హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rahul Gandhi:రైతు డిక్లరేషన్ కాదు కాంగ్రెస్‌ ఇస్తున్న గ్యారెంటీ..2లక్షల రుణమాఫీ చేస్తాం

Rahul Gandhi:రైతు డిక్లరేషన్ కాదు కాంగ్రెస్‌ ఇస్తున్న గ్యారెంటీ..2లక్షల రుణమాఫీ చేస్తాం

(కాంగ్రెస్ రైతు డిక్లరేషన్)

(కాంగ్రెస్ రైతు డిక్లరేషన్)

Rahul Gandhi:తెలంగాణ ఏర్పాటు వల్ల రాష్ట్రంలో రైతుల జీవితాలు ఏమాత్రం మెరుగుపడలేదని కాంగ్రెస్‌ పార్టీ అభిప్రాయపడింది. అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రైతులు మేలు జరిగేలా రైతు డిక్లరేషన్‌ చేసింది. వరంగల్ రైతు సంఘర్షణ సభ వేదికపై ఈ డిక్లరేషన్‌ని ప్రకటించారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.

ఇంకా చదవండి ...

తెలంగాణ (Telangana)రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ Congress పార్టీ పోరాడుతోంది. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి అధికారం కట్టబెడితే రాష్ట్ర రైతాంగానికి మేలు చేస్తామని చెబుతోంది. ఇందులో భాగంగానే వరంగల్‌Warangalలో నిర్వహించిన రైతు సంఘర్షణ సభ వేదికగా రైతు డిక్లరేషన్‌Farmer Declaration‌ని ప్రకటించింది. ఈ డిక్లరేషన్‌ ఎన్నికల కోసమో, సెంటిమెంట్‌తోనో కాదన్న పార్టీ నేతలు..తెలంగాణతో కాంగ్రెస్‌కు ఉన్న పేగుబంధాన్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునేందుకు చేపడుతున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ రైతు భరోసా(Indiramma raithu bharosa) కింద ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫి చేస్తామని కౌలు, భూమి కలిగిన రైతులకు 15వేల రూపాయల పెట్టుబడి సాయం అందిస్తామంది. అలాగే ఉపాధి హామీ నమోదు చేసుకున్న రైతు కూలీలకు 12 వేల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించింది. పంటలకు మెరుగైన గిట్టుబాటు ధరను కల్పించడమే కాకుండా చివరి గింజ వరకు కొనుగోలు చేసి రైతును రాజుగా మారుస్తామని మాటిచ్చింది. ముఖ్యంగా రాష్ట్రంలో పండించే వరి ధాన్యాన్ని క్వింటా 1960 రూపాయల నుంచి 2500రూపాయల వరకు చెల్లిస్తామని డిక్లరేషన్‌లో ప్రకటించింది. అలాగే మొక్కజొన్నకు 2200 రూపాయలు, కందులు... 6300 రూపాయల నుంచి 6700 చెల్లిస్తామని హామీ ఇచ్చింది. పత్తి క్వింటాకు 6025 నుంచి 6500 చెల్లిస్తామని కాంగ్రెస్‌ భరోసా ఇచ్చింది. మిర్చి 15000 రూపాయలు, పసుపు 12000రూపాయలు, ఎర్రజొన్న, చెరుకు 4000 చెల్లిస్తామని డిక్లరేషన్ చేసింది కాంగ్రెస్‌ పార్టీ.

రైతు సంఘర్షణ సభలో డిక్లరేషన్..

రాష్ట్ర రైతాంగంపై భారం పడకుండా మెరుగాన పంటలకు బీమా కల్పిస్తామని..నష్టపరిహారం అందజేస్తామని కాంగ్రెస్‌ పార్టీ వరంగల్ రైతు సభ వేదికగా స్పష్టం చేసింది. రైతు కూలీలకు రైతు బీమాతో పాటు ఉపాధి హామీ వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని ప్రకటించింది. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులు, ఆదివాసీలకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని కాంగ్రెస్‌ పార్టీ రైతు డిక్లరేషన్‌లో పేర్కొంది. రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్‌ కోసం ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్‌ని రద్దు చేసి ప్రజలు, రైతుల భూములకు రక్షణ కల్పించేలా సరికొత్త రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపింది.


రైతును రాజుగా మారుస్తాం..

రాష్ట్ర రైతాంగానికి నకిలీ విత్తనాలు అరికట్టి రైతుల నష్టపోవడానికి బాధ్యులవుతున్న వారిపై పీడీ యాక్ట్ మోపుతామని ప్రకటించిం కాంగ్రెస్‌ పార్టీ. నకిలీ విత్తనాలను నివారించడానికి కఠిన చట్టాలు అమలు చేస్తామని కారణమైన వ్యక్తుల ఆస్తులను జప్తు చేస్తామని తెలిపింది. వీటితో పాటు తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి ..చివరి ఎకరా వరకు నీళ్లు అందిస్తామని తెలిపింది. రైతుల హక్కుల పరిరక్షణకు రైతు కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు నూతవ వ్యవసాయ విధానం ద్వారా లాభసాటి సాగు విధానాలను ప్రవేశపెడతామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. రాష్ట్రంలో మూతబడిన చెరుకు కర్మాగారాలను తెరిపించి పరిశ్రమలు, చెరుకు రైతులకు మేలు చేస్తామని ప్రకటించింది. పసుపు బోర్డు ఏర్పాటు చేసి రైతును రాజుగా మార్చడమే లక్ష్యంగా ఈ రైతు డిక్లరేషన్‌ని ప్రకటించింది.

First published:

Tags: Congress ts, Rahul Gandhi, Warangal

ఉత్తమ కథలు