తెలంగాణాలో ఇప్పుడు ఎక్కడ చూసిన మొయినాబాద్ ఫామ్ హౌజ్ ఘటన గురించే చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో అటు టీఆర్.ఎస్, ఇటు బీజేపీ కోర్టు మెట్లెక్కారు. ఈ క్రమంలో బీజేపీ దాఖలు చేసిన పిటీషన్ పై తెలంగాణ హైకోర్టు (Telangana Highcourt) విచారణ చేపట్టింది. పిటీషన్ దాఖలుపై వాదనలు విన్న హైకోర్టు మునుగోడు ఎన్నికలు పూర్తయ్యే వరకు దర్యాప్తుపై స్టే విధించింది. నిందితుల రిమాండ్ కు స్టే ఉండదని కోర్టు స్పషం చేసింది.
ఈనెల 26న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు (Guvvala balaraju), హర్షవర్ధన్ రెడ్డి (Harshavardhan Reddy), రోహిత్ రెడ్డి (Rohit Reddy), రేగా కాంతారావు (Rega Kantharao)కు పార్టీ మారితే కాంటాక్టులు, డబ్బులు, పదవుల ఆశ చూపి ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు. భారీ డీల్ కు కొనుగోలు చేయాలనీ బీజేపీ ప్రయత్నించిందని టీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి రాంచంద్రబారతి, నందు, ఓ స్వామిజి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్లో కీలక వివరాలను పొందుపరిచారు పోలీసులు. నిందితుల్లో ఇద్దరు నెల రోజుల క్రితమే పైలట్ రోహిత్ రెడ్డి (Pilot Rohith Reddy)ని కలిసినట్లు వెల్లడించారు. బీజేపీ (BJP)లో చేరితే రూ.100 కోట్లతో పాటు కేంద్ర ప్రభుత్వ సివిల్ కాంట్రాక్టులను ఇప్పిస్తామని ప్రలోభ పెట్టారని తెలిపారు.
ఇప్పటికే దీనికి సంబంధించి ఆడియో క్లిప్ 1 ఆడియో క్లిప్ 2 కూడా లీక్ అయ్యాయి. ఈ ఆడియో క్లిప్ లో డబ్బుల ప్రస్తావన గురించి రాంచంద్రబారతి, నందూ, సింహయాజి మాట్లాడినట్లు తెలుస్తుంది. ఒక్కొక్కరికి ఎంత ఇవ్వాలనే దానిపై ముగ్గురి మధ్య ప్రధానంగా చర్చ జరిగింది. ఫైలట్ రోహిత్ రెడ్డి (Rohith Reddy)కి 100, మిగిలిన వారికి నామినల్ గా ఇస్తే సరిపోతుందని నందు చెప్పుకొచ్చారు. మొత్తం నలుగురు రావడానికి సిద్ధంగా ఉన్నారని, అలాగే కాంగ్రెస్ నుండి రావడానికి సిద్ధంగా ఉన్నారనే ఆడియో ఇప్పుడు సంచలన రేపుతోంది.
అలాగే ఈ ఆడియో క్లిప్ లో రాష్ట్ర బీజేపీ నాయకులు బండి సంజయ్ (Bandi Sanjay), కిషన్ రెడ్డి (Kishan Reddy) పేర్లు వినిపించాయి. ఈ మ్యాటర్ సెంట్రల్ నేరుగా డీల్ చేస్తుంది. బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు అంతగా ప్రాధాన్యత లేదు. కొడంగల్, పరిగి, చేవెళ్ల ఎమ్మెల్యేలు కూడా చేరేందుకు సుముఖంగా ఉన్నారని ఆడియోలో రాంచంద్రబారతి, నందూ, సింహయాజి మాట్లాడుకున్నారు. గుజరాత్ ఎన్నికల ముందు మునుగోడు కోసం ఇంత రిస్క్ తీసుకుంటున్నాం అని ఆ ముగ్గురు చర్చించుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.