హోమ్ /వార్తలు /తెలంగాణ /

Revanth Reddy: మరోసారి రేవంత్ రెడ్డి దూకుడుకు బ్రేకులు పడ్డాయా ? వెనక్కి తగ్గారా ?

Revanth Reddy: మరోసారి రేవంత్ రెడ్డి దూకుడుకు బ్రేకులు పడ్డాయా ? వెనక్కి తగ్గారా ?

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Telangana News: సెప్టెంబర్ 17 వేడుకలను కాంగ్రెస్ కూడా ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన టీపీసీసీ చీఫ్.. ఈసారి తాము సరికొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు తెలంగాణకు ప్రత్యేక జెండాను తయారు చేసి ఎగురవేస్తామని ప్రకటించారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ కాంగ్రెస్‌లో మొదటి నుంచి తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు రేవంత్ రెడ్డి. ఆయన అనేక విషయాల్లో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అనేక మంది సీనియర్ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన దాఖలాలు అనేకం. ఈ విషయంలో ఆయన తీరుపై పలువురు నేతలు తమ పార్టీ అధినాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీంతో నిర్ణయాలు తీసుకునే ముందు పార్టీలోని నేతలతో చర్చించాలని కాంగ్రెస్(Congress) హైకమాండ్ రేవంత్ రెడ్డికి(Revanth Reddy) సూచించినట్టు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంలో రేవంత్ రెడ్డి మాత్రం ఎప్పటికప్పుడు తనదైన శైలిలోనే ముందుకు సాగుతున్నారు. తాజాగా సెప్టెంబర్ 17 వేడుకలను కాంగ్రెస్ కూడా ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన టీపీసీసీ చీఫ్.. ఈసారి తాము సరికొత్తగా తెలంగాణ తల్లి (Telangana  Talli) విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు తెలంగాణకు ప్రత్యేక జెండాను తయారు చేసి ఎగురవేస్తామని ప్రకటించారు.

  అందెశ్రీ రాసిన జయజయహే తెలంగాణ పాటు రాష్ట్రగీతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అయితే కొత్త తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు తెలంగాణకు ప్రత్యేక జెండాను ఆవిష్కరిస్తామన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిర్ణయంపై కాంగ్రెస్‌లోని కొందరు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ రకమైన నిర్ణయాల వల్ల లేనిపోని తలనొప్పులు వస్తాయని.. అయినా ఇలాంటివి కాంగ్రెస్ విధానం కాదని వాళ్లు రేవంత్ రెడ్డికి సూచించినట్టు సమాచారం.

  అయితే ఆ నేతల సూచనలను రేవంత్ రెడ్డి పెద్దగా పట్టించుకోకపోవడంతో.. వారంతా రేవంత్ రెడ్డికి నచ్చజెప్పగలిగే స్థాయిలో ఉన్న ఓ సీనియర్ నేతను సంప్రదించి ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. ఆయన రంగంలోకి దిగి రేవంత్ రెడ్డికి ఈ అంశంపై పలు సూచనలు చేశారని.. సరికొత్తగా తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణకు ప్రత్యేక జెండా అనే అంశాన్ని పక్కనపెట్టాలని కోరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అనేక మంది నేతలు ఈ విషయంలో వ్యతిరేకంగా ఉండటంతో.. రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంలో కాస్త మెత్తబడ్డారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది.

  KCR National party: జాతీయ రాజకీయాల దిశలో KCR​ మరో ముందడుగు.. ఆ రాష్ట్ర​ మాజీ సీఎంతో కీలక భేటి

  KTR TWEET : స్టేడియం, కాలేజీ పేర్లు మార్చినట్లుగానే కరెన్సీపై గాంధీ బొమ్మకి బదులు మోదీ ఫోటో మార్చుతారేమో: కేటీఆర్‌ ట్వీట్‌

  టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి రేపు కేవలం గాంధీభవన్‌లో జెండాను మాత్రమే ఆవిష్కరిస్తారని.. తెలంగాణ తల్లి, తెలంగాణకు ప్రత్యేక జెండా ఆవిష్కరణ ఉండదని కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు ఇప్పటికప్పుడు ఈ అంశంపై రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గినా.. రాబోయే రోజుల్లో ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలనే భావనలో ఆయనలో ఉన్నదని పలువురు చర్చించుకుంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్‌లోని సీనియర్లు మరోసారి రేవంత్ రెడ్డి దూకుడుకు బ్రేకులు వేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Revanth Reddy, Telangana

  ఉత్తమ కథలు