తెలంగాణ రాజకీయాల్లో బలపడేందుకు కాంగ్రెస్ ఎంతగానో ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఆ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించారు. వరంగల్‌లో రాహుల్ గాంధీ కోసం భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసింది కాంగ్రెస్. రాహుల్ గాంధీ (Rahul Gandhi) వచ్చి వెళ్లడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో పార్టీపై చాలావరకు మళ్లీ నమ్మకం పెరిగిందని ఆ పార్టీ భావిస్తోంది. అయితే వరంగల్ సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చకు తెరలేపాయనే ఊహాగానాలు మొదలయ్యాయి. వరంగల్ సభలో టీఆర్ఎస్తో(TRS) కాంగ్రెస్ పార్టీకి పొత్తు ఉండదని పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చారు రాహుల్ గాంధీ. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ అంశంలో మరికొన్ని వ్యాఖ్యలు చేయడమే ఇప్పుడు కాంగ్రెస్‌లో కొత్త చర్చకు కారణమైనట్టు తెలుస్తోంది.
టీఆర్ఎస్తో పొత్తు గురించి మాట్లాడే వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని.. ఎవరైనా పార్టీ కోసం పని చేయకుంటే వాళ్లు బీజేపీ, టీఆర్ఎస్లోకి వెళ్లిపోవచ్చని రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలను ఎవరిని ఉద్దేశించి చేశారనే అంశం ఆసక్తికరంగా మారింది. పార్టీలోని కొందరు టీఆర్ఎస్కు అనుకూలంగా పని చేస్తున్నారని రాహుల్ గాంధీ దృష్టికి కొంతమంది నేతలు తీసుకెళ్లారని.. వారిని ఉద్దేశించే రాహుల్ గాంధీ ఈ రకమైన కామెంట్స్ చేశారనే ప్రచారం సాగుతోంది.
అయితే రాహుల్ గాంధీ ఎవరిని దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేశారనే దానిపై మరో చర్చ జరుగుతోంది. ఇటీవల కొంతమంది నేతలు కాంగ్రెస్‌తో(Congress) అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని.. వారిని ఉద్దేశించి ఆయన ఈ రకమైన కామెంట్స్ చేసి ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే పార్టీని వీడాలని అనుకునే నేతలను అలా చేయకుండా అడ్డుకోవాల్సిన ప్రస్తుత తరుణంలో.. ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే వాదన కూడా ఉంది.
CM KCR పుట్టుకతోనే భూస్వామి.. నిజాం నుంచి భారీ పరిహారం: KTR -అక్కడుండగా కేసీఆర్ ఫోన్‌కాల్..
Congress Vs BJP Vs TRS: కాంగ్రెస్, బీజేపీలకు టీఆర్ఎస్ బిగ్ కౌంటర్.. ప్లేస్ కూడా ఫిక్స్ ?
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందని.. ఇలాంటి సమయంలో ఇతర పార్టీల వైపు చూసే నేతలకు కాంగ్రెస్ పట్ల నమ్మకం కలిగించాల్సి ఉందని పలువురు సీనియర్లు చర్చించుకుంటున్నారట. అలా కాకుండా పోయేవాళ్లు వెళ్లిపోవచ్చు అంటూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం సరికాదనే ఊహాగానాలు కాంగ్రెస్‌లో వినిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rahul Gandhi, Telangana