స్పందించారు. తాను రాజధాని రైతుల పాదయాత్రకు మద్దతిచ్చాను తప్ప టీడీపీకి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ ఏపీలో పోటీ చేయాల్సి వస్తే కాంగ్రెస్‌ తరపునే నిలబడి గెలిచి చూపిస్తానంటూ బీరాలు పలికారు రేణుకాచౌదరి.

Nagarkurnool: కలెక్టర్ ఆఫీసు ముందే ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్న రైతు .. భూమి కాజేశారనే బాధతో..

రేణుకాచౌదరి కాన్ఫిడెన్స్‌కి కారణం..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీలో ఓ వెలుగు వెలిగిన రేణుకాచౌదరి...తర్వాత ఫేటవుట్ అయ్యారు. తిరిగి ఈమధ్య కాలంలోనే ఖమ్మం జిల్లాలోని అధికార పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సవాళ్లు విసిరారు. తెలంగాణలో చాలదంటూ ఇప్పుడు ఏపీ అధికార నాయకులకు సవాల్ విసరడం చూస్తుంటే రేణుకాచౌదరి నిజంగా వచ్చే ఎన్నికల్లో ఏపీ నుంచి పోటీ చేస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొడాలి నానిపై సవాల్ చేసినట్లుగానే గుడివాడ నుంచి బరిలోకి దిగి అవకాశముందా అనే చర్చ కూడా జరుగుతోంది.

Published by:Siva Nanduri
First published:

Tags: Andhra pradesh news, Kodali Nani, Renuka chowdhury, Telangana News

ఉత్తమ కథలు