రాహుల్ గాంధీ పర్యటన (Rahul Gandhi Telangana Tour)తో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. వరంగల్ సభ (Congress Warangal Declaration)తో కాంగ్రెస్ పార్టీల కొత్త జోష్ కనిపిస్తోంది. బహిరంగ సూపర్ సక్సెస్ అయిందని.. రాహుల్ గాంధీ అద్భుతంగా ప్రసంగించారని.. కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. ఐతే రాహుల్ పర్యటన నేపథ్యంలో ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిన్న వరంగల్ సభ సందర్భంగా.. రాహుల్ గాంధీ చేతికి కాంగ్రెస్ పార్టీకి చెందిన ములుగు ఎమ్మెల్యే సీతక్క (Mulugu mla Seethakka) కాశీ తాడును కట్టారు. ఆ సమయలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పక్కనే ఉన్నారు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ చేతిని పట్టుకోగా.. సీతక్క తాడును కట్టారు. ఆ ఫొటోను కాంగ్రెస్ పార్టీ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇంత వరకు బాగానే ఉంది. కానీ సీతక్కను ఎమ్మెల్యే అనకుండా.. 'మహిళా రైతు' అని పేర్కొనడమే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఆ ఊరు ఉద్యోగుల ఖిల్లా.. 80 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు.. అంతమందికి ఉద్యోగాలు ఎలా వచ్చాయంటే?
'ఓ మహిళా రైతు రాహుల్ గాంధీ చేతికి కాశీదారం కట్టింది. కాంగ్రెస్ అంటే మార్పును తీసుకొచ్చే ఒక నమ్మకం. తెలంగాణ మార్పును కోరుకుంటోంది.' అని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.
Congress is no less to BJP on creating Fake perceptions...
The lady in the picture isn't a Farmer but a Congress MLA ..
Kisan ke naam pe Raajneeti ! pic.twitter.com/KmT7WwiMZU
— krishanKTRS (@krishanKTRS) May 7, 2022
సీతక్క గురించి కాంగ్రెస్ పార్టీ చేసిన ఇప్పుడు చర్చనీయాంశమైంది. సీతక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. ములుగు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ ప్రజల్లో ఆమెకు ఎంతో మంచి పేరుంది. జననేతగా పిలుచుకుంటారు. ఆడంబరాలకు పోకుండా.. సామాన్య మనిషిలా బతుకుతారు. నిత్యం జనాల్లో తిరుగుతూ వారి కష్ట సుఖాలను తెలుసుకుంటారు. చేతనయినంత సాయం చేస్తుంటారు. లాక్డౌన్ సమయంలో మండుటెండల్లోనూ గిరిజన ప్రాంతాల్లో తిరుగుతూ స్వయంగా నిత్యావసర సరుకులు అందించి..అందరి నుంచి ప్రశంసలు అందుకున్నారు. అలాంటి సీతక్క గురించి కాంగ్రెస్ పార్టీకి తెలియదా? ఎమ్మెల్యే అని కాకుండా.. మహిళా రైతు అని పేర్కొంటారా? ఆమె అభిమానులు విమర్శిస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన.. రెండో రోజు షెడ్యూల్ ఇదే..
మరోవైపు ఈ ట్వీట్‌పై టీఆర్ఎస్ పార్టీ (TRS Party) తమదైన స్టైల్లో విమర్శలు గుప్పించింది. రైతు పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆ పార్టీ నేత క్రిశాంక్ ట్వీట్ చేశారు. ''తప్పుడు ప్రచారం చేయడంలో బీజేకీ కంటే కాంగ్రెస్ ఏమాత్రమూ తక్కువ కాదు. ఆ ఫొటోలో ఉన్న మహిళ.. రైతుకాదు.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. రైతు పేరుతో రాజకీయాలు చేస్తున్నారు.'' అని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా ఆ ట్వీట్పైఎవరికి వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సీతక్క అభిమానులేమో.. ఆమెను కాంగ్రెస్ పార్టీ అవమానించిందని అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీయేమో.. రైతుల పేరుతో రాజకీయాం చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తోంది. ఐతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం.. ఇది అడ్మిన్ తప్పిందం వల్ల జరిగిందని.. ఢిల్లీలో ఉండే వారికి సీతక్క గురించి తెలియకపోవచ్చు.. అంత మాత్రానికే.. ఇంత రచ్చ చేయాలని అని ప్రశ్నిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, MLA seethakka, Rahul Gandhi, Telangana