హోమ్ /వార్తలు /తెలంగాణ /

YS Sharmila : YS షర్మిలపై మరో పోలీస్ కంప్లైంట్ .. SC,ST చట్టం కింద కేసు నమోదు చేయాలంటున్న దళిత సంఘాలు

YS Sharmila : YS షర్మిలపై మరో పోలీస్ కంప్లైంట్ .. SC,ST చట్టం కింద కేసు నమోదు చేయాలంటున్న దళిత సంఘాలు

వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)

వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)

YS Sharmila: YSRTP అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత నాయకుడు డిమాండ్ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పాదయాత్రలో ఆందోల్ ఎమ్మెల్యేని కించపరిచే విధంగా విమర్శించినందుకు కేసు నమోదు చేయాలని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీ(YSRTP) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల(YS Sharmila)పై ఎస్సీ, ఎస్టీ(SC,ST) అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత నాయకుడు డిమాండ్ చేస్తున్నారు. సంగారెడ్డి (Sangareddy)జిల్లాలో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న సమయంలో షర్మిల ఆంధోల్‌ నియోజకవర్గం జోగిపేటలో స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌(Kranthi Kiran)ను అవమానపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు షర్మిలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దళిత సంఘాలు మరియు టిఆర్ఎస్ నాయకులు. గౌరవపదమైన హోదాలో ఉన్న దళిత జాతి బిడ్డను పేరు పెట్టి కాకుండా అవమానకరంగా మాట్లాడినందుకు వైఎస్‌ షర్మిలపై SC, ST చట్టం కింద కేసు నమోదుచేయాలని దళిత నాయకులు పోలీసులను కోరారు.

Politics: కాంగ్రెస్ నాయకులకు ఈడీ నోటీసులు..టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే..

షర్మిల వ్యాఖ్యలపై దళిత నేతలు ఆగ్రహం ..

జోగిపేట బస్టాండ్ దగ్గర జరిగిన బహిరంగ సభలో వైఎస్‌ షర్మిల ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కాదు..కంత్రి కిరణ్ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఎక్కడ చూసినా కబ్జాలే..ఎక్కడ ప్రభుత్వ స్థలం కనిపిస్తే జెండా పాతడమే ఆయన వృత్తి అంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఒక దళితుడు అయి ఉండి చెరువులు,అసైన్డ్ భూములు అన్ని కబ్జాలే చేస్తున్నారని స్వయంగా ఆయన తండ్రే చెప్పారంటూ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. పండిత పుత్ర పరమ శుంఠ... నా కోడుకులు అంతా శుంఠలు అని స్వయంగా క్రాంతి కిరణ్‌ తండ్రే చెప్పారంటూ షర్మిల నిరాధారమైన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకండా దళిత బిడ్డ అయి ఉండి ఏనాడైనా దళితుల హక్కుల కోసం పోరాడారా అంటూ ప్రశ్నించారు షర్మిల. ఒక జర్నలిస్ట్ అయి ఉండి ఏనాడు జర్నలిస్టుల కోసం కొట్లాడలేదని విమర్శించారు. నాడు షర్మిల చేసిన విమర్శలు, ఆరోపణలపైనే టీఆర్ఎస్‌ నాయకులు, దళిత సంఘాల నాయకులు ఆమెపై ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

వరుస ఫిర్యాదులు ..

ఇప్పటికే వైఎస్‌ షర్మిలపై మంత్రి నిరంజన్‌రెడ్డి సైతం ఫిర్యాదు చేశారు. ఆయన కంప్లైంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్‌ నమోదు చేశారని షర్మిల చెప్పారు. టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు సైతం షర్మిల వనపర్తి జిల్లాలో పాదయాత్ర చేసిన సమయంలో అనుచిత వ్యాఖ్యలు, విమర్శలు చేశారంటూ స్పీకర్‌కి ఫిర్యాదు చేశారు. ఇవన్ని జరిగిన తర్వాత కూడా ఆమె తాను ఇలాంటి కేసులకు, ఫిర్యాదులకు భయపడనని సంకెళ్లు చూపిస్తూ ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చెప్పారు. ఇప్పుడు దళిత ఎమ్మెల్యేపై చేసిన కామెంట్స్‌కి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో ...దానికి వైఎస్ షర్మిల ఎలా కౌంటర్ ఇస్తారో చూడాలి.

Published by:Siva Nanduri
First published:

Tags: Telangana News, YS Sharmila

ఉత్తమ కథలు