హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR| Prashant Kishor: కేసీఆర్‌కు ఊహించని పరీక్ష పెట్టిన ప్రశాంత్ కిశోర్.. ఏ మాత్రం తేడా వచ్చినా..

KCR| Prashant Kishor: కేసీఆర్‌కు ఊహించని పరీక్ష పెట్టిన ప్రశాంత్ కిశోర్.. ఏ మాత్రం తేడా వచ్చినా..

ప్రశాంత్ కిశోర్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

ప్రశాంత్ కిశోర్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana Politics: రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన నేతగా గుర్తింపు తెచ్చుకున్న కేసీఆర్... ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బలపడుతున్న బీజేపీని.. పీకే వ్యూహాలతో సరికొత్తగా ముందడుగు వేయబోయే కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

  రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అప్పటివరకు ఓ పార్టీకి పూర్తి అనుకూలంగా ఉన్న రాజకీయాలు.. ఆ తరువాత ప్రతికూలంగా మారుతుంటాయి. తెలంగాణలో రాజకీయ ముఖచిత్రం ఇదే రకంగా కనిపిస్తోంది. తెలంగాణలో ప్రస్తుత రాజకీయం టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా సాగుతోంది. ఇదే రకమైన పరిస్థితి ఉంటే.. వచ్చే ఎన్నికల్లో తమ ప్రధాన పోటీ బీజేపీతోనే అని టీఆర్ఎస్ కూడా మానసికంగా ఫిక్స్ అయ్యింది. ఆ పార్టీ బీజేపీని టార్గెట్ చేస్తున్న విధానాన్ని బట్టి ఈ విషయం అందరికీ అర్థమవుతోంది. పెద్దగా ప్రభావం చూపించని కాంగ్రెస్(Congress) పార్టీని విమర్శించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదనే భావనలో టీఆర్ఎస్(TRS) ఉంటూ వచ్చింది. కానీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(Prashant Kishore) కాంగ్రెస్ పార్టీ కాలింగ్ బెల్ కొట్టిన తరువాత పరిస్థితులు మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  ప్రశాంత్ కిశోర్ జాతీయస్థాయిలో కాంగ్రెస్‌ను తిరిగి పుంజుకునేలా చేయడానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. ఆయన అనుకున్నట్టు జరిగితే.. ఆ ప్రభావం కచ్చితంగా తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది. ఒక్కసారి దేశంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటే.. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ఆకర్షితులవుతారని ఆ పార్టీ శ్రేణులు కూడా నమ్ముతున్నారు. ప్రశాంత్ కిశోర్ అలాంటి మ్యాజిక్‌లు చేయగల సమర్థుడు కాబట్టి.. అలాంటివి నిజంగానే జరుగుతాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్టుగా ప్రశాంత్ కిశోర్ తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ పుంజుకునేలా చేస్తే.. ఆ ప్రభావం ఎవరిపై పడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో బీజేపీ బలపడటానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ బలహీనపడటమే అనే వాదన ఉంది.

  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్‌కు ధీటైన పోటీ ఇవ్వడంలో విఫలమవుతోందని.. అందుకనే టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బ్యాంకు మొత్తం బీజేపీ వైపు మళ్లుతుందనే అంచనాలు, అభిప్రాయాలు చాలాకాలం నుంచి వినిపిస్తున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకుంటే.. బీజేపీ పెరుగుదల ఆగిపోతుందా ? లేక కాంగ్రెస్, బీజేపీలు బలపడి ఆ ప్రభావం టీఆర్ఎస్‌పై ఉంటుందా ? అన్నది ప్రస్తుతానికి ఎవరూ చెప్పలేని పరిస్థితి. అయితే రాబోయే కాలమంతా కేసీఆర్‌కు(KCR) అసలు సిసలు పరీక్షా కాలమనే టాక్ మొదలైంది.

  Telangana| BJP: కేసీఆర్, పీకే ఔర్ కాంగ్రెస్.. తెలంగాణలో ఆ పార్టీ ఫుల్ హ్యాపీ ?

  YS Sharmila: షర్మిల ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం లేదా ?

  రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన నేతగా గుర్తింపు తెచ్చుకున్న కేసీఆర్... ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బలపడుతున్న బీజేపీని.. పీకే వ్యూహాలతో సరికొత్తగా ముందడుగు వేయబోయే కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇందుకు కేసీఆర్ కూడా సరికొత్త వ్యూహాలను సిద్ధం చేసుకోకతప్పదనే వాదన వినిపిస్తోంది. మొత్తానికి గతంతో పోలిస్తే.. రాబోయే రోజుల్లో కేసీఆర్ మరింత పదునైన రాజకీయవ్యూహాలను అమలు చేయాల్సి వస్తుందని.. అందులో ఏ మాత్రం తేడా వచ్చిన టీఆర్ఎస్ దెబ్బతినే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, Telangana

  ఉత్తమ కథలు