హోమ్ /వార్తలు /తెలంగాణ /

BRS: బీఆర్ఎస్‌గా టీఆర్ఎస్.. ఎన్నికల కమిషన్‌కు తీర్మానం.. ఎన్ని రోజులు పడుతుందంటే..

BRS: బీఆర్ఎస్‌గా టీఆర్ఎస్.. ఎన్నికల కమిషన్‌కు తీర్మానం.. ఎన్ని రోజులు పడుతుందంటే..

కేసీఆర్, ఈసీ

కేసీఆర్, ఈసీ

TRS to BRS: తెలంగాణ రాష్ట్ర సమితి జనరల్‌ బాడీ సమావేశంలో భారత్‌ రాష్ట్ర సమితిగా సవరణ చేస్తూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని, అలాగే పార్టీ రాజ్యాంగాన్ని సవరించినట్లు వివరించారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తన సారథ్యంలోని టీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా మారుస్తూ ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. ఇందుకు 283 మంది ప్రతినిధులు ఆమోదం తెలిపారు. సరిగ్గా నేడు మధ్యాహ్నం 1.19 గంటలకు టీఆర్‌ఎస్‌ను భారత్‌ రాష్ట్ర సమితిగా పేరు మారుస్తున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. తర్వాత తీర్మానంపై కేసీఆర్‌(KCR) సంతకాలు చేశారు. పార్టీ ప్రతినిధులు, ఇతర రాష్ట్రాల నుంచి నేతల సమక్షంలో పార్టీ పేరును గులాబీ బాస్‌ వెల్లడించారు. దేశ రాజకీయాల్లోకి ఎందుకు వెళ్తున్నామో వారికి వివరించారు. దేశ ఆర్థిక పరిస్థితులు, జీడీపీ, గడిచిన 8 సంవత్సరాల్లో వృద్ధి రేటు ఏ విధంగా దెబ్బతిందనే విషయాన్ని ఈ సమావేశంలో నిర్వహించారు. పార్టీ పేరు మార్పుపై సీఎం కేసీఆర్‌ లేఖ రాశారు.

  తెలంగాణ రాష్ట్ర సమితి జనరల్‌ బాడీ సమావేశంలో భారత్‌ రాష్ట్ర సమితిగా సవరణ చేస్తూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని, అలాగే పార్టీ రాజ్యాంగాన్ని సవరించినట్లు వివరించారు. మరో వైపు పార్టీ సీనియర్‌ నేత వినోద్‌కుమార్‌, శ్రీనివాస్‌రెడ్డితో పాటు లీగల్‌ బృందం రేపు ఢిల్లీలో ఎన్నికల కమిషన్‌ను కలునున్నట్టు తెలుస్తోంది. తీర్మానం కాపీని ఎన్నికల అధికారులకు ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఎన్నికల కమిషన్‌ పార్టీ పేరు మార్పునకు సంబంధించి ప్రక్రియ ప్రారంభించనున్నది. ఎన్నికల కమిషన్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ పేరుకు సంబంధించి నిర్ధిష్ట గడువుతో అభ్యంతరాలు కోరే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం ఎన్నికల సంఘం అధికారికంగా భారత్‌ రాష్ట్ర సమితి పార్టీ(BRS) పేరుపై అధికారికంగా ప్రకటించనుంది.

  మరోవైపు టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా గుర్తిస్తే పార్టీ కొత్త పేరు మీదే మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకు కొంత సమయం పట్టినా.. అప్పటివరకు టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్‌ను వాయిదా వేయాలని ఆయన యోచిస్తున్నట్టు సమాచారం. మంగళవారం మునుగోడు(Munugodu) అభ్యర్థిగా ఉండబోయే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్ రావుతో పాటు మంత్రి హరీశ్ రావు(Harish Rao)‌తో కలిసి కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికపై సమీక్ష నిర్వహించారు.

  YS Sharmila: ఢిల్లీకి వైఎస్ షర్మిల.. కేంద్ర పెద్దలను కలిసే ఛాన్స్.. కేసీఆర్ సర్కార్‌పై ఫిర్యాదు ?

  Ts Politics: సీఎం కేసీఆర్ కొత్త స్ట్రాటజీ..పైలట్ ప్రాజెక్ట్ గా మునుగోడు ఎంపిక..స్కిం మార్పు కలిసొచ్చేనా?

  ఈ సమీక్ష సందర్భంగా కేసీఆర్ ఈ రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థి పేరుతో పాటు చండూరులో ఏర్పాటు చేయబోయే సభ తేదీని, అలాగే అభ్యర్థి నామినేషన్ వేయాల్సిన తేదీని కూడా కేసీఆర్ తొందరలోనే ఖరారు చేయనున్నట్టు సమాచారం. కొత్త పార్టీ పేరుతో మునుగోడు ఉప ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించడం ద్వారా తన కొత్త జాతీయ పార్టీకి తొలి విజయాన్ని అందించినట్టు అవుతుందనే భావనలో సీఎం కేసీఆర్ ఉన్నారని తెలుస్తోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, Telangana

  ఉత్తమ కథలు