హోమ్ /వార్తలు /తెలంగాణ /

TRS POLITICS : మంత్రి తలసాని స్టేషన్‌ఘనపూర్‌ పర్యటనకు కడియం శ్రీహరి డుమ్మా కొట్టడానికి కారణమా అదేనా ..?

TRS POLITICS : మంత్రి తలసాని స్టేషన్‌ఘనపూర్‌ పర్యటనకు కడియం శ్రీహరి డుమ్మా కొట్టడానికి కారణమా అదేనా ..?

TALASANI vs KADIYAM

TALASANI vs KADIYAM

TRS POLITICS: నిన్నటి దాకా ఓ లెక్క ..ఇవాళ్టి నుంచి ఇంకో లెక్క. తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌లో నేతల మధ్య కోల్డ్‌ వార్‌ కాక రేపుతోంది. ప్రతిపక్ష పార్టీల నేతలకు ఎలా కౌంటర్ ఇవ్వాలా అనే ఆలోచిస్తున్న టీఆర్ఎస్‌ హైకమాండ్‌కి సొంత పార్టీలోని నేతల మధ్య అధిపత్య పోరు మరింత ఇబ్బందికరంగా మారుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Jangaon, India

నిన్నటి దాకా ఓ లెక్క ..ఇవాళ్టి నుంచి ఇంకో లెక్క. తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌లో నేతల మధ్య కోల్డ్‌ వార్‌ కాక రేపుతోంది. ప్రతిపక్ష పార్టీల నేతలకు ఎలా కౌంటర్ ఇవ్వాలా అనే ఆలోచిస్తున్న టీఆర్ఎస్‌ హైకమాండ్‌కి సొంత పార్టీలోని నేతల మధ్య అధిపత్య పోరు మరింత ఇబ్బందికరంగా మారుతోంది. జనగామ (jangaon)జిల్లాలోని స్టేషన్‌ ఘనపూర్‌(Station Ghanpur)నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి(Kadiam Srihari),తాటికొండ రాజయ్య(Tatikonda Rajaiah)వ్యవహారమే ఇందుకు ఉదాహరణగా నిలిచింది. మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌(Talasani Srinivasyadav)యాదవ్‌ పర్యటనలో వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలు స్పష్టంగా కనిపించాయి. మంత్రిగా, పార్టీలో కీలక నేతగా ఉన్న వ్యక్తి జిల్లా పర్యటనకు వస్తుంటే స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తలసాని వెంటే ఉన్నారు. కార్యక్రమంలో పాల్గొన్నారు. కాని ఎమ్మెల్సీగా ఉన్న కడియం శ్రీహరి మాత్రం తలసాని పర్యటనకు డుమ్మా కొట్టారు. మంత్రి అధికారిక కార్యక్రమానికి కడియం దూరంగా ఉండటంపై నియోజకవర్గ ప్రజలతో పాటు పార్టీలో కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

Telangana | NCRB : 2021లో చిన్నారులపై నేరాలకు పాల్పడిన కేసుల్లో తెలంగాణ టాప్ .. ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్‌లో ఏముందంటేమళ్లీ అలక బూనిన కడియం..

స్టేషన్‌ ఘనపూర్‌ నియోజకవర్గంలో కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మధ్య ఉన్న ఆధిపత్య పోరు మెల్లిగా పార్టీ హైకమాండ్‌ని టచ్‌ చేసింది. ఉచిత చేప పిల్లలను పంపిణి కార్యక్రమం కోసం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ సోమవారం స్టేషన్‌ఘనపూర్ వెళ్లారు. మంత్రి కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజయ్య పాల్గొన్నారు. పల్లెగుట్ట దగ్గరున్న రిజర్వాయర్‌లో మంత్రి, ఎమ్మెల్యే ఇద్దరూ కలిసి 3లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. ఈకార్యక్రమానికి కడియం శ్రీహరి గైర్హాజరయ్యారు. అయితే ఆయన ఉద్దేశపూర్వకంగానే దూరంగా ఉన్నారనే చర్చ జరుగుతోంది.

తలసాని టూర్‌కి దూరం..

గతంలో తలసాని, కడియం ఇద్దరూ టీడీపీలో పని చేశారు. మంత్రులుగా కొనసాగారు. కాకపోతే అప్పట్లో కడియం శ్రీహరి తలసాని కంటే సీనియర్‌ కావడం, చంద్రబాబు దగ్గర అధిక ప్రాధాన్యత ఉండేది. అందుకే తన కంటే జూనియర్‌ పర్యటనకు వెళ్తే స్తానికంగా ఎక్కడ తన విలువ తగ్గుతుందో అని భావించే కడియం తలసాని ప్రోగ్రామ్‌కి డుమ్మా కొట్టారని కొందరు అంటున్నారు. ఇద్దరూ గతంలో ఒకే పార్టీలో కొనసాగిన వాళ్లే కాబట్టి తనకున్న చనువుతో తలసాని కడియం శ్రీహరిని రాజయ్యతో సంధి ప్రయత్నం చేయిస్తారనే ఆలోచనతోనే ముందు జాగ్రత్తగా వెళ్లలేదని మరికొందరు చెవులు కొరుక్కుంటున్నారు.

హైకమాడ్‌ని టచ్ చేసిన కోల్డ్‌ వార్ ఇష్యూ..

కారణం ఏదైనా అయి ఉండవచ్చు కాని...కడియం శ్రీహరి మంత్రి తలసాని పర్యటనకు దూరంగా ఉన్నారనే విషయం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ దృష్టికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న తాడికొండ రాజయ్యపై తాను విమర్శించబోనంటూనే చిలిపి పనులు, తాగుడు వ్యవహారం అంతా నా దగ్గర సాక్ష్యాధారలతో సహా ఉన్నాయని కడియం శ్రీహరి ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ విమర్శించడంతో ఆయనపై గులాబీ బాస్‌ దగ్గర కాస్త నెగిటివ్ మార్క్ పడినట్లుగా కూడా తెలుస్తోంది.

బాస్‌ రియాక్షన్‌ ఎలా ఉండనుందో..

ఇలాంటి టైమ్‌లో మంత్రి తలసానిని సైతం లెక్క చేయకుండా ఉండటాన్ని గులాబీ బాస్ ఎలా రిసీవ్ చేసుకుంటారో ..నెక్స్ట్ ఎలక్షన్‌కి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో అనే డిస్కషన్‌ పొలిటికల్ సర్కిల్‌లో జోరుగా జరుగుతోంది. ఒక సీనియర్‌ నేతగా ఉన్న తనను ఏమాత్రం కన్సిడర్ చేయనప్పుడు తాను మాత్రం ఎందుకు అందరికి వివరణ ఇచ్చుకోవాలి...డైరెక్ట్‌గా టైమ్ వచ్చినప్పుడు కేసీఆర్‌తోనే తేల్చుకుందామనే ఆలోచనలో కడియం ఉన్నారని ఆయన వర్గం నుంచి వినిపిస్తోంది.

Published by:Siva Nanduri
First published:

Tags: Talasani Srinivas Yadav, Telangana Politics, TRS leaders

ఉత్తమ కథలు