(P.Srinivas,New18,Karimnagar)
కరీంనగర్(Karimnagar)జిల్లాలోని హుజురాబాద్ (Huzurabad)నియోజకవర్గం ఒకప్పుడు టిఆర్ఎస్‌కి కంచుకోట. ఎన్నికలు,ఉప ఎన్నికలు ఏదైనా ఇక్కడి ఓటర్లు టిఆర్ఎస్‌కే పట్టం కట్టారు. తెలంగాణ ఉద్యమం నాటి నుండి ఇటివల జరిగి ఉప ఎన్నిక వరకి టిఆర్ఎస్(TRS) కి కంచుకోటగా ఉన్న హుజురాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్‌ని వీడి బిజేపి(BJP)లో చేరిన ఈటెల రాజేందర్(Etela Rajender) ఎమ్మెల్యేగా గెలిపొంది నేరుగా ముఖ్యమంత్రికే(KCR) సవాల్ విసురుతుంటే నియోజకవర్గం టిఆర్ఎస్ నాయకులు గ్రూపులుగా విడిపోయి పార్టీని బలహీన పరుచుతున్నారని టిఆర్ఎస్ క్యాడర్ ఆందోళన చెందుతున్నారు.
గులాబీలో పార్టీలో గుబులు..
హుజురాబాద్ నియోజకవర్గం మొన్న జరిగిన ఉప ఎన్నికల ముందు వరుకు గులాబీ పార్టీకి కంచుకోటే. హుజురాబాద్ నియోజకవర్గంగా ఏర్పడినప్పటి నుండి ఇక్కడ గులాబి జెండా ఎగురుతూ వస్తుంది. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ 2004 నుండి 2018 వరకి ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేగా గెలిపొందారు. ఈటెల రాజేందర్ టిఆర్ఎస్ పార్టీలో విబేధాలతో పార్టీని వీడి బిజేపి కండువా కప్పుకోవడంతో ఇక్కడ జరిగిన ఉప ఎన్నికలలో బిజేపి నుండి ఈటెల రాజేందర్ తిరిగి ఎన్నిక అయ్యారు. ఉప ఎన్నికలలో ఎవ్వరూ ఊహించని విధంగా బిసి కార్డు బాగా పని చేస్తుందని గెల్లు శ్రీనివాస్‌ని బరిలో దింపింది. ఈటెల రాజేందర్ కి ప్రధాన పోటీదారుడు అయ్యిన కౌషిక్ రెడ్డిని కూడా గులాబి కండువా కప్పి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు.
నేతల మధ్య ఆధిపత్య పోరు..
గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ని హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఎమ్మెల్యేగా గెల్లు శ్రీనివాస్(Gellu Srinivas Yadav),ఎమ్మెల్సీగా కౌషిక్ రెడ్డి (Kaushik Reddy) ఇద్దరూ వన్ ప్లస్ వన్ ఆఫర్ తో నియోజకవర్గం అభివృద్ధి చేస్తారని ఉప ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ అగ్ర నేతలు ప్రకటించారు. ఇక ఉప ఎన్నికల తర్వాత ఇక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఉప ఎన్నికలలో ఓడిపోయిన కూడా గెల్లు శ్రీనివాస్ టిఆర్ఎస్(TRS) నియోజకవర్గం ఇన్‌చార్జ్ అని అధినాయకత్వంపెర్కొంది. ఎమ్మెల్సీగా గెలుపొందిన కౌషిక్ రెడ్డి ని నియోజకవర్గంలోని కార్యక్రమాలలో దూరంగా ఉండాలని అధిష్టానం సూచించారు. ఉప ఎన్నికల తరువాత గెల్లు శ్రీనివాస్ పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటు వస్తుండగా రెండు నెలల నుండి హుజురాబాద్ టిఆర్ఎస్ పార్టీలో ఒక్కసారిగా కౌషిక్ రెడ్డి దూకుడు పెంచారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తు బల ప్రదర్శన చేసుకుంటూ వస్తున్నారు.కౌషిక్ రెడ్డి దూకుడు పెంచడం తో వచ్చే ఎన్నికల లో కౌషిక్ రెడ్డే ఎమ్మెల్యేగా పోటి చేస్తారనొ ప్రచారాలు మొదలు పెట్టారు.
అయోమయంలో క్యాడర్..
ఇది మింగుడు పడని గెల్లు శ్రీనివాస్ వర్గం మంత్రి హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. వ్యతిరేకంగా పార్టీ కార్యక్రమాలు చేస్తు వస్తున్నారు. గత నెల రోజుల నుండి కౌషిక్ రెడ్డి మరింత దూకుడు పెంచి మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ఎమ్మెల్యే ఈటెలకి సవాల్లు విసురు తున్నారు. హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధి కేసీఆర్ చేసిందేనని ఉప ఎన్నికల తరువాత నయా పైసా తీసుకు రాలేదని అభివృద్ధి పై చర్చకి రావాలని సవాల్ విసిరారు. గత పది రోజులుగా సవాళ్లు తిసురుతున్న ఎక్కడ కూడా స్పందించని గెల్లు శ్రీనివాస్ రెండు రోజుల క్రితం మీడియా సమావేశం నిర్వహించి తానే ఎమ్మెల్యేగా వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తానని ప్రకటించారు. పాడి కౌషిక్ రెడ్డి సవాల్‌కి తనకి సంబంధం లేదని తన వ్యక్తిగత సవాల్ అని నియోజకవర్గం ఇంచార్జ్ గా తనకి సంబంధం లేదని ప్రకటించారు.
హుజురాబాద్‌లో ఏం జరుగుతోంది..?
హుజురాబాద్‌లో టిఆర్ఎస్ పార్టీ రెండు వర్గాలుగా కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో ఎవ్వరితో ఉండాలో ఎలా వ్యవహరించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు ద్వితీయ శ్రేణి నాయకులు. ఏ పరిస్థితి ఎలా ఉంటాదోనని ఎందుకైనా మంచిదని ఇద్దరి కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. డబుల్ ధమాకాగా ఉంటారనుకుంటే ఇద్దరూ నాయకులను డబుల్ తలనొప్పి తీసుకువస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర అధినాయకత్వానికి అనేక సమస్యలు తలనొప్పిగా మారిన సమయంలో హుజురాబాద్ వర్గపోరు మరో తలనొప్పిగా మారిందని నాయకులు అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Huzurabad, Telangana Politics, TRS leaders