BJP in Munugode : హోరాహోరీగా సాగిన తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్(ప్రస్తుతం బీఆర్ఎస్) పార్టీ విజయం సాధించింది. మునుగోడు ఉప ఎన్నికల్లో (Munugode Bypoll) టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై (Komatireddy Rajagopal Reddy) ఆయన పది వేలకు పైగా మెజార్టీ సాధించి మునుగోడు గడ్డపై గులాబీ జెండా ఎగురవేశారు. అయితే ఉత్కంఠ పోరులో ఓడినా మునుగోడులో బీజేపీ(BJP) 86 వేల 697 ఓట్లు సాధించింది. మునుగోడులో పోలైన ఓట్లలో 42.95శాతం టీఆర్ఎస్ కు రాగా, బీజేపీకి 38.38శాతం ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికల్లో బీజేపీకి ఈ నియోజకవర్గంలో వచ్చిన ఓట్లు కేవలం 12 వేలు మాత్రమే. దీంతో మునుగోడులో బీజేపీ ఓడినా అనుకున్న టార్గెట్ సాధించిందనే టాక్ వస్తోంది.
నియోజకవర్గంలో బీజేపీ బలాన్ని పెంచుకోగా మరో ఏడాదిలో జరిగే ఎన్నికలకు మరింతగా దూసుకెళ్లవచ్చని కమలం పార్టీ అంచనా వేసింది. పక్కా ప్లాన్ తోనే బీజేపీ మునుగోడు ఉప ఎన్నికకు వెళ్లిందని..అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అయిందని అంటున్నారు. మునుగోడు ఫలితం తర్వాత పార్టీ పెద్దలు తెలంగాణ నేతలకు ఫోన్ చేసి అభినందించారని సమాచారం. మునుగోడులో ఓడినా తాము అనుకున్నది కమలనాధులు సాధించారని రాజకీయ వర్గాల్లో కూడా చర్చ సాగుతోంది. నియోజకవర్గంలో బీజేపీ బలాన్ని పెంచుకోగా మరో ఏడాదిలో జరిగే ఎన్నికలకు మరింతగా దూసుకెళ్లవచ్చని కమలం పార్టీ అంచనా వేసింది.
మరోవైపు,మునుగోడు ఉపఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఒక్కడిని ఓడించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కలిసి కట్టుగా పని చేసిందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay).ప్రజాతీర్పును గౌరవిస్తామన్న బండి సంజయ్ ఇంతకీ మునుగోడులో గెలిచింది కేసీఆర్(KCR) హరీష్రావా(Harish RaO),కేటీఆర్, (KTR),లేక వామపక్షాల కాదంటే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డా (Kusukuntla Prabhakarreddy)అని ప్రశ్నించారు. గెలిచామని విర్రవీగతున్న టీఆర్ఎస్ ఒక్క ఎమ్మెల్యే సీటు గెలవడం కోసం వెయ్యి కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. ఫలితాల అనంతరం ప్రెస్మీట్ పెట్టిన బండి సంజయ్ మునుగోడు ప్రజల తీర్పును శిరసావహిస్తామన్నారు. ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలను 15రోజుల్లో నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Komatireddy rajagopal reddy, Munugode Bypoll, Telangana bjp