హోమ్ /వార్తలు /తెలంగాణ /

D Srinivas: డైలమాలో డీఎస్.. ఎటూ తేల్చని కాంగ్రెస్.. పదవి ఇవ్వలేని బీజేపీ.. టీఆర్ఎస్ ఎంపీగా రిటైర్మెంట్

D Srinivas: డైలమాలో డీఎస్.. ఎటూ తేల్చని కాంగ్రెస్.. పదవి ఇవ్వలేని బీజేపీ.. టీఆర్ఎస్ ఎంపీగా రిటైర్మెంట్

డి శ్రీనివాస్ (పాత ఫొటో)

డి శ్రీనివాస్ (పాత ఫొటో)

డి శ్రీనివాస్ టీఆర్ఎస్ ఎంపీగా ఇవాళ వీడ్కోలు పొందారు. తదుపరి కాంగ్రెస్ లో చేరడానికి హైకమాండ్ నుంచి సిగ్నల్ రాలేదు. పదవి ఇచ్చి చేర్చుకోడానికి బీజేపీ సైతం సుముఖంగా లేదు. దీంతో డీఎస్ డైలమాలో కొనసాగుతున్నారు..

ధర్మపురి శ్రీనివాస్.. డీ శ్రీనివాస్ అలియాస్ డీఎస్.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దాదాపు అన్ని రాష్ట్రాల నేతలు గుర్తుపట్టి గౌవరించుకునే సీనియర్ నేత. ఒకప్పుడు ఆయన చెప్పిన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ దక్కేది. పార్టీ అధ్యక్షుడి హోదాలో ముఖ్యమంత్రికి సమాంతరంగా వ్యవహారం నడిపిన చరిత్ర తనది. తెలంగాణలో ఇప్పుడున్న రాజకీయ నేతలు అందరిలోకి సీనియర్ అయిన డీఎస్ ప్రస్తుతం డైలమాలో కొట్టుమిట్టాడుతున్నారు. కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్ ఎంపీగా నేడు రాజ్యసభలో వీడ్కోలు పొందారాయన. అయితే, రాజకీయ భవితవ్యం డోలాయమాన పరిస్థితుల్లోనే ముగియనుందా? అనే చర్చ జరుగుతోంది..

నిజామాబాద్ జిల్లాకు చెందిన ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డీఎస్ వయసు ప్రస్తుతం 73 ఏళ్లు. దశాబ్దాలపాటు కాంగ్రెస్ వాదిగా కొనసాగి, తెలంగాణ ఏర్పడిన తర్వాత అనూహ్యంగా కేసీఆర్ కారెక్కిన ఆయన రాజ్యసభ ఎంపీ పదవి పొందారు. కానీ కొన్నేళ్లుగా గులాబీ బాస్ తో విభేదాల కారణంగా డీఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. డీఎస్ కొడుకు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవితను ఓడించిన తర్వాత కేసీఆర్ తో దూరం మరింత పెరిగింది. డీఎస్ ను టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శించి, దూషించడం పరిపాటిగా మారింది. అయినా సరే డీఎస్ ను ఎంపీ పదవి నుంచి తొలగించకుండా ఓపికవహించారు కేసీఆర్. చూస్తుండగానే డీఎస్ రాజ్యసభ పదవీకాలం ముగిసిపోయింది.

KCR ఇష్టం, కానీ MLAsతో కష్టం -సిట్టింగ్‌లపై ప్రశాంత్ కిషోర్ షాకింగ్ రిపోర్ట్ -వీరికి ఈసారి టికెట్ లేనట్టే


కేసీఆర్ తో విభేదల క్రమంలో డీఎస్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. డీఎస్ జనవరిలోనే కాంగ్రెస్ లో పున:ప్రవేశం చేస్తారని ప్రస్తుత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాముఖంగా ప్రకటించారు. ఆ మేరకు సోనియా గాంధీ కూడా సుముఖంగా ఉన్నారని, జనవరి చివరివారంలోనే సోనియాతో డీఎస్ అపాయింట్మెంట్ ఖరారైందనీ వార్తలు వచ్చాయి. కానీ మూడు నెలలు గడుస్తున్నా డీఎస్ చేరికపై కాంగ్రెస్ హైకమాండ్ ఎటూ తేల్చలేదు.

PM Modi: 72 మంది ఎంపీలకు వీడ్కోలు.. చదవు కంటే అనుభవ జ్ఞానమే గొప్పదన్న ప్రధాని మోదీ


కాంగ్రెస్ ను విడిచిపెట్టి పెద్ద తప్పు చేశానని, మళ్లీ జీవితంలో అలాంటి పొరపాటు చేయబోనని డీఎస్ బాహాటంగా క్షమాపణలు చెప్పడంతో ఆయన చేరికకు సోనియా గాంధీ సానుకూలంగా స్పందించారు. కానీ క్షేత్రస్థాయిలో డీఎస్ చేరికపై తీవ్ర వ్యతిరేకత రావడంతో కథ అడ్డం తిరిగింది. డీఎస్ చేరికతో కాంగ్రెస్ లాభపడకపోగా, నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని నిజామాబాద్ నేతలు నేరుగా రాహుల్ గాంధీకే మొరపెట్టుకున్నారు. పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ ఎంత ప్రయత్నించినా డీఎస్ చేరికను ఫైనలైజ్ చేయలేకపోయారు. అలాగని డీఎస్ కు కాంగ్రెస్ తలుపులు మూసిందా అంటే అదీ జరగలేదు. కాంగ్రెస్ ఎంతకీ తేల్చకపోవడంతో..

Shalu Chourasiya: హీరోయిన్‌పై అత్యాచారయత్నం, దోపిడీ కేసు.. నిందితుడిపై పీడీ యాక్ట్


డీఎస్ తదుపరి ప్రయత్నాల్లో భాగంగా బీజేపీని సంప్రదించినట్లు తెలుస్తోంది. నిజానికి డీఎస్ చేరిక కోసం బీజేపీ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నా, వ్యక్తిగతంగా కాంగ్రెస్ వాది కావడంతో కాషాయదళంలో చేరిక దిశగా డీఎస్ ప్రయత్నించలేదు. చిన్న కొడుకు అరవింద్ నిజామాబాద్ ఎంపీగా గెలిచిన తర్వాత కూడా డీఎస్ బీజేపీని సమర్థించలేదు. కాగా, రాజ్యసభ ఎంపీగా తిరిగి అవకాశం కల్పిస్తే బీజేపీలో చేరుతానని డీఎస్ కమలనాథులతో అన్నట్లు వినికిడి.

Srisailam: శ్రీశైలంలో కర్ణాటక భక్తుల బీభత్సం.. ఆలయం వద్ద దుకాణాలకు నిప్పు.. ఏం జరిగిందంటే..


కానీ ప్రధాని మోదీ నిర్దేశం ప్రకారం ఒక కుటుంబానికి ఒకే పదవి ఇవ్వాలనే విధానం కొనసాగుతుండటం, డీఎస్ కొడుకు ఇప్పటికే ఎంపీగా ఉన్నందున ఆయనకు రాజ్యసభ పదవి అసాధ్యమని నేతలు స్పష్టం చేశారట. అయితే, పార్టీలో చేరితే సముచితంగా గౌరవించుకుంటామని మాత్రం ఢిల్లీ పెద్దలు డీఎస్ కు హామీ ఇచ్చినట్లు తెలిసింది. మరి డీఎస్ ఏం చేయబోతున్నారనేది ప్రస్తుతానికి డైలమాగానే ఉంది. టీఆర్ఎస్ ఎంపీగా నేడు వీడ్కోలు పొందిన డీఎస్ ను కాంగ్రెస్ తిరిగి చేర్చుకుంటుందా? పదవి ఇవ్వకుండా బీజేపీ గాలం వేస్తుందా? చూడాలిమరి.

First published:

Tags: Bjp, CM KCR, Congress, D Srinivas, Dharmapuri Arvind, Nizamabad, Parliament, Rajya Sabha, Trs

ఉత్తమ కథలు