హోమ్ /వార్తలు /తెలంగాణ /

Munugodu-Congress: తెలంగాణ కాంగ్రెస్‌కు షాక్.. మునుగోడు ఉప ఎన్నికల్లో డిపాజిట్ గల్లంతు

Munugodu-Congress: తెలంగాణ కాంగ్రెస్‌కు షాక్.. మునుగోడు ఉప ఎన్నికల్లో డిపాజిట్ గల్లంతు

రేవంత్ రెడ్డి, పాల్వాయి స్రవంతి (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి, పాల్వాయి స్రవంతి (ఫైల్ ఫోటో)

Congress: ఓట్ల లెక్కింపు ప్రక్రియ చివరి దశకు చేరుకున్న తరుణంలో.. కాంగ్రెస్ పార్టీ మరోసారి డిపాజిట్ కోల్పోవడం దాదాపు ఖాయమైంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మరోసారి పరాభవం ఎదురైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి ఆ పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడంతో.. కాంగ్రెస్ (Congress) పార్టీ ఈ సీటును మళ్లీ దక్కించుకునేందుకు అందరికంటే ముందుగానే రంగంలోకి దిగింది. ఇక్కడ గెలుపు కాకపోయినా.. గౌరవప్రదమైన ఫలితాలు సాధించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో పలుసార్లు గెలిచిన ఎమ్మెల్యేగా గెలిచిన దివంగత నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి (Palvai Sravanti) కూతురు పాల్వాయి స్రవంతికి టికెట్ ఇచ్చింది. అయితే టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీగా సాగిన ఎన్నికల సంగ్రామంలో పాల్వాయి స్రవంతి నిలవలేకపోయారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రచారం చేసినా.. ఒకరకంగా పాల్వాయి స్రవంతి ఈ నియోజకవర్గంలో ఒంటరి పోరాటం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో 90 శాతానికి పోలింగ్ జరగడంతో.. కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు ఓట్లు సాధిస్తుంది ? డిపాజిట్ దక్కించుకుని పరువు నిలుపుకుంటుందా ? అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు.

అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియ చివరి దశకు చేరుకున్న తరుణంలో.. కాంగ్రెస్ పార్టీ మరోసారి డిపాజిట్ కోల్పోవడం దాదాపు ఖాయమైంది. ఏదైనా ఎన్నికల్లో డిపాజిట్ దక్కాలంటే.. మొత్తం పోలైన ఓట్లలో కనీసం 1/6 ఓట్లు సదరు అభ్యర్థికి పోల్ అవాలి. లేనిపక్షంలో సదరు అభ్యర్థి డిపాజిట్ గల్లంతు అయినట్టు లెక్క. మునుగోడులో(Munugodu) మొత్తం 2,41,805 మంది ఓటర్లకుగాను 2,25,192 మంది ఓటు వేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కలుపుకొని 93.41 శాతం నమోదైంది.

ఈ పరిస్థితుల్లో ఏ అభ్యర్థి అయినా డిపాజిట్ దక్కించుకోవాలంటే 37500 ఓట్లకు పైగా తెచ్చుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ సంఖ్యకు చాలా దూరంలో నిలిచిపోయింది. కానీ కాంగ్రెస్ ఓట్ల సంఖ్య 30 వేల లోపే పరిమితమైంది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికతో పోల్చితే.. కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఓట్లు లభించినా.. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఆ పార్టీ డిపాజిట్ దక్కించుకోవడంలో విఫలమైంది.

Munugode Bypoll Result: మునుగోడు ఎన్నికలో నైతికంగా గెలిచింది బీజేపీనే .. ఈటల రాజేందర్‌ ఈక్వేషన్ కరెక్టేనా..!

Munugodu By Poll: మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆలస్యం.. ఎన్నికల ప్రధానాధికారి ఏమన్నారంటే..

అయితే టీఆర్ఎస్ , బీజేపీతో పోల్చితే మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధించిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే రాజగోపాల్ రెడ్డి ఓటమికి కూడా కాంగ్రెస్ సాధించిన ఓట్లే అనే చర్చ కూడా సాగుతోంది. తనతో పాటు కాంగ్రెస్ క్యాడర్, ఓట్లను పూర్తిస్థాయిలో బీజేపీ వైపు తీసుకెళ్లాలని రాజగోపాల్ రెడ్డి భావించారు. తనతో పాటుగానే కాంగ్రెస్ క్యాడర్, ఓటు మొత్తం బీజేపీ వైపు వచ్చేస్తుందని లెక్కలు వేసుకున్నారు. కానీ హుజూరాబాద్ తరహాలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పూర్తిగా గల్లంతు కాలేదు. పాల్వాయి స్రవంతి 20 వేలకు పైగా ఓట్లు రావడంతో.. ఆ ఓటు బ్యాంకులో కనీసం రాజగోపాల్ రెడ్డికి వచ్చినా పరిస్థితి మరోలా ఉండేదనే చర్చ బీజేపీ వర్గాల్లో సాగుతోంది. మొత్తానికి మునుగోడులో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయినప్పటికీ.. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని ఓడించడంలో ఆ పార్టీ పాత్ర ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

First published:

Tags: Congress, Munugodu By Election, Telangana

ఉత్తమ కథలు