హోమ్ /వార్తలు /తెలంగాణ /

Munugodu: నేటి నుంచి మునుగోడు ప్రచారంలోకి కాంగ్రెస్​.. ఆ పార్టీ నినాదం ఇదే..

Munugodu: నేటి నుంచి మునుగోడు ప్రచారంలోకి కాంగ్రెస్​.. ఆ పార్టీ నినాదం ఇదే..

రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి (ఫైల్ ఫోటో)

రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి (ఫైల్ ఫోటో)

మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మరో అడుగు ముందుకేసింది. నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించనుంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి రాజీనామాతో మునుగోడులో.. ఉపఎన్నిక అనివార్యమైంది. అందులోనూ.. రాజగోపాల్​రెడ్డి  (Rajagopal reddy)కాంగ్రెస్​ను వీడి భాజపాలో చేరటంతో.. రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్​కు అడ్డాగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో.. కలవరం మొదలైంది. ఈ ఉపఎన్నికలో ఎలాగైనా సత్తా చాటాలని.. భాజపా, తెరాస పార్టీలు ఇప్పటికే పావులు కదుపుతున్నాయి. జెండా మారినా.. బ్రాండ్​ వ్యాల్యూతో భాజపా నుంచి అభ్యర్థిగా రాజగోపాల్​రెడ్డి మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. అయితే కాంగ్రెస్​ మాత్రం మునుగోడులో మళ్లీ పాగా వేయాలని ప్రణాళికలు రచిస్తోంది.మునుగోడు (Munugodu) అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మరో అడుగు ముందుకేసింది. నేటి నుంచి కాంగ్రెస్ (Congress) పార్టీ ఈ నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించనుంది. సెప్టెంబర్ 3వ తేదీన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief revanth reddy), కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు మునుగోడుకు వెళ్లనున్నారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో గడప గడపలో కాంగ్రెస్ పార్టీ విధానాలపై ప్రచారం చేయనున్నారు. మునుగోడులో పోటీకి ఆసక్తి చూపుతున్న అభ్యర్ధుల జాబితాను టీపీసీసీ (TPCC) నాయకత్వం ఏఐసీసీకి పంపింది. త్వరలోనే మునుగోడు అభ్యర్ధిని కాంగ్రెస్ నాయకత్వం ప్రకటించే అవకాశం ఉంది. అభ్యర్ధిని ప్రకటించే లోపుగానే నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. రేపటి నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వహించనుంది. ఇప్పటికే ఆయా మండలాలకు ఇన్​ఛార్జీలుగా నియమించిన నేతలు కూడా నియోజకవర్గాల్లోని మండలాల్లో మకాం వేయనున్నారు.


  మన మునుగోడు - మన కాంగ్రెస్‌ (Mana Munugodu - Mana Congress) అనే నినాదంతో కాంగ్రెస్​ ప్రచారంలోకి వెళ్లబోతోంది. ఈ నినాదాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలని రేవంత్​ కాంగ్రెస్​ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక నాయకులను కలుపుకొని జనంలోకి వెళ్లాలని.. బీజేపీ (BJP), టీఆర్​ఎస్​ వైఖరిని ఎండగట్టాలని స్పష్టం చేశారు. ప్రధానంగా రాజగోపాల్‌ రెడ్డి స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీని వీడారని, ఆర్థిక ఒప్పందంలో భాగంగానే భాజపాలో చేరారని జనంలోకి తీసుకెళ్లాలని పీసీసీ తెలిపింది. మండలాలు, పంచాయతీల వారీగా భాజపా, తెరాసలో (TRS) చేరిన నేతలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించడం ద్వారా ఆయా పార్టీలపై వ్యతిరేకత పెంచాలని నిర్ణయించింది.
  అయితే మునుగోడులో కాంగ్రెస్ బలంగానే ఉంటుంది. మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ లేదా సీపీఐ (CPI) అభ్యర్ధులు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ (TRS) కు మద్దతివ్వాలని సీపీఐ నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గంలోని ఏడు మండలాలకు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు చొప్పు న ఇంచార్జులను నియమించింది. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంట వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది.మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ (TRS) ప్రచార బాధ్యతను మంత్రి జగదీష్ రెడ్డి తన భుజాలపై వేసుకున్నారు. మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ పై కేంద్రీకరించారు మంత్రి జగదీష్ రెడ్డి .

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Munugodu By Election, TS Congress

  ఉత్తమ కథలు