టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. బీజేపీకి చెందిన రామచంద్ర భారతి అలియాస్ సతీష్ శర్మ (ఢిల్లీ), నందకుమార్ (హైదరాబాద్), సింహయాజి ఎమ్మెల్యేలకు మొయినాబాద్ ఫామ్ హాజ్ వేదికగా భారీ డీల్ ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు (Guvvala balaraju), హర్షవర్ధన్ రెడ్డి (Harshavardhan Reddy), రోహిత్ రెడ్డి (Rohit Reddy), రేగా కాంతారావు (Rega Kantharao) పార్టీ మారి బీజేపీలో చేరాలని వారు ప్రలోభాలకు గురి చేసినట్లు ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు.
ఇక ఈ ఘటనపై బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) టీఆర్.ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. మునుగోడు ప్రజల దృష్టి మళ్లించేందుకు టీఆర్ఎస్ పార్టీ పన్నిన కుట్ర అని కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆరోపించారు. డైరెక్టర్స్, ఆర్టిస్ట్స్ అంతా వాళ్లే. ఫామ్ హౌజ్ కు వెళ్లిన వాళ్లలో బీజేపీ వాళ్లు లేరు. వాళ్లకు వాళ్లే స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు. ఫామ్ హౌజ్ కుతంత్రాలు బయటకొస్తున్నాయి. ఒక ఉపఎన్నిక కోసం ఇంతటి చిల్లర వేషాలు వేస్తారా అని ప్రశ్నించారు. ప్రజలే కొత్త న్యాయకత్వం తెచ్చుకుంటారు. 100 కోట్లు పెట్టి కొనే స్థోమత లేదన్నారు. మీకు దమ్ముంటే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అలాగే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. ప్రధానిని తిడితే దేశ్ కి నేత అవుతామని భావిస్తున్నారు. ప్రధానిని తిట్టడానికి ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారని విమర్శలు చేశారు.
నందకుమార్ తో సంబంధాలు లేవు. ఎంపీ సంతోష్, మంత్రి హరీష్ రావు, దాసోజు శ్రావణ్ తో నందకుమార్ ఫోటోలు ఉన్నాయి. నందకుమార్ కు కల్వకుంట్ల కుటుంబానికి సంబంధాలు ఉన్నాయన్నారు. దానికి సంబంధించిన ఫోటోలను మీడియాకు కిషన్ రెడ్డి (Kishan Reddy) చూయించారు. బీజేపీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలి. ఎవరినైనా చేర్చుకోవాలనుకునే మధ్యవర్తులు ఎందుకు. ఎవరా స్వామీజీ. ఆయనతో మాకు మధ్యవర్తిత్వం ఏంటని ప్రశ్నించారు. చట్టం మీకేమైనా చుట్టమా. కుటుంబ పాలన పోవాలి..ప్రజా పాలన రావాలి. అప్పటివరకు విశ్రమించమని కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. పట్టుబడ్డ స్వామీజీకి ఎలాంటి శిక్షాలైన వేసుకోండి. ఇది పక్కా టీఆర్ఎస్ పన్నిన కుట్రే అని ఎత్తిపొడిశారు.
మునుగోడులో ఓటమి భయంతోనే కేసీఆర్ కొత్త డ్రామాలు తెరలేపారని అన్నారు. కానీ మునుగోడు ప్రజలు అధర్మం వైపు నిలబడరని అన్నారు. ఈ తతంగమంతా ప్రగతి భవన్ నుంచే జరిగింది. వందల కోట్లు ప్రగతి భవన్ కు పోయాయా? లేక ఫామ్ హౌజ్ కు పోయాయా అన్నారు. ఫామ్ హాజ్ లో పట్టుబడ్డ ఎమ్మెల్యేలను ఎందుకు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లలేదు. అక్కడ పట్టుబడ్డ డబ్బు ఎక్కడుంది అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Kishan Reddy, Trs