హోమ్ /వార్తలు /తెలంగాణ /

Munugode | EC: నవంబర్ 3న మునుగోడు ఉపఎన్నిక ..6న కౌంటింగ్ ..షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

Munugode | EC: నవంబర్ 3న మునుగోడు ఉపఎన్నిక ..6న కౌంటింగ్ ..షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

EC| Munugode: మునుగోడు ఉపఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 3వ తేదిన ఉపఎన్నిక నిర్వహించనున్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మరి కౌంటింగ్ ఎప్పుడంటే..?

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మునుగోడు(Munugode)ఉపఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 3వ తేదిన ఉపఎన్నిక నిర్వహించనున్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌(Schedule)ను విడుదల చేసింది. మునుగోడుతో పాటు మిగిలిన చోట్ల నిర్వహించాల్సిన ఉపఎన్నికల స్థానాలకు షెడ్యూల్‌ని సోమవారం(Monday) విడుదల చేసింది ఈసీ. ఈనెల 7న మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ వెలువడనుంది. అక్టోబర్‌ 14వ తేది నామినేషన్ల స్వీకరణకు చివరి గడువు ఇచ్చింది ఎన్నికల సంఘం. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 17వ తేది వరకు గడువు ఉంది. ఇక ఉపఎన్నిక పోలింగ్‌ నవంబర్‌ 3న(November 3)ఉండగా కౌంటింగ్ 6వ (November6)తేదిన నిర్వహించనున్నట్లుగా ఎన్నికల సంఘం(Election Commission) వెల్లడించింది.

ఈసీ షెడ్యూల్ ఇదే ..

నవంబర్ 3న మునుగోడు ఉపఎన్నిక

నవంబర్ 6న కౌంటింగ్

అక్టోబర్ 7న గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్

అక్టోబర్ 14న నామినేషన్ల స్వీకరణ

అక్టోబర్ 15న నామినేషన్ల పరిశీలన

అక్టోబర్ 17న నామినేషన్ల ఉపసంహరణ

నవంబర్ 3న దేశంలో 7 సెగ్మెంట్లలో ఉపఎన్నికలు

కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటన

Kcr|Telangana: కోనాయిపల్లి వెంకన్న టెంపుల్‌కు సీఎం కేసీఆర్ .. ఆ సెంటిమెంట్‌తోనే ప్రత్యేక పూజలు

మోగిన ఎన్నికల నగారా..

తెలంగాణలో నిర్వహించబోయే మునుగోడు ఉపఎన్నికను ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బరిలో దిగుతుండగా ...కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి పోటీలో నిలిచారు. ఇక తెలంగాణలో అధికార పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్‌ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్ధిని ఖరారు చేయలేదు. దసరా పండుగలోపు టీఆర్‌ఎస్‌ పార్టీ తమ అభ్యర్ధి పేరు ప్రకటిస్తారని తెలుస్తోంది. మునుగోడుతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో జరగాల్సిన ఉపఎన్నికల నియోజకవర్గాల షెడ్యూల్‌ని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.

EC schedule
(EC schedule)

సమరమే ...

ఉపసమరానికి కేవలం నెల రోజులు మాత్రమే గడువు ఇచ్చింది ఎన్నికల సంఘం. ఈనెల ఏడవ తేదిన నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చే నెల 6వ తేదిన కౌంటింగ్ నిర్వహించి నెల రోజుల్లోనే ఉపఎన్నికల ప్రక్రియను ముగించనుంది. అయితే ఇప్పటి వరకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నేతలు మునుగోడులో ప్రచారానికి సంబంధించిన అన్నీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

మొత్తం ఏడు స్థానాల్లో ఉపఎన్నికలు..

మహారాష్ట్రలోని అంధేరీ ఈస్ట్, బిహార్ లోని మొకామా, గోపాల్ గంజ్, హర్యానాలోని అదంపూర్, ఉత్తర్ ప్రదేశ్ లోని గోలాగోక్రన్నత్, ఒడిషాలోని ధామ్ నగర్ సెగ్మెంట్లకు కూడా మునుగోడుతో పాటే నవంబర్ 3న పోలింగ్ జరగనుంది. ఈ ఏడు స్థానాల కౌంటింగ్ నవంబర్ 6న జరగనుంది.

Published by:Siva Nanduri
First published:

Tags: Election Commission of India, Munugode Bypoll, Telangana Politics

ఉత్తమ కథలు