AICC ఇటీవల ప్రకటించిన కొత్త కమిటీలు కాంగ్రెస్ (Congress) లో కల్లోలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే తమకు అన్యాయం జరిగిందంటూ అసంతృప్తి రాగం వెళ్లదీశారు. ఇక తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు (Congress Senior Leaders) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో TPCC చీఫ్ రేవంత్ రెడ్డి (Revant Reddy)కి కాంగ్రెస్ సీనియర్ నాయకులు బిగ్ షాకిచ్చారు.
నేడు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) నివాసంలో భేటీ అయిన నాయకులు రేవంత్ రెడ్డి (Revant Reddy)పై తిరుగుబాటును ప్రారంభించారు. పార్టీలో వలస వచ్చిన వాళ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్లపై కోవర్టులనే ముద్ర వేస్తున్నారు. అసలైన ఒరిజినల్ కాంగ్రెస్ తమదే. వలస వచ్చిన నాయకులతో పోరాటం చేస్తామని పరోక్షంగా రేవంత్ రెడ్డి (Revant Reddy)పై విమర్శలు గుప్పించారు. భట్టి విక్రమార్క నివాసంలో భేటీ అయిన నాయకులలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ప్రేమ్ సాగర్ రావు, జగ్గారెడ్డి, మధుయాష్కీ, కోదండరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, కోదండరెడ్డి ఉన్నారు.
సేవ్ కాంగ్రెస్ అంటున్న సీనియర్లు..
భట్టి నివాసంలో భేటీ అయిన సీనియర్ నాయకులు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పరోక్షంగా విమర్శలు కురిపించారు. కొత్త కమిటీలలో 108 మంది ఉంటే అందులో 50 మంది వలస వచ్చిన వారే అని మండిపడ్డారు. టీడీపీ నుంచి వలస వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మమ్మల్ని కోవర్టులుగా ముద్ర వేస్తున్నారు. అందుకే ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు, వలస వచ్చిన వారికి మధ్య పోరాటం జరుగుతుంది. వలస వచ్చిన వారి నుండి కాంగ్రెస్ ను సేవ్ చేయాలనే మేము చూస్తున్నాం. కాంగ్రెస్ ను హస్తగతం చేసుకోవాలనే కుట్ర జరుగుతుంది. క్యారెక్టర్ లేని వాళ్ళు పార్టీని నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము నాలుగు పార్టీలు మారి రాలేదు. అసలు కాంగ్రెస్ నాయకులం మేమే. ఇందుకోసం ఢిల్లీ వెళ్లి హైకమాండ్ తో తేల్చుకుంటామని సీనియర్లు తెలిపారు. వలస వాదులతో కాంగ్రెస్ కు నష్టం జరుగుతుంది. గెలిచే చోట డీసీసీ నియామకాలు ఆపారు. ఉపాధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ పదవులు వలస వాళ్లకే కేటాయించారు.
భట్టికి కోమటిరెడ్డి ఫోన్..
కొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భట్టి విక్రమార్కకు ఫోన్ చేశారు. తన మద్దతు మీకే ఉంటుందని కోమటిరెడ్డి భట్టికి తెలిపినట్లు తెలుస్తుంది. కాగా సినియర్లంతా పార్టీ నాయకత్వ మార్పును కోరుకుంటున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhatti Vikramarka, Congress, Jagga Reddy, Revanth Reddy, Telangana, TS Congress, Uttam Kumar Reddy