తెలంగాణ కాంగ్రెస్Congressలో కీలకనేతగా ఉన్నటువంటి సీనియర్ నాయకుడు మర్రి శశిధర్‌రెడ్డి(Marri Shasidhar Reddy)బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఢిల్లీ బీజేపీ (BJP)పెద్దల సమక్షంలో ఈనెల 25 లేదా 26వ తేదిన కాషాయం కండువా మార్చుకుంటానని మర్రిశశిధర్‌రెడ్డి స్వయంగా వెల్లడించారు. తెలంగాణలో టీఆర్ఎస్(TRS)ను ఓడించే సత్తా ఒక్క బీజేపీకే ఉందన్న మర్రి శశిధర్‌రెడ్డి...కాంగ్రెస్ పార్టీలోని రాష్ట్రంలో భ్రష్టు పట్టించారని మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. సోమవారం సనత్‌నగర్(Sanatnagar)లోని తన కార్యాలయంలో అనుచరులు, నియోజకవర్గ కాంగ్రెస్ నేతలతో సమావేశం అనంతరం ఈవిషయాన్ని వెల్లడించారు. అయితే మర్రిశశిరెడ్డి కామెంట్స్‌పై కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఎన్నికల్లో గెలవలేని శశిధర్‌రెడ్డి వంటి వ్యక్తులు కాంగ్రెస్‌పైన, రేవంత్‌రెడ్డి(Revanth Reddy)పై విమర్శలు చేస్తున్నారని మండిపడుతున్నారు.
ముహుర్తం ఫిక్సైంది..
తెలంగాణలో రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. ఉపఎన్నికల ఫలితాల ప్రభావమో లేక కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యమో తెలియదు కాని దశాబ్ధాల కాలంగా పార్టీని నమ్ముకొని ఉన్న సీనియర్లు కాంగ్రెస్ కండువాలు మార్చుకుంటున్నారు. మాజీ సీఎం తనయుడు, కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్నటువంటి మర్రిశశిధర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీపై సంచలన కామెంట్స్ చేయడం వల్ల హైకమాండ్ ఆరేళ్ల పాటు బహిష్కరించింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కింద ఆయనపై వేటు వేసింది.
కాషాయదళంలోకి మర్రి శశిధర్‌రెడ్డి..
అయితే ముందు నుంచే కాంగ్రెస్‌ను వీడాలనుకుంటున్న మర్రిశశిధర్‌రెడ్డి తనపై కాంగ్రెస్ బహిష్కరణ వేటు వేయకముందే రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలతో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను ఢిల్లీలో కలిశారు. పార్టీలో చేరే అంశంపై చర్చించి లైన్ క్లియర్ చేసుకున్నారు. ఆ పరిణామాలు జరిగిన తర్వాతే మర్రి శశిధర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ క్యాన్సర్‌తో బాధపడుతోందని..ఆ వ్యాధి నయం అయ్యే పరిస్థితి లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
మర్రిపై కాంగ్రెస్ నేతల విమర్శలు..
అయితే పార్టీ మారుతున్నట్లుగా ప్రకటించిన మర్రిశశిధర్‌రెడ్డి ఢిల్లీ పెద్దలకు తనతో పాటు మరికొందరు నేతలు కూడా వస్తారని చెప్పడం జరిగింది. దీనిపైనే తెలంగాణ కాంగ్రెస్ నేతలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. పార్టీలో పదవులు అనుభవించిన మర్రి శశిధర్‌రెడ్డి ఇప్పుడు పార్టీకే ద్రోహం చేస్తున్నారని మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ వంటి సీనియర్ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ తెలంగాణ చైర్మెన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తాను పార్టీ మారడం లేదని స్పష్టత ఇచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Telangana Politics, TS Congress