(శ్రీనివాస్. పి. న్యూస్ 18, కరీంనగర్)
కరీంనగర్ (Karimnagar) జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం (Huzurabad constituency) అంటే తెలియనివారు ఉండరు. ఈటెల రాజేందర్ (Etala Rajender) ఈ నియోజకవర్గంలో 6 సార్లు టీఆర్ఎస్ నుంచి ఒకసారి బీజేపీ నుంచి గెలుపొందారు. టీఆర్ఎస్ నుంచి ఈటెల ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నపుడు వందల కోట్ల వ్యయంతో హుజురాబాద్ నియోజకవర్గంలో పలు రకాల అభివృద్ధి పనులు చేసి ఔరా అనిపించారు. అయితే గత సంవత్సరం లో అక్రమ భూములు కొన్నారని ఈటెలను టీఆర్ఎస్ నుంచి సాగనంపిన విషయం తెలిసిందే. తరువాత ఈటెల బీజేపీ (BJP) లో చేరడం టీఆర్ఎస్ అభ్యర్థి (TRS Candidate) పై గెలుపొందడం టకటక జరిగిపోయాయి. ఐతే ఎన్నికల సమయంలో హుజురాబాద్ నియోజకవర్గానికి సుమారు 500 కోట్ల ఖర్చు చేసి పలు అభివృద్ధి పనులకు (Developments Works) శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఎన్నికల తరువాత టీఆర్ఎస్ (TRS) ఓటమి చవిచూసింది. ఇదే ఇపుడు అక్కడి ఓటర్లకు (Voters) శాపమైంది. ఇక అప్పటి నుంచి నియోజక వర్గంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. తరువాత రాష్ట్ర ప్రభుత్వం హుజురాబాద్ పై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఉన్నవి కూడా తీసేస్తున్నారని..
ఉప ఎన్నికల్లో (By elections) వందల కోట్లు, మద్యం సీసాలు నమ్ముకున్నా కూడా హుజురాబాద్ లో తెరాస గెలవలేదని ప్రతిపక్ష నాయకులు (Oppositions leaders) అంటున్నారు. గెలవలేదని మనసులో పెట్టుకొని తరువాత రూపాయి పనికూడా చేయలేదని ఆరోపిస్తున్నారు. నియోజక వర్గం అభివృద్ధి కి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి మాట పక్కన పెడితే హుజురాబాద్ ప్రాంతానికి సంబంధించిన బస్ డిపో (Bus depot)ను కూడా వేరే ప్రాంతానికి తరలించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు మమ్మురం చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఎక్స్‌ప్రెస్ సర్వీసులను తరలించారని.. ఇదే పద్దతిలో మిగతా సర్వీసులు, పల్లె వెలుగులను కూడా నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని హుజురాబాద్‌లోని పలువురు నాయకులు ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్ (Hyderabad) లో భూములు అమ్మినట్టే.. ఉప ఎన్నికల తర్వాత హుజురాబాద్ డిపోకు సంబంధించిన ఆస్తులు అమ్మే ప్రయత్నం జరుగుతోందని దీనిని బీజేపీ, కాంగ్రెస్ వామపక్షాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి .టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఒకరకం గెలవకుంటే మరో రకంగా ప్రవర్తించడం పిరికిపంద చర్యగా ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. ఎన్నికల సమయంలో ఈటెల పై గెలవాలని టీఆర్ఎస్ ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యం, విందు వినోదాలతో ఆరు నెలల కళకళలాడిందని, ఈటెల గెలుపు తర్వాత హుజురాబాద్ వైపు లోకల్ నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ కన్నెత్తి చూసిన పాపాన పోలేదని హుజురాబాద్ నాయకులు అంటున్నారు. హుజురాబాద్ లో ఉన్న లోకల్ లీడర్లు వారికీ వారికే పడని పరిస్థితి ఉందంటే హుజురాబాద్ పరిస్థితి ఎలా ఉందొ మనకు కళ్ళకు కట్టినట్లు కనబడుతుందని వామపక్ష నాయకులు నొక్కి చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Eetala rajender, Etala rajendar, Huzurabad, Telangana Government, Trs