తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi sanjay) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు వస్తాయని, ఆ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. బండి సంజయ్ (Bandi sanjay) చేపట్టిన ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర ముథోల్ నియోజకవర్గంలోని గుండెగాం గ్రామానికి చేరుకుంది. ఈ క్రమంలో బండి సంజయ్ (Bandi sanjay) ఈ వ్యాఖ్యలు చేశారు. గుండెగాం గ్రామానికి చేరుకున్న బండి సంజయ్ అక్కడి ప్రజలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బాణాసంచా పేల్చి పూలతో గ్రామంలోకి స్వాగతం పలికారు.
బండి సంజయ్ ఫైర్..
అక్కడి ప్రజలతో బండి సంజయ్ రచ్చబండ నిర్వహించారు. అనంతరం బండి సంజయ్ రాష్ట్ర సర్కార్ పై ఫైర్ అయ్యారు. గుండెగాం ప్రజల బాధ వింటుంటే గుండె తరుక్కుపోతుంది. 250 మంది కుటుంబాలను కాపాడలేని సీఎం రాష్ట్రాన్ని ఏం కాపాడుతారని మండిపడ్డారు. వానోస్తే గ్రామం మునిగిపోయిన కేసీఆర్ కు సోయి లేదు. కాళేశ్వరం\, సచివాలయం, ప్రగతి భవన్ వంటివి కట్టవచ్చు కానీ పేదలకు పక్కా ఇళ్లు కట్టించలేకపోయారా ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు పేదలంటే అలుసని, అందుకే ఇలా కేసులు పెడుతూ ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఏం భయపడొద్దు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ సమస్యలను పరిష్కరిస్తాం అని హామీనిచ్చారు.
222 కిలోమీటర్లు..8 అసెంబ్లీ నియోజక వర్గాలు..
ఐదో విడత పాదయాత్రలో భాగంగా భైంసా నుండి కరీంనగర్ వరకు యాత్ర సాగనుంది. 20 రోజుల పాటు 222 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది. మొత్తం 5 జిల్లాలు, 3 పార్లమెంట్ నియోజకవర్గాలు, 8 అసెంబ్లీ నియోజక వర్గాల్లో యాత్ర కొనసాగనుంది. డిసెంబర్ 17వ తేదీ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. గుండగామ్ నుండి మహాగన్, చటా మీదుగా లింబా వరకు యాత్ర కొనసాగనుంది. ఇక 3వ రోజు లింబా నుండి ప్రారంభమై కుంటాల, అమ్బకంటి మీదుగా బూజురుగుకు చేరుకోనుంది. ఈ మూడు రోజులు కూడా ముథోల్ అసెంబ్లీ నియోజవర్గంలోనే పాదయాత్ర కొనసాగనుంది. డిసెంబర్ 1 నుండి 6 వరకు నిర్మల్ అసెంబ్లీ నియోగాజవర్గంలో పాదయాత్ర కొనసాగనుంది. డిసెంబర్ 2న రాంపూర్ నుండి లోలం మీదుగా చిట్యాల వరకు 3న చిట్యాల నుండి మంజులపూర్, నిర్మల్ రోడ్, ఎడిగం, ఎల్లపల్లి, కొండాపూర్ మీదుగా ముక్తపూర్ వరకు కొనసాగనుంది. 4న లక్ష్మణ్ చందా మండలంలో 5న మమ్డా మండలంలో, 6,7న ఖానాపూర్ నియోజకవర్గాల్లో యాత్ర సాగనుంది.
డిసెంబర్ 8,9 తేదీల్లో కోరుట్ల నియోజకవర్గంలో 21.7 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగనుంది. డిసెంబర్ 10న కోరుట్ల పట్టణం మీదుగా వేములవాడ నియోజకవర్గానికి చేరుకోనుంది.డిసెంబర్ 11న మేడిపల్లి, తాటిపల్లి మీదుగా జగిత్యాల రూరల్ వరకు యాత్ర సాగనుంది. డిసెంబర్ 12న జగిత్యాల పట్టణం, డిసెంబర్ 13న చొప్పదండి నియోజకవర్గం నుండి కొండగట్టుకు చేరుకోనుంది. డిసెంబర్ 14,15,16 తేదీలో చొప్పదండిలో యాత్ర కొనసాగగా..డిసెంబర్ 16,17న కరీంనగర్ లో పాదయాత్ర సాగగా చివరి రోజు కరీంనగర్ లోని SR నగర్ కళాశాల వద్ద పాదయాత్ర ముగియనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Bjp, Hyderabad, Telangana