ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ ముగిసింది. సుమారు 9గంటల పాటు ఎమ్మెల్సీ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ (ED) అధికారులు ప్రశ్నించారు. శనివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకి వెళ్లిన కవితను జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో ఐదుగురు అధికారుల బృందం ప్రశ్నించడం జరిగింది. విచారణ ముగియగానే ఆమె నేరుగా నివాసానికి చేరుకున్నారు. లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే అరెస్టైన రామచంద్రపిళ్లైతో కలిసి కవితను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఈకేసు విచారణలో భాగంగానే కల్వకుంట్ల కవితను ఈనెల 16వ తేదిన మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని ఈడీ నోటీసులు ఇచ్చింది.
9గంటల పాటు విచారణ..
కవితను ఈడీ అధికారులు ఈనెల 13న మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పడంతో ఆరోజు కవిత జన్మదినం కావడం వల్ల 16వ తేదిన వస్తానని ఈడీకి చెప్పడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరెట్ అధికారులు అంగీకరించారు.
ప్రశ్నల వర్షం ..
కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు ప్రశ్నించిన సమయంలో ఈడీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా 144 సెక్షన్ విధించారు. మరోవైపు ఢిల్లీలో BRS కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆందోళనలు చేపట్టారు.
16న మళ్లీ విచారణకు..
ఈ కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాద్ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై.. తాను కవితకు బినామీని అనీ, అంతా ఆమె చెప్పిన ప్రకారమే చేశానని... ఈడీ విచారణలో స్టేట్‌మెంట్ ఇవ్వడంతోనే... కవితను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.ఇప్పటికే ఈ కేసులో 11 మందిని అరెస్టు చేసారు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi news, Kalvakuntla Kavitha