హోమ్ /వార్తలు /తెలంగాణ /

BRS: బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్.. కేసీఆర్‌కు ఈసీ లేఖ.. రేపే ఆవిర్భావ వేడుకలు

BRS: బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్.. కేసీఆర్‌కు ఈసీ లేఖ.. రేపే ఆవిర్భావ వేడుకలు

కేసీఆర్ (ఫైల్ ఫోటో)

కేసీఆర్ (ఫైల్ ఫోటో)

BRS: అక్టోబర్ 5న దసరా రోజు పార్టీ సమావేశం ఏర్పాటు చేసి పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చుతూ తీర్మానం పెట్టి ఆమోదించారు. అప్పటి నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చుతూ ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పంపిన ప్రతిపాదనకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేసీఆర్‌కు లేఖ పంపింది. ఇందుకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీంతో రేపు బీఆర్ఎస్(BRS)ఆవిర్భావ వేడుకలు జరిపేందుకు టీఆర్ఎస్ సమాయత్తమవుతోంది. రేపు మధ్యాహ్నం ఒంటి గంట 20 నిమిషాలకు బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమం జరగనుంది. బీఆర్ఎస్ జెండాను పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. రేపు కేసీఆర్(KCR)దీక్ష విరమించిన విజయ్ దివస్ కూడా కావడంతో.. రేపే బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. అక్టోబర్ 5న దసరా రోజు పార్టీ సమావేశం ఏర్పాటు చేసి పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చుతూ తీర్మానం పెట్టి ఆమోదించారు. టీఆర్‌ఎస్‌ జనరల్‌ బాడీ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.

పార్టీ కార్యకలాపాలను జాతీయ స్థాయిలో విస్తరించేందుకు.. ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించింది. పార్టీ నియమావళిలో మార్పులు చేశామని టీఆర్‌ఎస్‌ స్పష్టం చేసింది. పార్టీ పేరు మార్పునకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ విషయంపై టీఆర్‌ఎస్‌ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. మాజీ ఎంపీ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌రావు స్వయంగా సీఈసీని కలిసి దరఖాస్తు అందించారు.

నెల రోజుల తర్వాత పేరు మార్పుపై పబ్లిక్‌ నోటీస్‌ ఇవ్వాలని ఎన్నికల సంఘం టీఆర్‌ఎస్‌కు లేఖ రాసింది. దీంతో నవంబర్‌ 7న టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌ గా మారుస్తూ.. టీఆర్‌ఎస్‌ పబ్లిక్‌ నోటీస్‌ ఇచ్చింది. ఈ మేరకు అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో సెక్రటరీ, ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా, నిర్వాచన్‌ సదన్, అశోకా రోడ్, న్యూఢిల్లీ అడ్రస్‌కు కారణాలతో సహా అభ్యంతరాలను పంపాలని పబ్లిక్‌ నోటీసులో టీఆర్‌ఎస్‌ పేర్కొంది.

Bandi Sanjay: సజ్జల కామెంట్స్‌పై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఏపీ, తెలంగాణ మళ్లీ కలవడం కల..సజ్జల వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్న పొన్నం ప్రభాకర్

డిసెంబర్‌ 7తో ఇందుకు సంబంధించిన గడువు ముగిసింది. దీనిపై పెద్దగా అభ్యంతరాలు రాకపోవడంతో కేంద్రం ఎన్నికల సంఘం టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడం దాదాపు లాంఛనమే కానుంది.

First published:

Tags: BRS, Telangana, Trs

ఉత్తమ కథలు