హోమ్ /వార్తలు /తెలంగాణ /

BRS: కేటీఆర్ కు కేసీఆర్ అప్పగించే బాధ్యతలు ఇవేనా? ఆ పరిణామాలు దేనికి సంకేతం?

BRS: కేటీఆర్ కు కేసీఆర్ అప్పగించే బాధ్యతలు ఇవేనా? ఆ పరిణామాలు దేనికి సంకేతం?

కేసీఆర్‌తో కేటీఆర్ (ఫైల్ ఫోటో)

కేసీఆర్‌తో కేటీఆర్ (ఫైల్ ఫోటో)

టీఆర్ఎస్‌ బీఆర్ఎస్‌గా మారినప్పటి నుండి మంత్రి కేటీఆర్ (Minister KTR) బాధ్యతల గురించి పెద్ద చర్చే నడుస్తుంది. ఆయనకు రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తారా? లేక జాతీయ స్థాయి బాధ్యతలు ఇస్తారా? అనే ప్రశ్న ప్రతీ ఒక్కరిలో రేకెత్తింది. అలాగే బీఆర్ఎస్ ఆవిర్భావం జరిగి చాలా అయినా కానీ కేటీఆర్  (Minister KTR) కు బాధ్యతలు అప్పగించకపోవడంపై అనేక ఊహాగానాలు వినిపించాయి. ఇక BRS కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొన్న సందర్భాలు లేవు. దీనితో కేటీఆర్ హోదాపై కేసీఆర్ ఎలాంటి ఆలోచనతో ఉన్నారు? ఆయనకు ఏ బాధ్యతలు,  ఎప్పుడు అప్పగిస్తారనే క్యూరియాసిటీ ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో అటు ప్రజల్లో నెలకొని ఉంది. ఇక తాజాగా జరిగిన పరిణామాలు చూస్తుంటే కేటీఆర్  (Minister KTR) బాధ్యతలపై కేసీఆర్ (Cm KCR) ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

KTR: రైతుబంధు పరిమితి..అసెంబ్లీలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..ఏమన్నారంటే?

మొన్న హుజురాబాద్ లో..

ఇటీవల మంత్రి కేటీఆర్ హుజురాబాద్ పర్యటనలో జరిగిన ఓ సంఘటన కేటీఆర్  (Minister KTR) బాధ్యతలపై కొంతమేర సంకేతాలు ఇచ్చినట్లు అర్ధమవుతుంది. జమ్మికుంటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హుజురాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిని మంత్రి కేటీఆర్ ప్రకటించడం గమనార్హం. ఎందుకంటే ఓ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిని సీఎం ఖరారు చేస్తారు. కానీ ఎన్నికల కంటే ముందే బహిరంగ సభలో ప్రజల సమక్షంలో హుజురాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డిని మంత్రి కేటీఆర్  (Minister KTR) ప్రకటించారు. అయితే ఈ అంశం కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది. దీనితో కేటీఆర్ కు రాష్ట్ర బాధ్యతలు అప్పగించనున్నారనే ప్రచారం జోరుగా జరుగుతుంది.

Big News: తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్సెస్ ఎంఐఎం ..అక్బరుద్దీన్ ఒవైసీకి కేటీఆర్ కౌంటర్

నేడు అసెంబ్లీలో..

ఇక నేడు తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఉంది. అయితే ఈ ధన్యవాద తీర్మానం సీఎం చెప్పాల్సి ఉంటుంది. కానీ దీనికి భిన్నంగా మంత్రి కేటీఆర్  (Minister KTR) గవర్నర్ కు ధన్యవాద తీర్మానం చెప్పారు. రాష్ట్ర చరిత్రలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సీఎం కాకుండా మంత్రి చెప్పడం ఇది మొదటిసారి. అసెంబ్లీలో కేసీఆర్ ఉన్నప్పటికీ కేటీఆర్ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చెప్పడం విశేషం.

ఇక ఈ రెండు పరిణామాలు చూస్తుంటే కేటీఆర్ (Minister KTR) కు బాధ్యతలు అప్పగించే అంశంపై సీఎం కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇటు పార్టీ కార్యక్రమాల్లో, అటు ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న మంత్రి కేటీఆర్  (Minister KTR) కు పూర్తిగా తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు అప్పగించే యోచనలో సీఎం ఉన్నట్లు చర్చ జరుగుతుంది. అయితే బీఆర్ఎస్ కార్యవర్గంపై కేసీఆర్ పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తేనే.. కేటీఆర్ బాధ్యతలపై మరింత స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తానికి బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్‌లో కేటీఆర్ కు అప్పగించే పదవి ఇదే కావొచ్చని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది.

First published:

Tags: BRS, CM KCR, KTR, Telangana, Telangana Politics

ఉత్తమ కథలు