Home /News /telangana /

TS POLITICS CONGRESS SENIOR LEADER MARRI SHASIDHAR REDDY MADE SENSATIONAL COMMENTS ON MANIKAM TAGORE PRV

Congress: కాంగ్రెస్​లో మరో కల్లోలం.. ఠాగూర్​పై మర్రి శశిధర్​ రెడ్డి సంచలన ఆరోపణలు

మర్రి శశిధర్​ రెడ్డి (Photo: Twitter/ANI)

మర్రి శశిధర్​ రెడ్డి (Photo: Twitter/ANI)

కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి ఏజెంట్‌గా మారారని ఆరోపించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    కాంగ్రెస్​లో (Congress) కల్లోలం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆ పార్టీ సీనియర్​ నేత మర్రి శశిధర్ రెడ్డి  (Congress Senior leader Marri Shasidhar Reddy )సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ (manikam tagore) టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth reddy) ఏజెంట్‌గా మారారని ఆరోపించారు. రేవంత్ సీనియర్లను గోడకేసి కొడతా అని కామెంట్ చేసినప్పటికీ అధిష్టానం మందలించలేదని అన్నారు. కోమటిరెడ్డి సోదరుల విషయంలో రేవంత్ రెడ్డి తీరు సరికాదని కామెంట్ చేశారు. పార్టీ నడిపిస్తున్నవారే కాంగ్రెస్‌లో కల్లోలానికి కారణమని అన్నారు. అయితే ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడి వెళ్లడం, పార్టీలో అంతర్గత విభేదాలతో సతమతవుతున్న టీ కాంగ్రెస్‌లో.. మర్రి శశిధర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు మరింత రచ్చకు దారితీసే అవకాశం ఉంది.

    మరోవైపు కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వంపై ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సైతం అసంతృప్తి వ్యక్తంచేశారు. ఏఐసీసీ కార్యక్రమాల సమాచారం తనకు ఇవ్వడం లేదని విమర్శించారు. అయితే తాను కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తగానే కొనసాగుతానని స్పష్టం చేశారు.

    తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి.. హస్తానికి హ్యాండ్‌ ఇ‍వ్వడంతో కాంగ్రెస్‌ పార్టీ అంతర్గతంగా ఉన్న విబేధాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. టీపీసీసీ రేవంత్‌ రెడ్డిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు విరుచుకుపడుతున్నారు. రేవంత్‌ వల్ల కాంగ్రెస్‌ పార్టీకి తీవ్ర నష్టంగా జరిగిందన్నారు. మునుగోడు ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలుపుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది.

    ఏపీలోనూ..

    ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్‌ కీలక సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. కాగా, మునుగోడు ఉప ఎన్నిక అంశంపై కాంగ్రెస్‌ పార్టీ ఏఐసీసీ సెక్రటరీలతో మంగళవారం రాత్రి ఇంచార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ సమావేశమయ్యారు. సర్వే నివేదికల ఆధారంగా నేతల అభిప్రాయాలపై సమీక్ష నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. గాంధీభవన్‌లో బుధవారం కూడా మాణిక్యం ఠాగూర్‌.. కాంగ్రెస్‌ నేతలతో కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. ఉదయం మునుగోడుకు సంబంధించి స్ట్రాటజీ కమిటీని నియమించింది. ఈ కమిటీలోని సభ్యులతో బుధవారం ఉదయం ఠాగూర్‌ సమావేశం కానున్నారు. అలాగే, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలతో కూడా ఠాగూర్‌ భేటీ కానున్నారు. అ‍యితే, ఈ వరుస భేటీల్లో మునుగోడుపైనే చర్చించనున్నట్టు తెలుస్తోంది.

    తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి, అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పినప్పటికీ.. ఆయన మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తనదైన స్టైలిలో అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మరోవైపు మాణిక్కం ఠాగూర్ సీనియర్ల అభిప్రాయాలు, సలహాలను పట్టించుకోకుండా కేవలం రేవంత్ రెడ్డికి మాత్రమే అనుకూలంగా వుంటున్నారని ఆయనపై కొందరు సీనియర్ నేతలు భగ్గుమంటున్నారు. దాసోజు శ్రవణ్ కూడా వెళ్తూ వెళ్తూ ఇదే రకమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Congress, Telangana Politics

    తదుపరి వార్తలు