హోమ్ /వార్తలు /తెలంగాణ /

Dalit Bandhu: దళితబంధుపై అలాంటి ప్రచారం వద్దు.. సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..

Dalit Bandhu: దళితబంధుపై అలాంటి ప్రచారం వద్దు.. సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..

సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిన మోత్కుపల్లి నర్సింహులు

సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిన మోత్కుపల్లి నర్సింహులు

Motkupalli Narsimhulu Joins TRS: మోత్కుపల్లి నర్సింహులు సేవలను ఏ స్థాయిలో వాడుకోవాలో.. ఆ స్థాయిలో వాడుకుంటానని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆయనను కేవలం ఒక్క నియోజకవర్గానికి పరిమితం చేసే ఆలోచన లేదని పేర్కొన్నారు.

  కేవలం ఒక్క వర్గానికి మాత్రమే ప్రభుత్వం మేలు చేస్తుందనే విధంగా దళితబంధు విషయంలో ప్రచారం చేయొవద్దని తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించారు. సమాజంలో అట్టడుగున ఉన్న వర్గాలకు చేయూత ఇచ్చేందుకు దళితబంధు (Dalitabandhu) పథకం మొదలుపెట్టామని.. ఇది ఆషామాషీ పథకం కాదని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు. అయితే ఈ విషయంలో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు (Motkupalli narsimhulu) టీఆర్ఎస్‌లో చేరారు. రాబోయే కాలంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తామని స్పష్టం చేశారు. గొల్ల, కురుమలకు గొర్రెలు ఇచ్చినప్పుడు దళితులు అడ్డు చెప్పలేదని గుర్తు చేసిన సీఎం కేసీఆర్.. వారి కష్టాలు తీర్చేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఎవరూ అడ్డుపడొద్దని సూచించారు.

  రాబోయే ఏడేళ్లలో తెలంగాణలో ఖర్చు చేయబోయే మొత్తం రూ. 23 లక్షల కోట్లు అని చెప్పిన కేసీఆర్.. అందులో దళితుల కోసం లక్షా 70 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయలేమా ? అని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లోనూ విజయం తమదే అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అమలు చేస్తున్న దళితబంధు.. దేశంలోని దళితుందరికీ దారి చూపాలని సీఎం కేసీఆర్ అన్నారు.

  తెలంగాణలో అందరికంటే ఎక్కువగా దళితులే 17 శాతం ఉన్నారని.. కాని భూమి మాత్రం వారికే తక్కువగా ఉందని అన్నారు. దళితబంధు పథకం గురించి చర్చించేందుకు పలువురితో సమావేశం కావాలని అనుకున్నానని.. అందులో మొదటగా ఫోన్ చేసింది మోత్కుపల్లి నర్సింహులుకే అని కేసీఆర్ తెలిపారు. తనకు మోత్కుపల్లి నర్సింహులు సన్నిహితుడని.. కరెంటు మంత్రిగా పని చేసి మోత్కుపల్లి తెలంగాణ కరెంటు కష్టాలు చూశారని అన్నారు.

  Maa Elections 2021: మా ఎన్నికల ఎఫెక్ట్.. ఆ నినాదం ప్రభావం తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఉంటుందా ?

  YS Jagan: జగన్‌ను టెన్షన్ పెడుతున్న వైఎస్ఆర్ సన్నిహితుడు.. వైసీపీలో టెన్షన్

  దళితుల అభ్యున్నతి కోసం తాను చేస్తున్న పనికి తోడుగా నిలిచేందుకు మోత్కుపల్లి నర్సింహులు వచ్చారని సీఎం కేసీఆర్ అన్నారు. దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కూడా ఇది దోహదపడుతుందని తెలిపారు. దీనిపై గ్రామాల్లో దళితులతో పాటు ఇతర వర్గాలు కూడా చర్చించాలని సూచించారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Motkupalli Narasimhulu, Telangana, Trs

  ఉత్తమ కథలు