టీఆర్ఎస్ నాయకులు టార్గెట్ గా ఈడీ (Enforcement Directorate), ఐటీ రైడ్స్ (Income Tax) పై సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) స్పందించారు. తెలంగాణ మంత్రులు ఈడీ, ఐటీ పిలిస్తే విచారణకు వెళ్తున్నారని..అయితే ఇక్కడ దొరికిన వాళ్లను విచారణ చేయొద్ద అని ప్రశ్నించారు. తమకు ఏం సంబంధం లేదన్నవాళ్లు కోర్టుకు ఎందుకు వెళ్తున్నారని మండిపడ్డారు. బండి సంజయ్ యాదాద్రికి వెళ్లి దొంగ ప్రమాణాలు చేశారని, నిన్న ఆయన ఎందుకు ఏడ్చాడో నాకు అర్ధం కావట్లేదన్నారు. కామారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కవిత (MLC Kalvakuntla Kavitha) ఈ వ్యాఖ్యలు చేశారు.
బీజేపీకి లీడర్ లేడు..ఐడియాలజీ లేదు..
బీజేపీకి లీడర్ లేడు..ఐడియాలజీ లేదని కవిత (MLC Kalvakuntla Kavitha) తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇతర పార్టీ నాయకులను ప్రలోభపెట్టడం లేదా ఈడీ, ఐటీ రైడ్స్ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. రాజకీయంగా బలంగా ఉన్న వాళ్లను గద్దనెక్కకుండా తన్నుకుపోవాలన్నది బీజేపీ ప్లాన్ అని కవిత (MLC Kalvakuntla Kavitha) ఆరోపించారు. నెల రోజుల నుండి టీఆర్ఎస్ నాయకులే టార్గెట్ గా రైడ్స్ జరుగుతున్నాయి. ఏ ఒక్క ఎమ్మెల్యేను, మంత్రిని వదిలిపెట్టడం లేదు. కానీ తమకు ఎలాంటి భయం లేదని, వాళ్లు వ్యాపారాలు లీగల్ గా చేస్తున్నారని అన్నారు. అధికారులు వచ్చి అడిగితే పత్రాలు ఇస్తారు సమాధానం ఇస్తారన్నారు.
BL సంతోష్ పేరు రాగానే ఎందుకంత భయం..
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో BL సంతోష్ పేరు వినిపించింది. దీనితో సిట్ అధికారులు విచారణకు రావాలని సంతోష్ కు నోటీసులు జారీ చేశారు. సంతోష్ కు నోటీసులు ఇస్తే ఎందుకంత భయం. అరెస్ట్ చేయొద్దని కోర్టుకు కూడా వెళ్లారు. ఇప్పుడు కనీసం విచారణకు కూడా రావడం లేదు. మన ఎమ్మెల్యేలు, మంత్రులను ఈడీ, ఐటీ విచారణ చేయొచ్చు కానీ ఇక్కడ దొరికిన దొంగలను మాత్రం విచారించకూడదా అని కవిత (MLC Kalvakuntla Kavitha) ప్రశ్నించారు. దొంగతనం చేయని వాళ్లు ఎందుకంతలా భయపడుతున్నారని అన్నారు.
బీజేపీ వాళ్లు రాముని పేరు చెప్పుకొని రౌడీయిజం చేస్తున్నారని కవిత (MLC Kalvakuntla Kavitha) ఫైర్ అయ్యారు. దొంగ ప్రమాణాలు చేసిన బండి సంజయ్ నిన్న సభలో ఎందుకు ఏడ్చారో అర్ధం కాలేదని ఎద్దేవా చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Bjp, CM KCR, Kalvakuntla Kavitha, Kamareddy, Telangana, Trs