Home /News /telangana /

TS POLITICS EATALA RAJENDER REPORTEDLY USED CONGRESS LEADER CAR TO MEET AMIT SHAH THE HUZURABAD MLA MAY GET KEY POST IN TELANGANA BJP MKS KNR

Eatala Rajender : కాంగ్రెస్ నేత కారులో ఈటల.. Amit Shah హామీ ఇచ్చిన కీలక పదవి ఇదే!

అమిత్ షాతో ఈటల

అమిత్ షాతో ఈటల

అసంతృప్తిని పసిగట్టిన హైకమాండ్ ఈటలను ఢిల్లీకి పిలిపించి. తెలంగాణ బీజేపీలో ఈటల ప్రాధాన్యం పెరిగేలా కీలక పదవిని అమిత్ షా నుంచి హామీగా పొందినట్లు తెలుస్తోంది. కాగా, ఢిల్లీ టూర్ లో రాజేందర్ ఓ కాంగ్రెస్ నేత కారును వాడటం చర్చనీయాంశమైంది..

ఇంకా చదవండి ...
సీఎం కేసీఆర్ (Telangana CM KCR)ను ఢీకొట్టి హుజూరాబాద్ ఉప ఎన్నికలో ప్రభంజన విజయం సాధించినప్పటికీ.. బీజేపీ (BJP) చేస్తోన్న టీఆర్ఎస్ వ్యతిరేక పోరులో ఈటల రాజేందర్ (Eatala Rajender)కు సరైన ప్రాధాన్యం దక్కడంలేదని కొంతకాలంగా వాదన వినిపిస్తోంది. అసంతృప్తిని పసిగట్టిన హైకమాండ్ ఈటలను ఢిల్లీకి పిలిపించి. బీజేపీ జాతీయ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ఆదివారం నాడు ఈటల రాజేందర్ ను ఇంటికి పిలిపించుకొని ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణ బీజేపీలో ఈటల ప్రాధాన్యం పెరిగేలా కీలక పదవిని అమిత్ షా నుంచి హామీగా పొందినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర పార్టీలో సరైన ప్రాధాన్యం దక్కడంలేదనే అసంతృప్తితో ఉన్న ఈటలపై బీజేపీ హైకమాండ్ భారీ బాధ్యతలు మోపనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలనుకుంటోన్న బీజేపీ.. ఈటలకు ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు కట్టబెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై చర్చించేందుకే ఈటలను అమిత్ షా ఢిల్లీకి పిలిపించినట్లు తెలుస్తోంది. ఈటల వెంట ఏనుగు రవీంద్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. సీఎం కేసీఆర్ తో పోరాడి గెలిచిన ధీరుడిగా ఈటలకు కీలక బాధ్యతలు అప్పగిస్తే తెలంగాణతో బీజేపీ జెండా ఎగరటం ఖాయమనే రిపోర్టుల నేపథ్యంలోనే హైకమాండ్ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

అమిత్ షాతో ఈటల భేటీ

TRSలో కొత్త సీన్: KCR అసంతృప్తులకు KTR బుజ్జగింపులు -మొన్న పొంగులేటి, నిన్న జూపల్లితో..


కాగా, అమిత్ షాతో భేటీ ముగించుకొని ఆదివారం రాత్రే హైదరాబాద్ తిరిగొచ్చిన ఈటల రాజేందర్.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడారు. అమిత్ షాతో చర్చల్లో తనకు కీలక పదవి లేదా బాధ్యతల గురించి ప్రత్యేకంగా మాట్లాడలేదని ఈటల చెప్పారు. తెలంగాణలో ఎలాంటి స్ట్రాటజీతో ముందుకెళదాం అనే అంశంపై కీలక నేతల నుంచి అమిత్ షా అభిప్రాయాలు, సమాచారన్ని సేకరిస్తున్నారని అందులో భాగంగానే తాను కలిశానని ఈటల తెలిపారు. మాటల క్రమంలో జీవో111పై అమిత్ షా ఆరా తీశారని, కేసీఆర్ స్వప్రయోజనాల కోసమే సదరు జీవో తెచ్చినట్లు వివరించానని ఈటల చెప్పారు.


AP Debts | CAG : జగన్ సర్కారు అప్పులు తక్కువే! -కాగ్ రిపోర్టులో అనూహ్య లెక్కలు..


ఇదిలా ఉంటే, ఢిల్లీ పర్యటనలో అమిత్ షా ఇంటికి వెళ్లడానికి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వాడిన కారుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే, పారిశ్రామికవేత్త కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన కారులో ఈటల ప్రయాణించడం, అందులోనే షా ఇంటికి వెళ్లడం గమనార్హం. కాంగ్రెస్ పై తిరుగుబావుటా ఎగరేసిన కోమటిరెడ్డి చాలా కాలంగా బీజేపీ అనుకూల వ్యాఖ్యలు చేస్తుండటం తెలిసిందే. కోమటిరెడ్డిపై చర్యలకు టీపీసీసీ జంకుతోన్నా ఆయన మాత్రం ప్రోబీజేపీ స్ట్రాటజీని బలంగానే అమలు చేస్తున్నట్లు నిన్నటి ఘటనతో మరోసారి రుజువైంది. హైదరాబాద్ వేదికగా జులై తొలివారంలో జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందే ఈటల రాజేందర్ కు కొత్త బాధ్యతలపై ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.
Published by:Madhu Kota
First published:

Tags: Amit Shah, Bjp, Etela rajender, Telangana

తదుపరి వార్తలు