తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఊహించని సంఘటన ఎదురైంది. తాను గెలిచిన నియోజకవర్గంలోనే ఆయనపై ప్రజలు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఐదో విడత ప్రజా సంగ్రామయాత్ర చేస్తున్న బండి సంజయ్‌ని ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లాకు, లోక్‌సభ పరిధిలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలంటూ రామడుగు మండలం వెదిరలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు.
అంతే కాదు ఎంపీగా గెలిచిన తర్వాత కరీంనగర్ పార్లమెంట్‌కు ఎన్ని నిధులు తెచ్చారో..తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం మేలు చేశారో చెప్పాలంటూ ప్రశ్నలు సంధిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై బీజేపీ జిల్లా నేతలు తలలు పట్టుకుంటున్నారు. వెదిరిలోని పలు కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. అంతే కాదు మరికొద్ది సేపట్లో పాదయాత్రగా బండి సంజయ్ వెదిరకు చేరుకోనుండటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Karimangar, Telangana Politics