Telangana | ED: తెలంగాణలో అధికార పార్టీకి చెందిన ఎంపీ నామానాగేశ్వరరావు కంపెనీపై ఈడీ కొరడా ఝుళిపించింది. టీఆర్ఎస్ ఎంపీకి చెందిన మధుకాన్ ప్రాజెక్ట్ సంస్థతో పాటు డైరెక్టర్లు, ప్రమోటర్లకు చెందిన ఆస్తులను అటాచ్ చేసింది. ప్రధాని హైదరాబాద్ పర్యటనలో ఉండగానే ఈ పరిణామం చోటుచేసుకోవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.
(G.SrinivasReddy,News18,Khammam)
తెలంగాణ(Telangana)లో పొలిటికల్ గేమ్ షురువైందో లేదో వేట మొదలైంది. ఇప్పటి వరకు కేంద్రంపై రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్(TRS) నేతలు స్వరం పెంచి చేసిన వ్యాఖ్యలు, నగరంలో కట్టిన ఫ్లెక్సీలు, ప్రధాని వస్తున్న సందర్భంగా చూపించిన దూకుడుకి రియాక్షన్ ఈడీ(ED)రూపంలో వచ్చినట్లుగా కనిపిస్తోంది. హైదరాబాద్ (Hyderabad)లో బీజేపీ (BJP) జాతీయ కార్యవర్గ సమావేశాలు ఓవైపు..విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్ధిగా యశ్వంత్‌సిన్హా (Yashwantsinha)కు టీఆర్ఎస్ మద్దతిస్తూ సభ ఏర్పాటు చేయడం మరోవైపు జరుగుతుండగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate)అటాక్ చేసింది. అధికార పార్టీ టీఆర్ఎస్ లోక్‌సభ సభ్యుడు నామానాగేశ్వరరావు(Namanageswara Rao)కు చెందిన కంపెనీ ఆస్తులను అటాచ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది.
స్పీడు పెంచిన ఈడీ..
అక్కడో ..ఎక్కడో కాదు ఇప్పుడు తెలంగాణలోని అధికార పార్టీ నేతలపైనే ఈడీ స్పీడు పెంచింది. ప్రస్తుత టీఆర్ఎస్ ఎంపీ , ఖమ్మం లోక్‌సభ సభ్యులు నామా నాగేశ్వర్రావుకు చెందిన మధుకాన్ ప్రాజెక్ట్‌తో పలు కంపెనీలు ఉన్నాయి. గతంలో అంటే నామా నాగేశ్వరరావు రాజకీయాల్లోకి రాక ముందు ఈ కంపెనీని స్థాపించారు. నిర్మాణ రంగంగా ఉన్న ఈ కంపెనీ తర్వాత కాలంలో పలు రంగాలకు విస్తరించి మధుకాన్ గ్రూప్‌గా మార్చుకుంది. అయితే ఈ కంపెనీ జార్ఖాండ్ రాష్ట్రం రాంచీలో ఎక్స్‌ప్రెస్ హైవేను నిర్మించింది. ఆ ప్రాజెక్టు కోసం రుణాలు తీసుకొని తిరిగి చెల్లించలేదన్న ఆరోపణలపై సుమారు 20ఏళ్ల క్రితం అంటే 2002లోనే ఈడీ కేసు నమోదు చేసింది. ఈకేసులో ఇప్పుడు ఈడీ కంపెనీతో పాటు డైరెక్టర్లు, ప్రమోటర్లకు చెందిన 96.21కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది.
ED has provisionally attached 105 immovable properties and other assets worth Rs 96.21 Crore belonging to Madhucon Group of companies and its directors & promoters in a money laundering case against M/s Ranchi Expressway Ltd Bank Fraud, under the provisions of PMLA 2002.
గులాబీ పార్టీలో గుబులు..
గతంలో టీడీపీలో కొనసాగిన నామా నాగేశ్వరరావు రాష్ట్ర విభజన తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్లో చేరారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం టీఆర్ఎస్ లోక్‌సభ పార్లమెంటరీ పార్టీ సభ్యులుగా ఉన్నారు. ఈక్రమంలోనే విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్ధిగా ఉన్న యశ్వంత్ సిన్హాను సీఎం కేసీఆర్ వెంట వెళ్లి రిసీవ్ చేసుకున్నారు నామానాగేశ్వరరావు. అటుపై జల విహార్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలోనూ నామానాగేశ్వరరావు పాల్గొన్నారు.అధికార పార్టీ ఎంపీ ఈ సమావేశంలో ఉండగానే ఆయన కంపెనీలపై ఈడీ కొరడా ఝుళిపించడం చర్చనీయాంశమైంది.
ఇది చదవండి: కేటీఆర్ మాటలపై విశ్వబ్రాహ్మణులు గరం ..సారీ చెప్పకపోతే బాగోదంటూ వార్నింగ్
ఊహించని పరిణామం..
విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్ధికి మద్దతిస్తూ శనివారం జలవిహార్‌లో టీఆర్ఎస్ సమావేశం నిర్వహించింది. ఆ సభలోనే కేసీఆర్ కేంద్రంపై తనదైన శైలీలో విరుచుకుపడ్డారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ విధానాల్ని తీవ్రంగా ఎండగట్టారు.ఇది జరిగిన కొద్ది సమయంలోనే ఈడీ నుంచి అదే పార్టీకి చెందిన ఎంపీకి చెందిన ఆస్తుల అటాచ్ చేసిన పరిణామంపై రాష్ట్ర అధికార పార్టీ నేతల రియాక్షన్ ఎలా ఉండబోతుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.