తెలంగాణాలో పాలిటిక్స్ (Telangana Politics) మరోసారి వేడెక్కాయి. నిన్నబీజేపీ హైకమాండ్ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender) ను, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Rajagopal reddy) ఢిల్లీకి రావాలని ఆదేశించింది. ఈ క్రమంలో అనేక గుసగుసలు వినిపించాయి. ఈటల (Etela Rajender) సొంత గూడు టీఆర్.ఎస్ నుంచి డిప్యూటీ సీఎం ఆఫర్ వచ్చిందని, మునుగోడులో బీజేపీ నుండి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Rajagopal reddy) అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలు ఎంత తొందరగా స్ప్రెడ్ అయిందో అంతే వేగంగా ఆ ఇద్దరికీ ఢిల్లీకి రావాలని పిలుపొచ్చింది. మరి ఆ ప్రచారంతోనే ఆ ఇద్దరికి ఢిల్లీ నుంచి పిలుపొచ్చిందా? అసంతృప్తితో ఉన్న వారికి కీలక బాధ్యతలు అప్పగించనున్నారా? సడెన్ గా అమిత్ షా (Amit Shah) భేటీ వెనక ఆంతర్యం ఏంటి? మరి ఢిల్లీలో అసలేం జరుగుతుందన్న చర్చ ఇప్పుడు జోరందుకుంది.
ఆ ఇద్దరికే పిలుపు..
టీఆర్ఎస్ , కేసీఆర్ తో నెలకొన్న విభేదాలతో ఈటెల రాజేందర్ పార్టీని వీడారు. ఆ తరువాత బీజేపీ కండువా కప్పుకున్నారు. అయినా హుజురాబాద్ ఉపఎన్నికలో తన పట్టుతో బీజేపీ నుండి కూడా విజయం సాధించారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికకు కారణమయ్యారు. అయితే కాంట్రాక్టుల కోసం ఆయన బీజేపీలో చేరారని విమర్శలు వచ్చాయి. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై కూడా పడింది. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో ఉపఎన్నికల ద్వారా బీజేపీలో చేరిన ఈ ఇద్దరినే ఢిల్లీకి రావాలని పిలుపు రావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.
ఈటెల అసంతృప్తి, నిలకడ లేని రాజగోపాల్ రెడ్డి..
అయితే ఇతర పార్టీల నుండి బీజేపీలోకి చేరిన వారు పార్టీ బలోపేతం కోసం బాగానే కష్టపడుతున్నారు. కానీ వారు ఎక్కడ బలపడుతారేమో అని అలా తమ స్థానాలకే ఎసరు వస్తుందని బీజేపీలో పాహుకుపోయిన కొంతమంది నాయకులు సహకరించడం లేదని తెలుస్తుంది. ఈటెల చేరికల ఇంఛార్జిగా ఉన్నారు. కానీ ఆయనకు తెలియకుండానే పార్టీలో చేరికలు జరుగుతున్నాయి. ఇలా అన్ని పనులు ఒక్కరే చేస్తున్నారు. దీనిపై ఈటెల అసంతృత్తితో ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు రాజగోపాల్ రెడ్డి పార్టీలో నిలకడగా ఉండలేకపోతున్నారు. ఈ క్రమంలో బీజేపీ హైకమాండ్ నుండి పిలుపు వచ్చినట్లు తెలుస్తుంది.
ఈటెలతో టీఆర్ఎస్ హైకమాండ్ సంప్రదింపులు?
మరోవైపు ఈటెల రాజేందర్ తో టీఆర్ఎస్ హైకమాండ్ సంప్రదింపులు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన తిరిగి కారు ఎక్కితే డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల బీజేపీని వీడి టీఆర్ఎస్ లో చేరిన స్వామి గౌడ్, శ్రవణ్ ఈటెలకు ఆహ్వానం పంపుతున్నట్లు తెలుస్తుంది. రాజగోపాల్ కూడా ఊగిసలాటలోనే ఉన్నారు. ఈ క్రమంలో పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని బీజేపీ హైకమాండ్ వారికి నచ్చచెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈటెలకు బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పజెప్పే యోచనలో ఉన్నట్లు విశ్వాసనీయ సమాచారం. మరోవైపు కేసీఆర్ కావాలనే ఈటెలను బీజేపీలోకి పంపించి తన స్ట్రాటజీని అమలు చేస్తున్నట్లు పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే బీజేపీకి అది మింగుడుపడని విషయమే అని చెప్పుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amit Shah, Bjp, CM KCR, Etela rajender, Komatireddy rajagopal reddy, Telangana, Trs