తెలంగాణలో రాజకీయం (Telangana Politics) వేడెక్కింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం తలపిస్తుంది. ఓ వైపు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల (Ys Sharmila) ప్రజా ప్రస్థానం పాదయాత్ర, మరోవైపు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ప్రజా సంగ్రామ యాత్ర, ఇంకోవైపు తెలంగాణ కాంగ్రెస్ లో ప్రక్షాళన, రేవంత్ (Revanth Reddy) పాదయాత్ర చేస్తారనే ప్రచారం. ఇక టీఆర్ఎస్ పార్టీ బాస్ సీఎం కేసీఆర్ (Cm Kcr) వరుస బహిరంగ సభలతో ఎన్నికల హడావుడి నెలకొంది. అయితే మొన్న టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ (Cm Kcr) ముందస్తు ఎన్నికలకు వెళ్ళేది లేదని తేల్చి చెప్పారు. అయినా కానీ ముందస్తు ఎన్నికల ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలో మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) ముందస్తు ఎన్నికల ప్రచారంపై స్పందించారు.
ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన తమ పార్టీకి లేదని అన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం మాకు లేదు. తమ పార్టీ అధినేత కూడా ఎక్కడా చెప్పలేదన్నారు. కొంతమంది బీజేపీ (Bjp) నేతలు జ్యోతుష్యులుగా మారి చెప్పే మాట అని మంత్రి (Minister Harish Rao) అన్నారు. ఇక తాము జైలుకు వెళ్తామని, అలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారని కొంతమంది బీజేపీ నేతలు జోతిష్యం చెబుతూ ఉంటారని విమర్శించారు. రాష్ట్రంలో 5 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగితే రెండు ఉప ఎన్నికల్లో బీజేపీ (Bjp) డిపాజిట్ కూడా కోల్పోయిందన్నారు. మునుగోడు (Munugodu)లో టీఆర్.ఎస్ కు మెజారిటీ తగ్గడంపై ఆయన స్పందించారు. మెజారిటీ తగ్గిందని టీఆర్ఎస్ కంటే బీజేపీ (Bjp) అనుకుంటే పొరపాటే అని, బీజేపీ (Bjp) నేతలు వాపును చూసి బలుపు అనుకుంటున్నారని మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) మండిపడ్డారు.
కేసీఆర్ వెళ్లను అంటే వెళ్తారనే అర్ధం..
ఇటీవల టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ ముందస్తు ఎన్నికల అంశాన్ని లేవనెత్తారు. తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లమని చెప్పారు. అయినప్పటికీ కూడా దీనిపై ప్రచారం ఆగడం లేదు. కేసీఆర్ వెళ్లను అంటే ఖచ్చితంగా వెళతారని బీజేపీ నాయకులు చెబుతున్నారు.
కేసీఆర్ మనసులో ఏముంది?
ఓ వైపు ముందస్తు ఎన్నికలకు వెళ్ళేది లేదని చెప్పిన కేసీఆర్ మరోవైపు ఇప్పటి నుంచే ప్రజల్లో ఉండాలని క్యాడర్ ను ఆదేశించారు. అలాగే వరుస బహిరంగ సభలకు ముహూర్తం ఖరారు చేశారు. డిసెంబర్ 4న మహబూబ్ నగర్ , డిసెంబర్ 7న జగిత్యాల , ఆ తరువాత వారం పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక సమావేశాల అనంతరం మహబూబాబాద్ , కరీంనగర్ లో కూడా సీఎం కేసీఆర్ బహిరంగ సభలు ఉండనున్నాయి. మరి ముందస్తు ఎన్నికలకు వెళ్ళేది లేదని బయటకు చెబుతున్న కానీ కేసీఆర్ మనసులో ఏముందో మరి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, CM KCR, Harish Rao, Hyderabad, Minister harishrao, Telangana, Telangana News, Trs