హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana politics : నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు ఈడీ నోటీసులు ... కారణం అదేనా..?

Telangana politics : నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు ఈడీ నోటీసులు ... కారణం అదేనా..?

(Telangana Congress)

(Telangana Congress)

ED|TS Congress: కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు చేస్తున్న ఆలోచనలు, తీసుకుంటున్న నిర్ణయాలు, వేస్తున్న అడుగులు ప్రత్యర్ధి పార్టీలకు అర్ధం కావడం లేదు. ఓవైపు ఆపరేషన్‌ ఆకర్షణ పేరుతో ఇతర పార్టీల నేతలకు వల వేస్తూనే మరోవైపు ఈడీ కొరడాను ఝుళిపిస్తోంది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతల వంతు వచ్చింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

కేంద్రంలో ఉన్న బీజేపీ (BJP)సర్కారు చేస్తున్న ఆలోచనలు, తీసుకుంటున్న నిర్ణయాలు, వేస్తున్న అడుగులు ప్రత్యర్ధి పార్టీలకు అర్ధం కావడం లేదు. ఓవైపు ఆపరేషన్‌ ఆకర్షణ పేరుతో ఇతర పార్టీల నేతలకు వల వేస్తూనే మరోవైపు ఈడీ కొరడాను ఝుళిపిస్తోంది. బీజేపీ వలలో చిక్కని నాయకులు, కమలం వైపు చూడని పార్టీల నేతలపై కొత్త ఆస్త్రాన్ని ప్రయోగిస్తోందనే విమర్శలు కాంగ్రెస్ (Congress) శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌ (TRS) నేతలపై ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam)ఆరోపణలతో ఈడీ(ED)ని ప్రయోగిస్తున్న కేంద్రం .. తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలను వదలడం లేదు. గతంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్‌ హెరాల్డ్ కేసు(National Herald case)లో  ప్రస్తుతం కీలక నాయకులకు ఈడీ నోటీసులు జారీ చేయడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో కలవరం మొదలైంది.

Telangana : లారీపై విమానం .. రోడ్డుపై వెళ్తుంటే చూసి ఆశ్చర్యపోయిన జనం

తెరపైకి నేషనల్ హెరాల్డ్‌ కేసు..

తెలంగాణలో ఓ వైపు లిక్కర్‌ స్కాంపై సోదాలు జరుగుతున్న సమయంలోనే ఐదుగురు కాంగ్రెస్‌ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేశారన్న వార్త హాట్‌ టాపిక్‌గా మారాయి. గతంలో మంత్రులుగా పనిచేసిన ముగ్గురితో పాటు ఇద్దరు ఎంపీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసినట్లుగా సమాచారం ఉంది. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌లుగా ఉన్న గీతారెడ్డి, రేణుకాచౌదరి, షబ్బీర్ అలీ, సుదర్శన్‌రెడ్డితో పాటు మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌కు ఈడీ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అంతే కాదు అక్టోబర్‌ 10వ తేదిన విచారణకు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రావాలని కోరడం జరిగింది.

ఐదుగురు టీకాంగ్రెస్‌ నేతలకు ఈడీ నోటీసులు ..!

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ జోడో యాత్రలో ఉండగానే ఈపరిణామం చోటుచేసుకోవడం చూస్తుంటే బీజేపీ ....కాంగ్రెస్ నాయకులపై కూడా ఫోకస్ పెట్టిందనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్‌ మినహా మిగిలిన పార్టీల నేతలు ఒక్కొక్కరుగా బీజేపీలో చేరుతున్నప్పటికి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరికలు లేని కారణంగానే కమలనాథులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. అంతే కాదు ఈడీ నోటీసులపై కూడా నేతలు స్పందించారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ,  మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌.  తమకు ఎలాంటి నోటీసులు రాలేదని ..ఒక వేళ వస్తే విచారణకు హాజరు అవుతామని కూడా చెప్పారు.రాహుల్ భారత్ జోడో యాత్రతో బీజేపీలో వణుకు మొదలైందన్నారు. మునుగోడు ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందని.. అందుకే బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందని నేతలు విమర్శలు చేస్తున్నారు.

TS Congress: షబ్బీర్ అలీపై కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు.. ప్రియాంకాగాంధీకి లేఖ

కారణం అదేనంటున్న నేతలు..

ఈడీ నోటీసులపై మాజీ మంత్రి గీతారెడ్డి కూడా ఇదే విధంగా స్పందించారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా నోటీసులు తనకు చేరలేదన్నారు. తాను నేషనల్ హెరాల్డ్ పేపర్‌కు ఆర్థిక సహాయం చేశానని.. అది చెక్కు రూపంలోనే ఇచ్చానన్నారు. ఈ కేసులో ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు. ఎప్పుడో పాత కేసులో కేంద్రం ఇప్పుడు నోటీసులు పంపించడం వెనుక ఆంతర్యమేమిటని ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

ఏం జరుగనుందో..?

బీజేపీ పార్టీలోకి కాంగ్రెస్‌ నేతల వలసలు కొనసాగడం లేదనే అక్కసుతోనే ఈవిధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు చేస్తున్నారు. మరికొందరు నేతలు రాహుల్‌ జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశించక ముందే ఒకరకమైన అటెన్షన్‌ క్రియేట్ చేయాలని చూస్తున్నట్లుగా ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ కామెంట్స్‌ తర్వాత పరిణామాలు ఎలా మారుతాయో చూడాలి.

Published by:Siva Nanduri
First published:

Tags: Bjp, Telangana Politics, TS Congress

ఉత్తమ కథలు