Home /News /telangana /

TS POLITICS DESCENDANTS OF LEADERS CONTESTING IN KARIMNAGAR DISTRICT IN 2023 ELECTIONS SNR KNR

Telangana Politics : నెక్స్ట్ ఎలక్షన్‌లో పోటీకి సై .. ఉద్యమాల జిల్లాలో ఊపందుకున్న వారసత్వ రాజకీయాలు

(Political heirs)

(Political heirs)

Telangana Politics: తెలంగాణా రాజకీయాల్లోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లతో పాటు రాబోయే ఎన్నికల్లోనూ వారసత్వ రాజకీయాలు మరింత పెరగనున్నాయనే చర్చ ఆసక్తిని రేపుతోంది.

  (P.Srinivas,New18,Karimnagar)
  తెలంగాణా(Telangana) రాష్ట్ర రాజకీయాల్లోనే ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ఉద్యమాలకు ఊపిరి పోసిన జిల్లాగా పేరొందిన నాటి నుంచి నేటి వరకు ఇక్కడ ఎంతో రాజకీయ చైతన్యం కనిపిస్తుంది. జిల్లాలో వారసత్వ రాజకీయాలు కొత్తేం కాదు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో మంథని (Manthani) ,సిరిసిల్ల(Sirisilla), హుస్నాబాద్ (Husnabad),నియోజకవర్గాల్లో వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లే ఉన్నారు. ప్రస్తుతం సంగతి పక్కన పెడితో రాబోయే ఎన్నికల్లోనూ వారసత్వ రాజకీయాలు మరింత పెరగనున్నాయి. తమ వారసుల్ని ఎన్నికల బరిలోకి దింపేందుకు చాలా మంది సీనియర్‌ నేతలు అందుకు అనుగూణంగా పావులు కదుపుతున్నారు. మరికొందరు తమ కుటుంబ సభ్యులను రంగంలోకి దింపేందుకు శక్తి మేరకు ప్రయత్నిస్తున్నారు. ఇంకొందరు తమ రాజకీయ వారసత్వాన్ని మూడోతరానికి అందించే ప్రయత్నాల్లో తలమునకలయ్యాయి.

  HYD | Crime news : పోకిరీ సినిమా స్టైల్లో ఫైరింగ్ .. మిడ్‌నైట్ సెటిల్‌మెంట్‌ పేరుతో రియల్టర్‌కి స్పాట్‌ పెట్టారు  కుటుంబ రాజకీయాలు..
  రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలన్నీ తమ కుటుంబ సభ్యులను , మనవళ్లను రాజకీయల్లోకి తీసుకొస్తుండటం ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇందులో భాగంగానే మాజీ మంత్రి , బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గజ్వెల్ నుండి పోటీ చేస్తే తనకు రాజకీయ భవిష్యత్తుకు పునాదులు వేసిన..హుజూరాబాద్ నుండి తన సతీమణి జమునారెడ్డి బరిలోకి దింపాలనే ఆలోచనలో ఉన్నారు. హుజురాబాద్ నుంచి 7సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఈటల. ప్రతిసారి డమ్మీ అభ్యర్థిగా జమునారెడ్డి నామినేషన్ వేస్తూ వచ్చారు. ఈ అనుభవంతో పాటు నియోజకవర్గపు వ్యవహారాలన్నీ తెలిసి ఉండటం ఆమెకు ప్లస్ అయ్యే ఛాన్సుందంటున్నారు.  ఎవరూ తగ్గట్లేదు..
  ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న గంగుల కమలాకర్ సైతం తన రాజకీయ వారసుడిగా కొడుకు గంగుల హరిహరణ్‌ను పరిచయం చేయబోతున్నారనే టాక్ ఉంది. ఆ దిశగానే జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక తెలంగాణ సమరయోధుడు , మాజీ ఎంపీ జువ్వాడి చొక్కారావు మనువడు నిఖిల్ చక్రవర్తి కూడా ఈసారి కరీంనగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్‌పై కన్నేశారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నిఖిల్ చక్రవర్తి తాత వారసత్వం తనకు అన్నీ విధాలుగా కలిసొస్తుందని భావిస్తున్నారు.

  Telangana : అమ్మ మందలించినందుకే మరణశిక్ష .. ఏమి కొడుకు సామి  ఎవరి లెక్కలు వారివి..
  మూడుసార్లు ఎంపీగా .. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ చైర్మన్‌గా .. రాష్ట్ర మంత్రిగా .. పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి .. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగి .. కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం పని చేసిన దివంగత నేత ఎం, సత్యనారాయణరావు ఎమ్మె స్సార్  మనవడు మెన్నేని రోహిత్‌రావు సైతం నెక్స్ట్ ఎలక్షన్‌లో కరీంనగర్ అసెంబ్లీ నుంచి కాంగ్రస్‌ అభ్యర్దిగా బరిలోకి దిగాలని ఆసక్తి చూపిస్తున్నారు.అందుకే నియోజకవర్గ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తాత రాజకీయ పలుకుబడి ఆయన చేసిన సేవలు తనకు కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారట.

  వారసత్వ రాజకీయాలు..
  ఇందుర్తి నియోజకవర్గం నుంచి 1999లో ఎమ్మెల్యేగా గెలిచిన బొమ్మ వెంకన్న తనయుడు.. బొమ్మ శ్రీరాం చక్రవర్తి ఈసారి హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి హస్తం గుర్తు పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి తన హస్తవాసి పరీక్షించుకోవాలనే తపనలో ఉన్నారు. హుస్నాబాద్ కాంగ్రెస్ ఇన్‌చార్జీగా ఉన్న శ్రీరాం ప్రస్తుతం నియోజకవర్గ ఓటర్లకు బాగా టచ్‌లో ఉంటున్నారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అనారోగ్య పరిస్థితుల దృష్ట్య తన కుమారుడు సంజయ్‌ని నెక్స్ట్ ఎలక్షన్‌లో పోటీకి దింపుతారనే ప్రచారం ఉంది. తండ్రి అనుభవం, కేటీఆర్‌తో కలిసి చదువుకోవడం వంటి అంశాలు ప్లస్ అయ్యే ఛాన్సుంది. డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవంలో కూడా కేటీఆర్ సంజయ్ పేరును పదే పదే ప్రస్తావించడం చూసిన జనం ఈసారి సంజయ్‌కి టికెట్ కన్ఫామ్ అంటున్నారు.

  బరిలో వారసులు..
  బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు కుమారుడు వికాస్ కొద్ది రోజులుగా వేములవాడ నియోజకవర్గంలో వైద్యశిబిరాలు నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేస్తున్నారు. వికాస్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అంతా బీజేపీ కావడంతో వేములవాడ బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసే ఛాన్సుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అదే జరిగితే ఇక్కడ పోటీ బాబాయ్ -అబ్బాయ్‌ల మధ్య రసవత్తరంగా మారనుంది. 2023 సాధారణ ఎన్నికల్లో వారసత్వ రాజకీయాలు రక్తికట్టించనున్నట్లుగా ఉంది.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Karimangar, Telangana Politics

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు