Home /News /telangana /

TS POLITICS CPI MAY CONTEST IN MUNUGODU BY ELECTIONS A BIG POLITICAL THREAT FOR CONGRESS AND TRS OF TELANGANA AK

Congress| TRS: కాంగ్రెస్, టీఆర్ఎస్‌లకు సరికొత్త టెన్షన్.. మునుగోడు బరిలో ఆ పార్టీ ?

రేవంత్ రెడ్డి, సీఎం కేసీఆర్ ( ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి, సీఎం కేసీఆర్ ( ఫైల్ ఫోటో)

Telangana: ఒకవేళ నిజంగా మునుగోడు ఎన్నికల్లో సీపీఐ పోటీకి దూరంగా ఉంటే.. ఆ పార్టీ ఎవరికి అధికారికంగా మద్దతు ఇస్తుందనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక రాబోతోంది. ఈ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఈ సీటును గెలచుకుని తెలంగాణ రాజకీయాల్లో తమ ఆధిపత్యం రాబోతోందని చెప్పేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటే.. తెలంగాణలో(Telangana) ఇప్పటికీ తమదే పైచేయి అని నిరూపించేందుకు అధికార టీఆర్ఎస్ యత్నిస్తోంది. అదే సమయంలో తెలంగాణలో మళ్లీ పుంజుకునేందుకు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఇందుకోసం మునుగోడు (Munugodu) ఉప ఎన్నికలను ఉపయోగించుకోవాలని.. ఇక్కడ తమ సర్వశక్తులు ఒడ్డాలని చూస్తోంది. తెలంగాణలోని అతి కొద్ది నియోజకవర్గాల్లో ఒకప్పుడు బలంగా ఉన్న సీపీఐ(CPI)  పార్టీకి.. ఒకప్పుడు మునుగోడు నియోజకవర్గం కంచుకోట. ఇక్కడ ఆ పార్టీ 6 సార్లు గెలిచింది.

    దీన్ని బట్టి మునుగోడులో ఆ పార్టీకి బలం ఉందని అర్థమవుతోంది. ప్రస్తుతం తరుణంలో ఆ పార్టీకి బలం, ప్రజాదరణ తగ్గినా.. బలమైన మునుగోడులో ఆ పార్టీకి ఎంతో కొంత ఓటు బ్యాంక్ ఉంటుందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అందుకే ఇక్కడ పోటీ చేసే అంశంపై సీపీఐ ఆలోచన చేస్తోంది. మూడు బలమైన పార్టీలను ఎదుర్కొని సీపీఐ తమ సత్తా చాటడం అంత సులువు కాదు. అయితే ఇక్కడ బరిలో నిలిచి తమ ఉనికి చాటుకోవాలని సీపీఐ భావిస్తోంది. మరోవైపు సీపీఐ బరిలో ఉండటం వల్ల టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పకపోవచ్చనే చర్చ జరుగుతోంది. సీపీఐ పార్టీ ఓట్లు తమకు వచ్చేలా చూడాలని కాంగ్రెస్, టీఆర్ఎస్ భావిస్తోంది.



    ఇందుకోసం ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వంతో చర్చించాలని ఈ రెండు పార్టీలు యోచిస్తున్నాయి. ఈ క్రమంలోనే ముందుగానే ఈ పార్టీ ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతుండటం ఈ రెండు పార్టీలకు మింగుడు పడని అంశమనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. అయితే మునుగోడులో పోటీ చేసే విషయమై సీపీఐ ఇప్పటికీ ఓ నిర్ణయానికి రాలేదని.. పోటీ గురించి కేవలం ఆలోచన మాత్రమే చేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అధికార టీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీ కోరితే.. వారిలో ఎవరో ఒకరికి మద్దతు ఇచ్చి పోటీ నుంచి వైదొలిగే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.

    Munugodu| Congress: మునుగోడుపై కాంగ్రెస్‌లో కొత్త డిమాండ్.. వారికే టికెట్ ఇవ్వాలంటూ..

    Telangana Cabinet: తెలంగాణలో కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. వారందరికి శుభవార్త..!

    ఒకవేళ నిజంగా మునుగోడు ఎన్నికల్లో సీపీఐ పోటీకి దూరంగా ఉంటే.. ఆ పార్టీ ఎవరికి అధికారికంగా మద్దతు ఇస్తుందనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండూ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీలు కావడంతో.. ఈ రెండు పార్టీల్లో సీపీఐ మద్దతు ఎవరికి ఉంటుందనేది ప్రస్తుతానికి సస్పెన్సే. ఏదేమైనా.. మునుగోడులో కచ్చితంగా పోటీ చేయాలని సీపీఐ నిర్ణయించుకుంటే.. అది టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు కొత్త తలనొప్పులు తీసుకురావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CPI, Munugodu By Election, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు