హోమ్ /వార్తలు /తెలంగాణ /

Munugodu: మునుగోడుపై రేపే కీలక నిర్ణయం.. ఆ రెండు పార్టీల్లో టెన్షన్

Munugodu: మునుగోడుపై రేపే కీలక నిర్ణయం.. ఆ రెండు పార్టీల్లో టెన్షన్

రేవంత్ రెడ్డి, సీఎం కేసీఆర్ ( ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి, సీఎం కేసీఆర్ ( ఫైల్ ఫోటో)

Munugodu| CPI: మునుగోడు ఉప ఎన్నికల్లో కీలకంగా మారనున్న సీపీఐ పార్టీ మద్దతు ఎవరికి ఇస్తుందా ? ఆ పార్టీ మద్దతు తీసుకునే పార్టీలు ప్రతిఫలంగా కమ్యూనిస్టులకు ఎలాంటి హామీలు ఇస్తాయని ప్రస్తుతానికి సస్పెన్సే.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణలో జరగబోయే మునుగోడు(Munugodu) ఉప ఎన్నికపై అందరి దృష్టి నెలకొంది. ఇక్కడ గెలిచేందుకు అధికార, విపక్షాలు అప్పుడే వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ గెలుపు కోసం ప్రధానంగా పోటీ పడుతున్న టీఆర్ఎస్, బీజేపీలు.. భారీ సభల కోసం ప్లాన్ చేశారు. 20న మునుగోడులో కేసీఆర్ సభ ఉండగా.. 21న అమిత్ షా(Amit Shah) మునుగోడుకు రాబోతున్నారు. అదే రోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ చేరబోతున్నారు. ఇక మునుగోడులో గెలిచేందుకు సీపీఐ(CPI) మద్దతు కీలకమని భావిస్తున్నాయి టీఆర్ఎస్, కాంగ్రెస్. ఈ రెండు పార్టీలు ఎర్ర పార్టీల మద్దతు కోసం తెర వెనుక మంత్రాంగం నడిపిస్తున్నాయి. అయితే ఈ రెండు పార్టీల్లో కమ్యూనిస్టుల మద్దతు ఎవరికి ఉంటుందనే అంశం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ పోటీ చేయడమా ? లేక కాంగ్రెస్, టీఆర్ఎస్‌లో(TRS) ఎవరో ఒకరికి మద్దతు ఇవ్వడమా ? అనేది రేపు ప్రకటిస్తామని సీపీఐ ముఖ్యనేతల్లో ఒకరైన నారాయణ తెలిపారు.

మునుగోడు తమకు 20వేలకు పైగా ఓటు బ్యాంకు ఉందని నారాయణ తెలిపారు. తమ ముందు ప్రస్తుతం మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని తెలిపారు. తాము సొంతంగా పోటీ చేయడం, కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడం, టీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వడం వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ మూడు ప్రత్యామ్నాయాల్లో ఏదో ఒక దానిపై రేపు కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే పార్టీకే తమ మద్దతు అని ప్రకటించిన సీపీఐ .. కాంగ్రెస్ , టీఆర్ఎస్‌లో ఎవరికి మద్దతు ఇస్తుందనే దానిపై మాత్రం ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతోందని సమాచారం.

మరోవైపు కమ్యూనిస్టల మద్దతు తమకే ఉంటుందని అధికార టీఆర్ఎస్ బలంగా నమ్ముతోంది. ఇదే విషయాన్ని జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి పలుసార్లు చెప్పుకొచ్చారు. తమతో కమ్యూనిస్టులు కలిసొస్తారనే నమ్మకం ఉందని వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం కమ్యూనిస్టుల మద్దతు కోసం తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తోందనే చర్చ జరుగుతోంది. మునుగోడు ఉప ఎన్ని కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎంతో కీలకంగా మారింది.

Power Cuts: తెలుగు రాష్ట్రాలకు కరెంటు కష్టాలు తప్పవా..? కేంద్రం ఆంక్షలతో విద్యుత్ ఛార్జీల బాదుడు భయం?

Congress | TRS: తెరాస కోటపై కాంగ్రెస్‌ పోరు షురూ.. ఆ పర్యటనలకు కారణమదేనా?

ఇక్కడ టీఆర్ఎస్, బీజేపీలకు గట్టి పోటీ ఇస్తేనే భవిష్యత్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారని.. లేకపోతే తమ పార్టీ గ్రాఫ్ మరింతగా పడిపోతుందనే టెన్షన్ ఆ పార్టీ వర్గాల్లో ఉంది. అందుకే మునుగోడులో చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉన్న సీపీఐ మద్దతు తీసుకోవాలని ఆ పార్టీ యోచిస్తోంది. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నికల్లో కీలకంగా మారనున్న సీపీఐ పార్టీ మద్దతు ఎవరికి ఇస్తుందా ? ఆ పార్టీ మద్దతు తీసుకునే పార్టీలు ప్రతిఫలంగా కమ్యూనిస్టులకు ఎలాంటి హామీలు ఇస్తాయని ప్రస్తుతానికి సస్పెన్సే.

First published:

Tags: CPI Narayana, Munugodu By Election, Telangana

ఉత్తమ కథలు